సాక్షి, కరీంనగర్: రైతులను ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలో నాగంపేట గ్రామంలో ధూమ్‌దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులపై కేంద్రమంత్రి కుమారుడు కారెక్కిస్తే చర్యలు లేవు.. ఇదేనా రైతుల పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కైనా జాతీయ హోదా కల్పించారా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. (చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి అభ్యంతరం)
‘‘ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రైతు బంధు ఇచ్చిన పార్టీ టీఆర్‌ఎస్. త్వరలో రైతు రుణమాఫీ చేస్తాం. నియోజకవర్గానికి నెలకు రెండుసార్లు వస్తా. అభివృద్ధికి సహకరిస్తా. బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారు. ఏం చేయని బీజేపీ పార్టీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని’’ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.
చదవండి: గాంధీభవన్‌లోకి గాడ్సేలు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment