
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి మనవడు, మర్రి ఆదిత్యరెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్నేళ్లుగా మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్యరెడ్డి, తాజాగా పూర్తి స్థాయి ప్రజాజీవితంలోకి ప్రవేశించారు.
రైతులు ఆదాయం పెంచడం, యువత, మహిళలు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు. కరోనా సమయంలో అనేకమందికి సహాయం అందించారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బాటలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1969లో జరిగిన తొలితరం తెలంగాణ ఉద్యమానికి మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, అనేక రాష్ట్రాల గవర్నర్‌గా మర్రి చెన్నారెడ్డి విశేష సేవలందించారు. తాజాగా మర్రి ఆదిత్యరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment