Bip
-
ఇదేనా రైతుల పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ: హరీష్‌రావు
సాక్షి, కరీంనగర్: రైతులను ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలో నాగంపేట గ్రామంలో ధూమ్‌దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులపై కేంద్రమంత్రి కుమారుడు కారెక్కిస్తే చర్యలు లేవు.. ఇదేనా రైతుల పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కైనా జాతీయ హోదా కల్పించారా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. (చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి అభ్యంతరం) ‘‘ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రైతు బంధు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్. త్వరలో రైతు రుణమాఫీ చేస్తాం. నియోజకవర్గానికి నెలకు రెండుసార్లు వస్తా. అభివృద్ధికి సహకరిస్తా. బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారు. ఏం చేయని బీజేపీ పార్టీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని’’ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు. చదవండి: గాంధీభవన్‌లోకి గాడ్సేలు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -
‘టీడీపీ ఓడిపోవడంతో బీజేపీలో చేరారు’
సాక్షి, అమరావతి: బీజేపీలో చేరిన టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రానికి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తప్పుడు సమాచారంపై జాగ్రత్త వహించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా గతంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తులు టీడీపీ ఓడిపోవడంతో బీజేపీ పంచన చేరారని తెలిపారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం) మీరు ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు తాము అందుబాటులో ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తి సంక్షోభవంలోకి నెట్టేసిందన్నారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని ఆదుకునేందుకు రూ.17,904 కోట్లను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ పెంచలేదని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ కో లాంటి సంస్థలు ముందుకు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. -
గుజరాత్‌ను మించిన మహా ప్రగతి
పింప్రి, న్యూస్‌లైన్: మోడీ పదేపదే చెబుతున్న గుజరాత్ అభివృద్ధి కన్నా మహారాష్ట్రనే అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వజిత్ కదమ్‌కు మద్దతుగా నగరంలోని ఎస్ఎస్పీఎంఎస్ మైదానంలో మంగళవారం ఉదయం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ...బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి పాలనలోని మహారాష్ట్రనే అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని తెలిపారు. దీనిపై బీజేపీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల సమస్యల నుంచి రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోను బీజేపీ దొంగిలించిందని మండిపడ్డారు. ‘గుజరాత్లో పేదరికం ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరు పస్తులు ఉంటున్నారు. మహిళలు, కూలీలు కష్టపడుతున్నారు. వారి బాగోగుల గురించి మోడీ ఏనాడూ పట్టించుకోలేద’న్నారు. అక్కడి పరిస్థితిని గురించి ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. గుజరాత్లో 40 శాతం మంది పేదలున్నారని, కనీసం వారికి మంచినీటి అవసరాలు తీర్చలేని మోడీ దేశాన్ని ఉద్ధరిస్తారంటే నమ్మేవాళ్లు లేరన్నారు. పుణే దేశంలోనే మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ అని, ఇకపై వస్తువులపై ‘మేడిన్ ఇండియా’ ఉండదని, మేడిన్ పుణే, బెంగళూరు, ముంబై అని ఉంటుందని తెలిపారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. గడిచిన పదేళ్లుగా నిరుద్యోగాన్ని దూరం చేయడంతో పాటు 15 కోట్ల మందిని పేదరికం నుంచి దూరం చేశామన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మోహన్ ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అభయ్ ఛాజెడ్, ఎన్సీపీ నగర అధ్యక్షుడు వందనా చౌహాన్, కాంగ్రెస్ శాసన సభ్యులు మోహన్ జోషీ, వినాయక్ నిమ్హాన్, రమేష్ భాగవే తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.