![Minister Kodali nani Challenge To TDP Chief Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/6/kodali-nani123.jpg.webp?itok=4jrX3gl5)
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దించి నువ్వు(చంద్రబాబు) కుర్చీ ఎక్కితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. నిరంతరం తప్పుడు కథనాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ఈనాడు, ఈటీవీ, టీవీ 5, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇది అమలు చేస్తున్నామని తెలిపారు.
‘చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా. సీఎంగా జగన్‌ని దించి నువ్వు కుర్చీ ఎక్కితే నేను రాజకీయాలు వదిలి వెళ్లిపోతా. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్, రింగురోడ్డు నువ్వే వేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. ఎవరో చేసినదాన్ని నువ్వు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎంగిలిమెతుకుల కోసం పాకులాడే తత్వం నీది. కుల పత్రికలు, కుల టీవీలు పెట్టుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూడొద్దు. రాష్ట్రానికి పట్టిన వైరస్, శని చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment