సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రధాని మోదీ చేపట్టనున్న రాష్ట్ర పర్యటనతో సీఎం కేసీఆర్ కుటుంబానికి భయం పట్టుకుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ప్రధాని పర్యటనపై కేసీఆర్ కుటుంబం తప్పుడు, విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
మోదీ టూర్‌ను అడ్డుకోవడానికి పలు వురిని రెచ్చగొట్టి ధర్నాలు చేయాలంటూ ప్రోత్సహిస్తోందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఈ నెల 12న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని పర్యటనపై టీఆర్‌ఎస్, వామపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ తోక పార్టీలుగా మారిన వామపక్షాలకు ప్రధాని పర్యటనను అడ్డుకొనే హక్కు లేదని.. ప్రజలు ఇప్పటికే వామపక్ష పార్టీలను తిరస్కరించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. సిద్ధాంతా ల ఆధారంగా పనిచేసే రాజకీయ పార్టీలు... కుటుంబ సిద్ధాంతాలు, స్వప్రయోజనాల కోసం పనిచేసే పార్టీల కోసం పనిచేయ రాదని కిషన్‌రెడ్డి సూచించారు.
రాజకీయ విభేదాలు పక్కన పెట్టండి..
రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను, రాజ కీయ వైరుధ్యాలను పక్కనపెట్టి ప్రధాని పర్య టనలో పాల్గొనాలని కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి కోరారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని పర్యటన సందర్భంగా విజ్ఞతతో వ్యవహరించిన విష యాన్ని సీఎం గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు సహకరించుకుంటూ పనిచేయాల న్నారు. రాజకీయాల్లో పట్టువిడుపులు సహజ మేనని... తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం తన హుందాతనాన్ని నిలుపుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. కర్మాగార ప్రారంభో త్సవానికి విచ్చేయాలంటూ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి స్వయంగా ఆహ్వాన లేఖ పంపారన్నారు. గతంలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు అడ్డురాని భేష జాలు.. జాతికి అంకితం చేస్తున్నప్పుడు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు.
సింగరేణి ప్రైవేటీకరణ తప్పుడు ప్రచారమే..
సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరించనుందంటూ జరుగుతున్నదంతా తప్పుడు ప్రచార మని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణిలో 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పుడు కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని ప్రశ్నించారు. అయినా సింగరేణి బొగ్గు గనుల వద్ద.. సంస్థను ప్రైవేటీకరించొద్దంటూ బోర్డులు పెట్టి ప్రజల్లో, కార్మికుల్లో అనవసర అనుమానా లకు తావిస్తున్నారని విమర్శించారు. అలాగే రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాల్సిన అవ సరం కేంద్రానికి లేదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment