దొంగతనం చేసి పార్టీ నడపాలా? | how to run party without money, ask manda krishna madiga | Sakshi
Sakshi News home page

దొంగతనం చేసి పార్టీ నడపాలా?

Published Mon, Mar 10 2014 5:05 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

దొంగతనం చేసి పార్టీ నడపాలా? - Sakshi

దొంగతనం చేసి పార్టీ నడపాలా?

ఖమ్మం/నడిగూడెం: ‘ఇప్పటి వరకు బ యట ఉండి అనేక ఉద్యమాలు చేశాం.. ఇకపై చట్టసభలకు వెళ్లి అధికార, ప్రతిపక్షాలను నిలదీయాలని పార్టీ పెడి తే దాని కోసం ఒక్క రూ పాయి ఖర్చు పెట్టే నాయకుడు లేరు.. ఇలా అయితే పార్టీని బతికిం చడం ఎలా.. దొంగతనం చేయా లా..’ అని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కార్యకర్తలను ప్రశ్నించా రు. ఒక్కో నాయకుడు రూ.లక్ష సమకూర్చాల్సిందేనని అన్నారు. ఖమ్మంలో ఆదివారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
 
కేసీఆర్ దళిత ద్రోహి
టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దళితద్రోహి అని మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా నడిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పదవిపై ఆయన మాటమార్చి దళితులను మోసం చేశాడని విమర్శించారు.  దామోదర రాజనర్సింహ సీఎం కావాల్సిన సమయంలో కేంద్రం కావాలనే రాష్ట్రపతి పాలన విధించిందన్నారు.  చంద్రబాబు తెలంగాణను అడ్డుకొని, ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటున్నాడని విమర్శించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement