
సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పతనం తప్పదని ఎమ్‌ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా పేర్కొన్నారు. జిల్లాలోని కుసుమంచి శివాలయంలో ఆయన సోమవారం పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు పోటీగా తమ నేతృత్వంలోని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అధర్మ పాలన కొనసాగుతోందన్నారు. దానిని తొలగించేందుకు తమకు ఆశీస్సులు అందించాలని పర్యంటించే ప్రాంతాల్లోని ఆలయాల్లో బస చేస్తూ పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆనాడే మోసం చేశాడని, ఇప్పుడు దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కూడా లాక్కుంటూ వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగల నుంచి బ్రహ్మణ కులం వరకు అందరూ కేసీఆర్ ప్రభుత్వంలో వివక్షకు గురవుతున్నారన్నారు. 11 మంది మాదిగ ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోడం వివక్షకు నిదర్శనమన్నారు. తెలంగాణ వస్తే పాలించేది కేసీఆర్ అని తాను ముందే హెచ్చారించానని, అదే జరిగిందని మంద కృష్ణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment