
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేశామంటూ పార్లమెంటులో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించడంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంత పెద్ద అబద్ధమా...మీరు తెలంగాణ హృదయాన్ని గాయపరిచారు’అంటూ ట్వీట్ చేశారు. ‘దేశంలో లైఫ్‌సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు నిరాకరించడం ద్వారా మీరు దేశానికి తీరని అన్యాయం చేశారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రజలనే కాకుండా అత్యంత గౌరవ ప్రతిష్టలను కలిగిన పార్లమెంటును తప్పుదోవ పట్టించారు. ఇందుకు కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలి. ఈ విషయంలో హక్కుల తీర్మానం ప్రతిపాదించాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు గారిని కోరుతున్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment