Marri Aditya Reddy
-
తండ్రి దారి చూసుకున్నారు.! కొడుకు సంగతేంటీ?
కొందరి చరిత్ర ఘనంగా ఉంటుంది. వర్తమానం గందరగోళంగా ఉంటుంది. దీంతో భవిష్యత్ శూన్యంగా కనిపిస్తుంది. తెలంగాణలో ఒక యువనేత పరిస్థితి అలాగే తయారైంది. తాత ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి గొప్ప నాయకుడు అనిపించుకున్నారు. తండ్రి కూడా కాంగ్రెస్‌లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తండ్రి పార్టీ మారాడు..మరి కొడుకు హస్తం పార్టీలో ఉంటారా? తండ్రి బాటలో నడుస్తారా? చరిత్ర ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం మర్రి ఆదిత్యరెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. తాత మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గానూ పనిచేశారు. తెలంగాణలో ప్రముఖ నేతగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా చేశారు. యూపీఏ హయాంలో కేంద్రంలో విపత్తు నిర్వహణ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. మర్రి కుటుంబ చరిత్ర ఎంతో ఘనం. కాని చెన్నారెడ్డి మూడో తరానికి చెందిన ఒక వారసుడి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందనే చర్చ ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త తరం .. కొత్త ఛాలెంజ్ మర్రి శశిథర్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఢిల్లీ వెళ్ళి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. శశిధర్‌తో పాటు మరో కుమారుడు పురూరవరెడ్డి కూడా తండ్రితో బాటలోనే నడిచి కాషాయ కండువా కప్పుకున్నారు. తన కుటుంబ ఘనమైన చరిత్ర చూసైనా తనకు పార్టీలో విలువ ఇవ్వడంలేదని కినుక వహించిన శశిధర్‌రెడ్డి గాంధీభవన్ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు శశిధర్ మరో కుమారుడు ఆదిత్య రెడ్డి వంతు వచ్చింది. ఆదిత్య తన తండ్రి, సోదరుడి బాటలో నడుస్తారా? లేక తాత వారసత్వాన్ని కొనసాగిస్తారా? అంటూ చర్చ సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి టీజేఎస్‌లో చేరిన ఆదిత్యరెడ్డి తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు పూర్తవ్వగానే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. పునరాగమనం తర్వాత ఆదిత్యరెడ్డి కాంగ్రెస్‌లోన యాక్టివ్గానే ఉంటున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్న కుటుంబమే అయినా.. శశిధర్‌రెడ్డి హస్తానికి హ్యాండిచ్చారు. ఇప్పుడు తండ్రి, సోదరుడు పార్టీ మారడంతో తాను కూడా వారి బాటలో నడవాలా లేక కాంగ్రెస్‌లో కొనసాగాలా అనే విషయాన్ని తేల్చుకోలేక మీమాంసలో పడ్డారు ఆదిత్య రెడ్డి. ఢిల్లీ సరే, గల్లీలో సంగతేంటీ? మర్రి చెన్నారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి పేరే ఉంది. తాతకు ఉన్న పేరు ప్రతిష్టలను ఉపయోగించుకుని కాంగ్రెస్‌లోనే రాజకీయంగా ఎదగాలని ఆదిత్య రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గతంలో తండ్రి పోటీ చేసి గెలిచిన సనత్ నగర్ లేదంటే తాండూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్ ఎలా రూపొందించుకోవాలో అనే విషయంపై కొద్ది రోజుల్లోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. మరి తాత..తండ్రి దారుల్లో ఏ దారి ఎంచుకుంటారో ? ఎలా నడుస్తారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కాంగ్రెస్‌లో చేరిన చెన్నారెడ్డి మనవడు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి మనవడు, మర్రి ఆదిత్యరెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్నేళ్లుగా మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్యరెడ్డి, తాజాగా పూర్తి స్థాయి ప్రజాజీవితంలోకి ప్రవేశించారు. రైతులు ఆదాయం పెంచడం, యువత, మహిళలు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు. కరోనా సమయంలో అనేకమందికి సహాయం అందించారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బాటలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1969లో జరిగిన తొలితరం తెలంగాణ ఉద్యమానికి మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, అనేక రాష్ట్రాల గవర్నర్‌గా మర్రి చెన్నారెడ్డి విశేష సేవలందించారు. తాజాగా మర్రి ఆదిత్యరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
పెద్ద నోట్ల రద్దుతో కుంటుపడిన అభివృద్ధి
పడిపోయిన జాతీయ స్థూల ఆదాయం జనవేదన సమ్మేళన్ జిల్లా కోఆర్డినేటర్ మర్రి ఆదిత్యరెడ్డి వరంగల్ : కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడంతో దేశంలో అభివృద్ధి కుంటుపడిందని జనవేదన సమ్మెళన్ జిల్లా కోఆర్డినేటర్ మర్రి ఆదిత్యరెడ్డి అన్నారు. డీసీసీ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అభివృద్ధి తిరోగమన దిశలో పడిందన్నారు. ఈ రద్దుతో జాతీయ స్థూల ఆదాయం 2 శాతం కంటె ఎక్కువ పడిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 50 రోజుల్లో రూ.లక్షా 28వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రం, రాష్టంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణమని దీనికి వ్యతిరేకంగా గ్రామ, మండల స్థాయిల్లో ప్రజలను జాగృతం చేసి ఈనెల 27న హైదరాబాద్ తిరుమలగిరిలోని జయలక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న జనవేదన సమ్మెళనంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అజ్మతుల్లా హుస్సేనీ, గ్రేటర్ కాంగ్రెస్ అ«ధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మంద వినోద్‌కుమార్, లక్ష్మారెడ్డి, మానుపాటి శ్రీను, మండల వెంకన్న, సంజీవరెడ్డి, విజయ్, అయూబ్, రాధా, లక్ష్మణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.