సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ తీరును మంత్రి అంబటి రాంబాబు ఎండగట్టారు. ట్విటర్ వేదికగా చురకలు అట్టించారు. ‘‘పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని.. స్వర్గంలో ఉన్న తన తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?’’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
మంత్రి అంబటి మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు! గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు!’’ అంటూ లోకేష్ పాదయాత్రపై మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్: నారాయణ స్వామి
పవన్ నీచ రాజకీయాలను డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలియని పవన్‌కల్యాణ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. బూతులు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు.
చదవండి: పవన్.. అప్పుడు ‘తీవ్రవాది’ ఎందుకు బయటకు రాలేదు ?
14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును కాపుల కోసం ఏమి చేశారని పవన్ ఏనాడైనా అడిగారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. దాని గడువు ముగిసిన వెంటనే జగన్ మరో 20ఏళ్లు పొడిగించారని దీనిపై పవన్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడంలేదని నారాయణస్వామి అన్నారు.
పవిత్రమైన దీపారాధనతో
— Ambati Rambabu (@AmbatiRambabu) January 27, 2023
సిగరెట్టు ముట్టించుకునే వాడని
స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే
పుత్రుడు సమాజానికి అవసరమా ?@JanaSenaParty
ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా
— Ambati Rambabu (@AmbatiRambabu) January 27, 2023
నలుపు నలుపే గానీ తెలుపు రాదు !
గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు
పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు !@naralokesh
Comments
Please login to add a commentAdd a comment