manada krishna madiga
-
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పతనం ఖాయం: మంద
సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పతనం తప్పదని ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా పేర్కొన్నారు. జిల్లాలోని కుసుమంచి శివాలయంలో ఆయన సోమవారం పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు పోటీగా తమ నేతృత్వంలోని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అధర్మ పాలన కొనసాగుతోందన్నారు. దానిని తొలగించేందుకు తమకు ఆశీస్సులు అందించాలని పర్యంటించే ప్రాంతాల్లోని ఆలయాల్లో బస చేస్తూ పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆనాడే మోసం చేశాడని, ఇప్పుడు దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కూడా లాక్కుంటూ వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగల నుంచి బ్రహ్మణ కులం వరకు అందరూ కేసీఆర్ ప్రభుత్వంలో వివక్షకు గురవుతున్నారన్నారు. 11 మంది మాదిగ ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోడం వివక్షకు నిదర్శనమన్నారు. తెలంగాణ వస్తే పాలించేది కేసీఆర్ అని తాను ముందే హెచ్చారించానని, అదే జరిగిందని మంద కృష్ణ పేర్కొన్నారు. -
కేసీఆర్ను సీఎంగా వ్యతిరేకించాలి: మందకృష్ణ
హైదరాబాద్ : కేసీఆర్ను సీఎంగా వ్యతిరేకించాలని మహాజన్ సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణకు తొలి సీఎం దళితుడేనని పన్నెండేళ్లుగా నమ్మించి మోసం చేసిన కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రశ్నించకపోతే భవిష్యత్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో దళితుల పాత్ర ఎంతో ఉందని, ఉద్యమంలో పాల్గొన్న కళాకారుల్లో 90 శాతం వుంది, ఆత్మత్యాగం చేసుకున్న వారిలో 30 శాతం వుంది దళితులేనన్నారు. సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ ప్రచార కార్యదర్శి రాగటి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ మాదిగ, మాల మహానాడు నేత ఆగమయ్య, బీఎన్ నరేష్కుమార్, కాశన్న, ధర్మన్న బాబు, లాలయ్య, కె. శంకర్ పాల్గొన్నారు. -
దొంగతనం చేసి పార్టీ నడపాలా?
ఖమ్మం/నడిగూడెం: ‘ఇప్పటి వరకు బ యట ఉండి అనేక ఉద్యమాలు చేశాం.. ఇకపై చట్టసభలకు వెళ్లి అధికార, ప్రతిపక్షాలను నిలదీయాలని పార్టీ పెడి తే దాని కోసం ఒక్క రూ పాయి ఖర్చు పెట్టే నాయకుడు లేరు.. ఇలా అయితే పార్టీని బతికిం చడం ఎలా.. దొంగతనం చేయా లా..’ అని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కార్యకర్తలను ప్రశ్నించా రు. ఒక్కో నాయకుడు రూ.లక్ష సమకూర్చాల్సిందేనని అన్నారు. ఖమ్మంలో ఆదివారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ దళిత ద్రోహి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దళితద్రోహి అని మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా నడిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పదవిపై ఆయన మాటమార్చి దళితులను మోసం చేశాడని విమర్శించారు. దామోదర రాజనర్సింహ సీఎం కావాల్సిన సమయంలో కేంద్రం కావాలనే రాష్ట్రపతి పాలన విధించిందన్నారు. చంద్రబాబు తెలంగాణను అడ్డుకొని, ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటున్నాడని విమర్శించారు.