సాక్షి, ఢిల్లీ: రూ.48 వేల కోట్ల ఆర్థిక అవకతకవలు జరిగాయన్న టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటూ టీడీపీ ఆరోపణలను మంత్రి తప్పుబట్టారు.
‘‘2022-23 ఏపీ బడ్జెట్ చూశాక టీడీపీకి అంకెల గారడి అని మాట్లాడే పరిస్థితి లేదు. రూ.48 వేల కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. బ్యాంక్ ట్రాన్జాక్షన్ తప్పుగా జరిగే పరిస్థితి లేదు. వేల కోట్ల ప్రజా ధనం ఎలా దుర్వినియోగం అవుతుంది’’ అని మంత్రి ప్రశ్నించారు. సీఎఫ్ఎంఎస్ నుంచి తప్పులు సరిదిద్దడానికి సమయం పడుతుంది. 48,509 కోట్లు స్పెషల్ బిల్లుల రూపంలో ఉన్నాయి.
చదవండి: టీడీపీకి వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్
15 అంశాల వారీగా ప్రతి దానికీ పద్దు ఉంది. నిధులు దుర్వినియోగం జరగలేదు. అంశాల వారీగా కాగ్‌కు నివేదిక ఇచ్చాం. అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిందించడం తప్పు. 2018-19లో టీడీపీవి కుడా 98 వేల బుక్ అడ్జెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను టీడీపీ ప్రయివేట్ వ్యక్తి చేతిలో పెట్టింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించాం. ఒక రోజు ఆదాయం వచ్చిందని, ఒకరోజు రాలేదని ఆరోపణలు చేస్తారని.. యనమల రామకృష్ణుడు ఎదో ఒక స్టాండ్ తీసుకోవాలని’’ మంత్రి ధ్వజమెత్తారు.
టీడీపీ ప్రభుత్వం రూ.68 వేల కోట్ల బకాయిలు పెట్టినందుకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలా?. పోలవరం, రాజధానిపై మీ నిర్వాకాలకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలా ?. బ్రీఫ్డ్ మీ అన్నందుకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలా?’’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. నోటుకు ఓటు కేసు, ఫైబర్ గ్రిడ్, టిడ్కోపై సీబీఐ విచారణకు సిద్ధమా ? అంటూ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు.
‘‘2020-21లో 30 వేల కోట్ల ఆదాయం తగ్గినా కోవిడ్ పరిస్థితుల్లో సామాన్యులను కాపాడుకున్నాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానివి డిబిటి పథకాలు. వైసీపీ ప్రభుత్వం దేనికి ఎంత ఖర్చు చేసిందో అన్ని లెక్కలు ఉన్నాయి. 2017-18 టీడీపీ హయాంలో రూ.82 వేల కోట్లు కనపడని ఖర్చు ఉంది. అంటే ఈ నిధులు దుర్వినియోగం అయ్యాయా?. టీడీపీ 59 వేల కోట్లు వేస్ అఫ్ మిన్స్ తీసుకుని రూ.130 కోట్లు పెండింగ్‌లో పెట్టింది. పేదవాడి కోసం మేము అప్పు చేశాం. టీడీపీ హయాంలో కత్తెర, ఇస్త్రీ పెట్టేల కోసం అప్పులు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పిల్లల చదువు కోసం అప్పు చేస్తుంది. ఏపీలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ పెట్టాలని 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే వాదన మొదలెట్టారని దుయ్యబట్టారు. కాగ్‌కు పూర్తిస్థాయి వివరాలు అందజేశామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment