సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతతత్వం పెరుగుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. అన్ని కులాలకు భవనాలు కట్టి.. ఇస్లామిక్ సెంటర్‌ను ఎందుకు నిర్మించలేదని ప్రవ్నించారు. మెట్రో రైలును పాతబస్తీలో ఎందుకు విస్తరించలేదని నిలదీశారు. ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు.
మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులను కలవడం మంచిదేనని అసుదుద్దీన్ తెలిపారు. అయితే కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ ప్రమోట్ చేస్తున్నట్లు కనిస్తోందన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు దూరం కాకూడదని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి గురించి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చదవండి: ముగిసిన టీ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment