bulk drug park
-
2,002 ఎకరాల్లో బల్క్‌డ్రగ్ పార్క్
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2,001.8 ఎకరాల్లో బల్‌్కడ్రగ్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ఈ బల్‌్కడ్రగ్ పార్కును ఈపీసీ విధానంలో నిర్మించడానికి ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. రూ.1,234.75 కోట్లతో బల్‌్కడ్రగ్ పార్కును డిజైన్ చేసి అభివృద్ధి చేసే విధంగా ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 2001.8 ఎకరాల్లో.. 139.07 ఎకరాల్లో ఉన్న చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ధి చేసిన పార్కులో 1,009.85 ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలు, 595.4 ఎకరాల్లో ఏపీఐ–డీఐఎస్ సింథసిస్, 414.1 ఎకరాల్లో ఫెర్మిటేషన్స్, 150 ఎకరాలు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే విధంగా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. మార్చి 18 నాటికి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తిచేసి పనులు అప్పగించనున్నారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు బల్‌్కడ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే.. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ఈ పార్కును కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత కాకినాడ వద్ద నిర్మించడానికి ప్రయత్నం చేయగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలన్న నిబంధన మేరకు నక్కపల్లి వద్ద పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఫార్మాహబ్‌గా ఏపీ ఈ బల్‌్కడ్రగ్ పార్కుతో రాష్ట్రం ఫార్మాహబ్‌గా ఎదగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 300కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. ఈ బల్క్ డ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే 100కు పైగా ఫార్మా కంపెనీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. వీటిద్వారా 27,360 మందికి ప్రత్యక్షంగా ఉపాధికి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం దేశీయ ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం 16 శాతం వాటాతో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.41,500 కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు వస్తుండగా.. అందులో రూ.8,300 కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2,400 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఇప్పటికే మైలాన్, ఫైజర్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో వంటి 60కి పైగా దిగ్గజసంస్థలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ బల్‌్కడ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
బల్క్ డ్రగ్ పార్కు స్థలం మార్పునకు కేంద్రం ఆమోదం
సాక్షి, అమరావతి: బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రూ.2,190 కోట్లతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందు కోసం రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. అయితే, ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో కాకినాడ నుంచి నక్కపల్లి ప్రాంతానికి ఈ పార్కును మార్చారు. నక్కపల్లి వద్ద ఏపీఐఐసీ భూమి అందుబాటులో ఉండటం, అక్కడ ఇప్పటికే ఫార్మా రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లను న్యాయ పరిశీలనకు (జ్యుడిíÙయల్ ప్రివ్యూకు) పంపుతామని ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. న్యాయపరిశీలన అనంతరం ఆమోదం రాగానే టెండర్లు పిలుస్తామని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను అరికట్టాలన్న ఉద్దేశంతో దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ వంటి 16 రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. పూర్తిగా పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మా హబ్‌గా తయారవుతుందని, రూ.14,340 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. ఇక్కడ 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200కు పైగా ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్కు ద్వారా అదనంగా 100కు పైగా యూనిట్లు వస్తాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. -
బల్క్ డ్రగ్ పార్క్‌కు వెయ్యి కోట్ల సాయం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయదలచిన బల్క్ డ్రగ్ పార్క్‌లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో మౌలిక వసతుల కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలో బల్క్ డ్రగ్ పార్క్‌ల ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో ఎయిర్ కార్గో టెర్మినల్, విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ వంటి రవాణా వసతులు సిద్ధంగా ఉన్నందున ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా దేశీయ వినియోగంతోపాటు, ఎగుమతులకు అవసరమైన మందుల తయారీకి అనువైన వాతావరణ పరిస్థితుల కల్పనే ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. ఈ పథకం మార్గదర్శకాలను అనుసరించి బల్క్ డ్రగ్ పార్క్‌లో ఏర్పాటయ్యే ఫార్మా పరిశ్రమలకు ఫార్వార్డ్, బాక్వార్డ్ లింకేజీతో మద్దతుతో కనెక్టివిటీని కల్పించే అవకాశాల ప్రాతిపదికపైనే వాటిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయం జరిగిందని మంత్రి తెలిపారు. కర్నూలు కేన్సర్ ఆస్పత్రికి రూ. 72 కోట్లు కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాలతో ఏర్పాటు చేస్తున్న కేన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం కేంద్రం తన వాటా కింద 72 కోట్ల రూపాయలు భరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ కేన్సర్ చికిత్స కోసం దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలలో కేన్సర్ ఇన్స్టిట్యూట్లు, 20 టెరిషియరీ కేర్ కేన్సర్ సెంటర్లు నెలకొల్పాలన్న నిర్ణయంలో భాగంగానే కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్ర స్థాయి కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం కర్నూలు మెడికల్ కాలేజీకి ఇప్పటి వరకు 54 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌లో కేన్సర్ చికిత్సలో భాగంగా సర్జికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ సేవలను 2021లోనే ప్రారంభించగా ఎయిమ్స్‌లోని మెడికల్, సర్జికల్ స్పెషలిస్టులు అందరూ కేన్సర్‌కు చికిత్స అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు. -
ఇంత పెద్ద అబద్ధమా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేశామంటూ పార్లమెంటులో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించడంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంత పెద్ద అబద్ధమా...మీరు తెలంగాణ హృదయాన్ని గాయపరిచారు’అంటూ ట్వీట్ చేశారు. ‘దేశంలో లైఫ్‌సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు నిరాకరించడం ద్వారా మీరు దేశానికి తీరని అన్యాయం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలనే కాకుండా అత్యంత గౌరవ ప్రతిష్టలను కలిగిన పార్లమెంటును తప్పుదోవ పట్టించారు. ఇందుకు కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలి. ఈ విషయంలో హక్కుల తీర్మానం ప్రతిపాదించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు గారిని కోరుతున్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణకు గుడ్ న్యూస్.. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు.. కేంద్రమంత్రి సమాధానమిస్తూ దేశంలో 12వేలకుపైగా దేశంలో ఫార్మా సంస్థలున్నాయని వివరించారు. పీఎల్ఐ పథకంలో భాగంగా 2020–21 నుంచి 2024–25 మధ్య దేశంలో మూడు చోట్ల బల్క్ డ్రగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క పార్కుకు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్కులకు ఆమోదం తెలిపామన్నారు. ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్‌కు రూ.584.04 కోట్లు దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్‌కు 2021–22లో గత నవంబర్ 28 నాటికి రూ.584.04 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మిషన్‌కు రూ.4,176.84 కోట్లు కేటాయించినట్లు ఎంపీ నామా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.102.91 కోట్లు కేటాయించామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏపీలో 43137 మంది, తెలంగాణలో 32854 మంది ఆశా వర్కర్లు ఉన్నారని టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఇదీ చదవండి: బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష -
ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
ఉనా/చంబా: దేశంలో గత ప్రభుత్వాలు ఉద్ధరించిందేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇతర దేశాల్లో గత శతాబ్దంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సైతం మన ప్రభుత్వాలు ప్రజలకు కల్పించలేకపోయాయని ఆక్షేపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో మోదీ గురువారం పర్యటించారు. ఉనా, చంబాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. హరోలీలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఉనాలో ‘ఐఐఐటీ–ఉనా’ను ప్రారంభించారు. చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉనాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. దేశంలో ఇది నాలుగో వందేభారత్ రైలు కావడం విశేషం. రాష్ట్రంలో పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. హిమాచల్‌లో ప్రతి ఎన్నికలో అధికార పార్టీని ఓడించే సంప్రదాయం ఈసారి ఆగిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘డబుల్–ఇంజన్’ ప్రభుత్వాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఉద్ఘాటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఇక్కడ అభివృద్ధి యజ్ఞం జరుగుతోందని అన్నారు. 20వ శతాబ్దంతోపాటు 21వ శతాబ్దపు సౌకర్యాలను కూడా ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. 21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని, మన దేశం సవాళ్లను అధిగమిస్తూ శరవేగంగా పురోగమిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ స్టైలే వేరు బీజేపీ వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుందని మోదీ చెప్పారు. అడ్డంకులు సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, తప్పుదోవ పట్టించడం వంటి వాటికి తమ పాలనలో స్థానం లేదన్నారు. నిర్ణయాలు తీసుకుంటామని, తీర్మానాలు చేస్తామని, వాటిని అమలు పరుస్తామని, చివరకు ఫలితాలు చూపిస్తామని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊపందుకుందన్నారు. 3,125 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన–3’ని చంబాలో మోదీ ప్రారంభించారు. డబుల్–ఇంజన్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని తెలిపారు. ప్రధాని ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉనా నుంచి ఢిల్లీకి బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణిస్తుంది. -
గుజరాత్‌పై అర్బన్ నక్సల్స్ కన్ను: మోదీ
బరూచ్(గుజరాత్): కొత్త రూపంలో అర్బన్ నక్సల్స్ తొలిసారిగా గుజరాత్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ బరూచ్ జిల్లాలో దేశంలోనే తొలి బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘ అర్బన్ నక్సల్ కన్ను గుజరాత్‌పై పడింది. శక్తియుక్తులున్న గుజరాతీ అమాయక ఆదివాసీ యువతను వారు లక్ష్యంగా చేసుకుందామనుకుంటున్నారు. అయితే వీరి ఆటలు ఇక్కడ సాగవు. వారిని రాష్ట్రం తరిమికొడుతుంది’ అని మోదీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా గుజరాత్ ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆప్‌నుద్దేశిస్తూ మోదీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్‌ను మేథాపాట్కర్ వంటి వారు అడ్డుకోవడాన్ని అభివృద్ధి నిరోధక అర్బన్ నక్సలైట్లుగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అభివర్ణించారు. మేథా పాట్కర్ గతంలో ఆప్ టికెట్‌పై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. బరూచ్ ఫార్మా పార్క్ అందుబాటులోకి వచ్చాక బల్క్ డ్రగ్స్‌లో భారత్ స్వావలంబన సాధిస్తుందని మోదీ అన్నారు. పటేల్ ఏకంచేశారు. కానీ నెహ్రూ.. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో సోమవారం ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘సర్దార్ పటేల్ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేశారు. కానీ ఒక్క వ్యక్తి జమ్మూకశ్మీర్ అంశాన్ని నెత్తినేసుకుని ఎటూ తేల్చకుండా వదిలేశారు’ అని నెహ్రూపై విమర్శలు చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యను పటేల్ స్ఫూర్తితో పరిష్కరించి ఆయనకు నివాళులర్పించానన్నారు. -
బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా
యాల పొద్దుగాల. తుప్పర్లు బడ్తున్నయి. విజయవాడ కండ్లు దెరుస్తున్నది. సీపురు కట్ట బట్కోని సపాయోల్లు తొవ్వలు ఊక్తున్నరు. పాలపాకెట్లు అమ్మెటోల్లు పాలపాకిట్లు అమ్ముతున్నరు. బాసండ్లు తోమెతంద్కు పనిమన్సులు బోతున్నరు. వేరె గల్లి కెల్లి వొచ్చిన కుక్కను జూసి గల్లి కుక్కలు మొర్గుతున్నయి. కొంతమంది లీడర్లు సుత గప్పుడే నిద్ర లేసిండ్రు. మోటర్ల ఎన్క గూసున్నోల్లు గూడ సీటు బెల్టు బెట్టు కోవాలని జెప్తున్నరు. మంత్రి కుర్సికి ఆకర్కి ముక్యమంత్రి కుర్సికి గుడ్క సీటు బెల్టు బెట్టుకుంటె మంచిగుంటదని లీడర్లు అన్కుంటున్నరు. గట్ల జేస్తె సచ్చెదాంక కుర్సిమీద గూసుండొచ్చు. ఎలచ్చన్లు, గిలచ్చన్లు లేకుండబోతె మజా చెయ్యొచ్చని గాల్లు జెప్తున్నరు. తొమ్మిది గొట్టింది. తుప్పర్లు బందైనయి. మబ్బుల సాటుకెల్లి సూర్యుడెల్లిండు. పల్చటి ఎండ గొట్టబట్టింది. టీడీపీ లీడర్ యనమల రామకిష్నుడు కాఫి దాగిండు. ఆరాం కుర్సిల గూసోని పేపర్ సద్వబట్టిండు. ఏం కొంప మున్గిందేమొగని ఒక విలేకరి గాయిన తాన్కి బోయిండు. ‘నమస్తే సార్’ అని అన్నడు. ‘నమస్తే. ఏందివయా యాల పొద్దుగాలే వొచ్చినవ్’ అని యనమల అడిగిండు. ‘బల్క్ డ్రగ్ పార్క్ మా రాస్ట్రంల బెట్టుండ్రి అంటె మా రాస్ట్రంల బెట్టుండ్రనుకుంట పదిహేడు రాస్ట్రాలు దర్కాస్తు బెడ్తె మూడు రాస్ట్రాలల్ల బెట్టెతంద్కు పర్మిషన్ ఇచ్చిండ్రు. గా మూడు రాస్ట్రాలల్ల మన ఆంద్రప్రదేశ్ గూడ ఉన్నది గదా’. ‘అవ్ ఉన్నది’. ‘మన రాస్ట్రంల బల్క్ డ్రగ్ పార్క్ బెట్టొద్దని సంటర్కు కారటెందుకేసిండ్రు’. ‘గదిగిన బెడ్తె కాకినాడ కాడ రైతుల బత్కులే గాకుంట బెస్తోల్ల బత్కులు బండలైతయి. గాలి, నీల్లు కరాబైతయి’. ‘గవి కరాబ్ గాకుంట ట్రీట్మెంట్ ప్లాంట్ బెడ్తరు. గది బెడ్తెనే బల్క్ డ్రగ్ పార్క్‌కు పర్మిషనిస్తరు. గా పార్క్ తోని ఇర్వై వేల మందికి కొల్వులు దొరుక్తయి. గంతేగాకుంట గాదాంట్ల రోగాలు తక్వజేసేటి మందులు తయారు జేస్తరు’. ‘అన్ని రోగాలు తక్వ జేసేటి మందుండంగ గా మందుల్తోని పనేమున్నది. మందుగొడ్తె ముసలోడు గుడ్క మైకేల్ జాక్సన్ లెక్క డాన్సు జేస్తడు. కీసల పైసలేనోడు గూడ అమరావతి బూములు గొంటనంటడు. ఏబీసీడీలు రానోడు సుత అంగ్రేజిల మాడ్లాడ్తడు. మొన్నటిదాంక మా అయ్యన్న పాత్రున్కి విశాక డిస్టిలరి ఉండె. మా వియ్యంకునికి పి.ఎం.కె. డిస్టిలరి ఉన్నది. ఆదికేశవులు నాయుడికి శ్రీకిష్న డిస్టిలరి ఉన్నది. గివన్ని మా చెంద్రబాబు జమానకెల్లే నడుస్తున్నయి. గివన్ని ఉండంగ వేరె బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు? బ్రాంది తాగినోడు బ్రహ్మలోకమున కేగు విస్కిగొట్టినోడు విష్ణువు చెంత జేరు ఏమి తాగనోడు ఎడ్డోడు చెడ్డోడు మందు భాగ్యశీల మరి మాటలేల’ అని యనమల పద్దెం బాడిండు. ‘వహ్వా! వహ్వా! క్యా ఖూబ్’ అన్కుంట విలేకరి బోయిండు. ఒక దిక్కు గిట్లుంటె ఇంకో దిక్కు లోకేశ్, చెంద్రబాబు తాన్కి బోయిండు. ‘నాయినా! నాయినా!’ అని బిల్సిండు. ‘ఏం గావాలె బిడ్డా!’ అని చెంద్రబాబు అడిగిండు. ‘రాహుల్ గాంది బారత్ జోడో యాత్ర జేస్తుండే’. ‘గాయిన జేస్తె నీకేందిరా?’ ‘నేను గూడ ఏపీ జోడో యాత్ర జేస్తనే’. ‘నువ్వు జేసుడెందుకు?’ ‘రాహుల్ గాందిని అందరు పప్పు అంటరు. నన్ను గూడ పప్పనే అంటున్నరు. పెద్ద పప్పు పాదయాత్ర జేస్తుండంగ చిన్న పప్పు జెయ్యకుంటె ఏం బాగుంటదే’. ‘రాజకీయాలు ఎన్నడు నేర్సుకుంటవురా. చెట్టు మనది గాకున్నా పండ్లు మనమే దీస్కోవాలె. పంట మనం పండియ్యకున్నా పంటంత మనదే అనాలె’. ‘గదెట్లనే’. ‘వొచ్చెపారి బాలకిష్ననే ముక్యమంత్రి క్యాండేట్ అనాలె. మా కాక అన్కుంట జూనియర్ ఎన్టీఆర్ గాయిన దిక్కుకెల్లి ప్రచారం జేస్తడు. మల్లొక పారి టీడీపీ సర్కారొస్తది. బాలకిష్న ముక్యమంత్రి అయితడు’. (క్లిక్ చేయండి: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘మా మామ ముక్యమంత్రి అయితె నాకేం ఫాయిద?’ ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు బొడ్సి నేను ముక్యమంత్రిని గాలేదా? నా తీర్గనే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు బొడ్సి నువ్వు ముక్యమంత్రివి గావొచ్చు. షార్ట్‌కట్ ఉండంగ పాదయాత్రలు, గీదయాత్రలు మనకెంద్కు బిడ్డా’ అని చెంద్రబాబు అన్నడు. దాంతోని లోకేశ్ బోది చెట్టు కింది బుద్దుడయ్యిండు. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బల్క్‌డ్రగ్ పార్కుపై దుష్టచతుష్టయం కుట్ర
తుని: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి సాధించిన బల్క్ డ్రగ్ పార్కును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు, దుష్టచతుష్టయం కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే రకరకాల లేఖలు రాస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో.. పని చేస్తోందని దుయ్యబట్టారు. ఆయన శనివారం తునిలో విలేకరులతో మాట్లాడారు. పెరుమాళ్లపురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు విషయంలో సీఎం జగన్మోహన్రెడ్డి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని చెప్పారు. మత్స్యకారులకు, హేచరీలకు ఇబ్బంది లేకుండా ఉన్నతస్థాయిలో పరిశీలన, పరీక్షలు చేశారని, కలుషిత నీటిని శుద్ధి చేసి 53 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో వదిలే ఏర్పాట్లు చేశారని వివరించారు. కోనసీమలో అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ సీఎంను అభినందిస్తున్నారని చెప్పారు. విపక్షాలు, దుష్టచతుష్టయం మాత్రం కాలుష్యమంటూ దీనిని అడ్డుకొంటున్నారని అన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో టీడీపీ ప్రభుత్వం దివీస్ మందుల పరిశ్రమకు అనుమతులు ఇచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా... అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును ప్రశ్నించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ మార్కెట్, మట్కా, పేకాట, వైట్‌కాలర్ మోసగాళ్లు ఏ మేర ప్రజలను మోసం చేశారో.. దుష్టచతుష్టయమైన చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి అంతకు మించి ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఒకరు కిరసనాయిల్, మరొకరు పచ్చళ్లు, ఇంకొకరు హెయిర్ ఆయిల్ వ్యాపారం పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారన్నారు. దుష్టచతుష్టయం బారి నుంచి కేసీఆర్ తెలంగాణను రక్షించుకున్నారని, ఇప్పుడు మన రాష్ట్రంపై హైదరాబాద్‌లో ఉండి బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాత్రమే సీఎంగా ఉండాలన్నది వీరి కుటిల నీతి అని అన్నారు. కరోనా తర్వాత దేశంలో అత్యధిక జీడీపీ సాధించిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని మంత్రి గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అయితే అదంతా తానే చేశానని చంద్రబాబు అనడం.. దానిని ఎల్లో మీడియా వండి వార్చడం పరిపాటిగా మారిందన్నారు. ప్రజల ముందుకు వచ్చి యాత్ర చేస్తే గుణపాఠం చెబుతారని చెప్పారు. అమరావతి 26 గ్రామాలకే సంపదను కట్టబెట్టి, మిగిలిన రాష్ట్రంలోని ప్రజలను బిచ్చగాళ్లను చేయాలని చూశారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. -
ఆంధ్రకు వరం ఈ కొత్త ‘పార్క్’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అంతర్భాగం పారిశ్రామిక ప్రగతి. దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సహజ వనరులు, మానవ వనరులు గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం అవుతాయి. అదే సమయంలో సర్వజనుల అవసరాలు తీరుతాయి. ఇవి ప్రజల ప్రాణాలకు సంబంధించినవి అయినప్పుడు వారి జీవన ప్రమాణ స్థాయి కూడా పెంచుతాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా మన రాష్ట్రానికి కేటాయించిన ‘బల్క్ డ్రగ్ పార్క్’ (బీడీపీ) మనకు ఈ ప్రయోజనాలు అన్నింటినీ కలుగజేయనున్నది. శక్తిమంతమైన పొరుగు రాష్ట్రాలను కాదని కేంద్రం దీనిని మనకు ఇవ్వటం గమనార్హం. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే కర్ణాటకలోనూ ఉన్నా... దాన్ని పక్కన పెట్టి మన రాష్ట్రానికి ప్రాధాన్యత నివ్వటం హర్షణీయం. ‘బల్క్ డ్రగ్ పార్క్’ కేటాయించడానికి కేవలం కేంద్ర ఉదారత మాత్రమే కారణం కాదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్డు, రైలు, నౌకా రవాణా, విద్యుత్తు, నీటి సదుపాయాలు లాంటి మానవ నిర్మిత, సహజ మౌలిక సదుపాయాలు అనేకం ఉన్నాయి. విదేశీ వాణిజ్యానికి కావాల్సిన ఓడరేవులున్న తీరప్రాంతం ఉంది. నైపుణ్య మానవ వనరులు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు గోదావరి జిల్లాల్లో విజయ వంతంగా నడుస్తున్న పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా బల్క్ డ్రగ్స్‌కు కావాల్సిన అనేక రకాల రసాయనాలు, ఇతర ముడి పదార్థాలు సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న సంస్థలు అనేకం ఉన్నాయి. ఇటీవల నూతనంగా సామర్లకోటలో ఆదిత్య బిర్లా గ్రూపు నెలకొల్పిన ‘ఆల్కలీ’ పరిశ్రమ కూడా రాబోవు పార్క్ అవసరాలను మరింతగా తీర్చగలదు. ఫార్మా రాజధానిగా పేరుగాంచిన హైదరాబాదులో ఎన్నో ఫార్మా కంపెనీలను సృష్టించి అంతరించిన ఐడీపీఎల్ ఉండేది. దానికి అవసరమైన సమస్త రసాయనాలు, ఆమ్లాలు, వాయు వులు అనేకం తణుకు, కొవ్వూరు, సగ్గొండ ఫ్యాక్టరీల నుండి సప్లై అవుతుండేవి. వ్యవసాయాధార చక్కెర కర్మాగారాలు రైతు శ్రేయస్సు కొరకు తణుకు, చాగల్లు, ఉయ్యూరు లాంటి చోట్ల నెలకొని ఉన్నాయి. ఆ కర్మాగారాలలో చక్కెరతో పాటు మొలాసిస్ వస్తుంది. దాని నుండి ఆల్కహాల్, ఇతర ఆర్గానిక్ రసాయనాలు తయారు చేస్తారు. అవి బల్క్ డ్రగ్స్ తయారీలో వాడతారు. వీటి కారణం గానే ఇప్పటికే తణుకులో ఆస్ప్రిన్, సాలిసిలిక్ యాసిడ్ తయారీ జరుగుతోంది. అంతరిక్ష నౌకల్లో వాడే రాకెట్ లిక్విడ్ ఇంధనం కూడా తణుకులోనే తయారవడానికి ఈ రసాయనాల లభ్యత ముఖ్య కారణం. తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే ఈ బీడీపీలోని సంస్థలకు ఇవన్నీ అమర్చి పెట్టినట్లు అందుబాటులో ఉంటాయి. ఈ పార్క్ కేటాయింపులో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఉంటారు. ఈ పార్క్‌లో ఫార్ములేషన్, ప్యాకింగ్, టెస్టింగ్ లాబ్స్, రవాణా, ఫైనాన్స్ లాంటి అనుబంధ సంస్థలు వస్తాయి. అందువల్ల మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాలుష్య నివారణ, నియంత్రణ, పారిశ్రామిక భద్రత, సామాజిక బాధ్యత వంటి విషయాల్లో ఎలాంటి రాజీ పడని సీఎం నేతృత్వంలో.. రాష్ట్రం పారిశ్రామిక వృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశిద్దాం. (క్లిక్: శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి) - బి. లలితానంద ప్రసాద్ కార్పొరేట్ వ్యవహారాల నిపుణులు -
పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం.. ఎంత నీచ రాజకీయం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను అడ్డుకునే పనిలో పడిందా? ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి రాసిన ఒక లేఖను చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. ఇందుకు టీడీపీ బరితెగించిందంటే వారి లక్ష్యం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఈ లేఖ రాశానని యనమల ప్రకటించినట్లు కూడా సమాచారం వచ్చింది. తన పేరుతో ఇలాంటి లేఖ రాస్తే పార్టీకి బాగా నష్టం వస్తుందని సందేహించి యనమలతో చంద్రబాబు రాయించారని అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే కాకినాడ జిల్లాలో కోన అనే ప్రాంతం వద్ద సుమారు 8500 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్ చేపట్టడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పార్కు కోసం తెలంగాణ, తమిళనాడుతో సహా పదిహేడే రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కేంద్రం అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని హిమచల్ ప్రదేశ్, గుజరాత్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. తొంభై రోజులలో డిపిఆర్ పంపితే సుమారు వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించి ప్రాధమిక సదుపాయాలు కల్పించడానికి సహకరించనుంది. ఇది అంతా సంతోషించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు రావడానికి ఉన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది ఒక నిదర్శనం. ఈ బల్క్ డ్రగ్ పార్కు తెలంగాణకు ఇవ్వకపోవడం అన్యాయమని ఆ రాష్ట్ర మీడియా విమర్శిస్తోంది. ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయంలో తెలంగాణ పై వివక్ష చూపిందంటూ కేంద్రంపై మండిపడుతున్నారు. కాని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పార్కును ఏపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నది. ఒకవేళ కేంద్రం కనుక తెలంగాణకు ఈ పార్కును ఇచ్చి ఉంటే ఇదే టీడీపీ, ఇదే టీడీపీ మీడియా ఎంతగా గగ్గోలు పెట్టేవి. పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేసేది. యనమల దీనిని వ్యతిరేకిస్తూ లేఖ రాసినా టీడీపీ మీడియా కిక్కురు మనకుండా ఉండడాన్ని కూడా అర్దం చేసుకోవచ్చు. మరో వైపు గుజరాత్ కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో కనీసం ఇలాంటి పారిశ్రామిక పార్కులు ఇవ్వడం కొంతలో కొంత బెటర్. కాని వైసిపి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. అయినా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బల్క్ డ్రగ్ పార్కును స్వాగతించి ఉంటే ఆ పార్టీ పద్దతిగా ఉన్నట్లు అనిపించేది. యనమల రామకృష్ణుడు ఈ ప్రాజెక్టు ఇవ్వవద్దని ఏకంగా కేంద్ర రసాయనాల శాఖ అదికారులకు లేఖ రాశారు. దానికి కారణం బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతంలో పొల్యూషన్ వస్తుందని అంటున్నారు. మరి టీడీపీ ప్రభుత్వం హయాంలో తుని ప్రాంతంలో కొన్ని కాలుష్య కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం ఆ పరిశ్రమలకు ఎలా మద్దతు ఇచ్చింది? అంటే తమ పార్టీ అదికారంలో ఉంటే పొల్యూషన్ ఉన్నా ఫర్వాలేదని చెబుతున్నారా? వేరే పార్టీ అధికారంలో ఉంటే యాగి చేయాలన్నది వారి లక్ష్యమా? నిజమే..ఎక్కడైనా కాలుష్యం అధికంగా ఉంటే వాటిని అదుపు చేయాలని కోరడం తప్పు కాదు. కాని అసలు పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం. ఎంత నీచ రాజకీయం, పరిశ్రమలు తీసుకురండి. కాని కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పవలసిన నేతలు ఇలా దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారంటే వారు టీడీపీకి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నారా?వద్దనుకుంటున్నారా? నిజంగానే పొల్యూషన్ పై అంత శ్రద్ద ఉంటే, తిరుపతిలో అమర రాజా బాటరీస్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యంపై ప్రభుత్వం నోటీసు ఇస్తే టీడీపీ ఎంత యాగీ చేసింది? వీరికి అంతా చిత్తశుద్ది ఉంటే, టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కృష్ణా కరకట్ట పై ఉన్న అక్రమ భవంతిలో నివసిస్తూ కృష్ణా నది కాలుష్యానికి దోహదపడతారా? ఆ మాటకు వస్తే అసలు మూడు పంటలు పండే పచ్చటి వేల ఎకరాల భూమి సేకరించి రాజదాని నిర్మాణం చేపడతారా? అప్పుడు పర్యావరణ పరిరక్షణ మాట ఏమైపోయింది? ఇప్పటికీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ గొడవ చేస్తోందే? తమ రియల్ ఎస్టేట్ అవసరాలకోసం పర్యావరణం పాడైపోయినా ఫర్వాలేదా? గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్పాలి. 1999 ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మంజూరు చేసిన వంట గ్యాస్ కనెక్షన్ లను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ భావించింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రోశయ్య, పర్వతనేని ఉపేంద్రలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే పిర్యాదు చేస్తారా అని జనంలో ప్రచారం చేశారు. అదే కాదు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని గత టరమ్ లో ఎవరైనా కేంద్రానికి పిర్యాదు చేస్తే, ఇదే చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు ఇంకేముంది పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని విమర్శించేవారు. అమరావతి రాజధాని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నారని ప్తత్యర్ది పార్టీలు ఆరోపిస్తే, తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడుతున్నారని చంద్రబాబు ద్వజమెత్తేవారు. అదికారం కోల్పోయిన తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ పల్లవి మార్చేసింది. ఎక్కడైనా ఎపిలో ఏదైనా మంచి పని జరిగితే దానిని ఎలా అడ్డుకోవాలన్న ఆలోచన చేస్తోంది. చివరికి పేదల ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా కోర్టుకు తీసుకు వెళ్లి అడ్డుపడేయత్నం చేశారు. ఆంగ్ల మీడియం ప్రవేశ పెడుతుంటే తెలుగు నాశనం అవుతోందని గగ్గోలు పెడుతూ ఎపి విద్యార్దులకు కీడు చేయడానికి కూడా వెనుకాడలేదు.ఇప్పుడు ఏకంగా భారీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉన్న బల్క్ డ్రగ్ పార్కునే అడ్డుకునే యత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వస్తే సుమారు ఏబై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పదివేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక అనుబంధ ,ఉప పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడం తెలుగుదేశం కు ఇష్టం లేదని అనుకోవాలి. అందుకే ఇలా అడ్డగోలుగా వ్యతిరేక ప్రచారానికి బరితెగించారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినా అందులో చంద్రబాబు ఈ అంశం గురించి మాట్లాడలేదంటేనే తేలు కుట్టిన దొంగ మాదిరి భయపడ్డారని అనుకోవచ్చా?ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గ్రూపు ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి క నబరుస్తుంటే టీడీపీ మీడియా ఎంత దుర్మార్గంగా కధనాలు ఇస్తున్ది చూస్తున్నాం. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, కాలుష్యకారక పరిశ్రమలపై స్పష్టమైన విదానం ప్రకటించారు. కాలుష్యం అనుమతించే ప్రసక్తి లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వాటిని ప్రారంభిస్తామని అన్నారు. అదే ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ మద్య ఒక కర్మాగారం పొల్యూషన్ ను జీరో స్థాయికి తెచ్చిన తర్వాతే దాని ప్రారంబోత్సవానికి ఆయన హాజరయ్యరు. ఈ విషయాలు యనమల , చంద్రబాబు వంటివారికి తెలియవని కావు.కాని తమను ఓడించిన ఎపి ప్రజల పట్ల కక్షతోనో, ద్వేషంతోనో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు.ఒక వేళ ఎపి ప్రబుత్వం తమకు ఈ పార్కు వద్దని చెబితే ఇదే టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసేది? పెట్టుబడులు రావడం లేదని ఎలా ఆరోపణలు చేసేది. ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలకు పాల్పడుతోంది. ప్రభుత్వంపై విద్వంసం అంటూ ఆరోపణలు గుప్పించే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఇలాంటి పనులు విధ్వంసం కిందకు వస్తాయని గమనించాలి.తాజాగా ఎపికి సమారు లక్షా పతికవేల కోట్ల పరిశ్రమలు రావడానికి అడుగులు పడుతున్నాయి. వాటిని అడ్డుకోకుండా టీడీపీ వ్యవహరిస్తే మంచిదని చెప్పాలి. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియాను ఎదుర్కోవడం ఎత్తు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ను అభినందించాలి. చంద్రబాబు,యనమల వంటివారిని ,దుష్టచతుష్టయంలో భాగంగా ఉన్న మీడియాను ఎదుర్కుంటూ దైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్న్నికలలో ఏమవుతుందన్నది పక్కనబెడితే, రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి పరిశ్రమలను అడ్డుకోకుండా టీడీపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిద్దాం. లేకుంటే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
పరిశ్రమలు వద్దనడమే రాజకీయమా?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీకి వస్తున్న పరిశ్రమలను అడ్డుకునే పనిలో పడిందా? ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి రాసిన ఒక లేఖను చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అయినా బల్క్ డ్రగ్ పార్కును స్వాగతించి ఉంటే ఆ పార్టీ పద్ధతిగా వ్యవహరించిందని అనిపించేది. పెట్టుబడులు రావడం లేదని ఓవైపు ఆరోపిస్తూనే, వస్తున్నవాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వారి ఉద్దేశం స్పష్టం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. కాకినాడ జిల్లా కోన వద్ద సుమారు 8,500 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్ చేపట్టడా నికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పార్కు కోసం తెలంగాణ, తమిళనాడుతో సహా పదిహేడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కేంద్రం అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని హిమచల్ ప్రదేశ్, గుజరాత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. తొంభై రోజులలో ‘డీపీఆర్’ పంపితే సుమారు వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించి ప్రాథమిక సదుపాయాలు కల్పించడానికి సహకరించనుంది. ఇది అంతా సంతోషించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రావడానికి ఉన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ఈ బల్క్ డ్రగ్ పార్కు తెలంగాణకు ఇవ్వక పోవడం అన్యాయమని ఆ రాష్ట్ర మీడియా విమర్శిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంలో కేంద్రం వివక్ష చూపిందంటూ మండిపడుతున్నారు. కానీ తెలుగుదేశం మాత్రం ఈ పార్కును ఏపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నది. ఒకవేళ కేంద్రం తెలంగాణకు ఈ పార్కును ఇచ్చి ఉంటే– ఇదే టీడీపీ, టీడీపీ మీడియా గగ్గోలు పెట్టేవి. పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేసేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఈ లేఖ రాశానని యనమల రామకృష్ణుడు ప్రకటించినట్లు కూడా సమాచారం వచ్చింది. తన పేరుతో ఇలాంటి లేఖ రాస్తే పార్టీకి నష్టం వస్తుందని సందేహించి యనమలతో చంద్రబాబు రాయించారని అనుకోవచ్చు. మరో వైపు గుజరాత్‌కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు స్వాగతించాయి. టీడీపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో, ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. యనమల రామకృష్ణుడు ఈ ప్రాజెక్టు ఇవ్వవద్దని ఏకంగా కేంద్ర రసాయనాల శాఖ అధికారులకు లేఖ రాశారు. దానికి కారణం బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతం కలుషితం అవుతుందని అంటున్నారు. మరి టీడీపీ ప్రభుత్వ హయాంలో తుని ప్రాంతంలో కొన్ని కాలుష్య కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం ఆ పరిశ్రమలకు ఎలా మద్దతు ఇచ్చింది? అంటే తమ పార్టీ అధికారంలో ఉంటే కాలుష్యం ఉన్నా ఫర్వాలేదని చెబుతున్నారా? ఎక్కడైనా కాలుష్యం అధికంగా ఉంటే దాన్ని అదుపు చేయాలని కోరడం తప్పు కాదు. కానీ అసలు పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం! పరిశ్రమలు తీసుకురండి, కానీ కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోండి అని చెప్పవలసిన నేతలు ఇలా దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారంటే వారు టీడీపీకి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నారా, వద్దను కుంటున్నారా? నిజంగానే కాలుష్యంపై అంత శ్రద్ధ ఉంటే, తిరుపతిలో అమర రాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యం గురించి ప్రభుత్వం నోటీసు ఇస్తే టీడీపీ ఎంత యాగీ చేసింది? వీరికి అంత చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు స్వయంగా కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ భవంతిలో నివసిస్తూ కృష్ణా నది కాలుష్యానికి దోహద పడతారా? ఆ మాటకు వస్తే, అసలు మూడు పంటలు పండే పచ్చటి వేల ఎకరాల భూమిని సేకరించి రాజధాని నిర్మాణం చేపడతారా? ఇప్పటికీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ గొడవ చేస్తున్నారే? తమ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం పర్యావరణం పాడైపోయినా ఫర్వాలేదా? గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్పాలి. 1999 ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మంజూరు చేసిన వంటగ్యాస్ కనెక్షన్లను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ భావిం చింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రోశయ్య, పర్వతనేని ఉపేంద్ర కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ఫిర్యాదు చేస్తారా అని జనంలో ప్రచారం చేశారు. అదే కాదు, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని గత టరమ్‌లో ఎవరైనా కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని విమర్శించేవారు. అమరావతి రాజధానిని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నా రని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తే, తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తేవారు. అధికారం కోల్పో యిన తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ పల్లవి మార్చేసింది. ఎక్కడైనా ఏపీలో ఏదైనా మంచి పని జరిగితే దానిని ఎలా అడ్డు కోవాలన్న ఆలోచన చేస్తోంది. చివరికి పేదల ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా కోర్టుకు తీసుకు వెళ్లి అడ్డుపడే యత్నం చేశారు. ఆంగ్ల మీడియం ప్రవేశ పెడుతుంటే తెలుగు నాశనం అవుతోందని గగ్గోలు పెడుతూ విద్యార్థులకు కీడు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు ఏకంగా భారీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉన్న బల్క్ డ్రగ్ పార్కునే అడ్డుకునే యత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వస్తే సుమారు యాభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పది వేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక అనుబంధ, ఉప పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడం తెలుగుదేశంకు ఇష్టం లేదని అనుకోవాలి. అందుకే ఇలా అడ్డగోలుగా వ్యతిరేక ప్రచారానికి బరి తెగించారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినా అందులో చంద్రబాబు ఈ అంశం గురించి మాట్లాడలేదంటేనే తేలు కుట్టిన దొంగ మాదిరి భయపడ్డారని అనుకోవచ్చా? ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుంటే టీడీపీ మీడియా ఎంతో దుర్మార్గంగా కథనాలు ఇస్తోంది. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, కాలుష్య కారక పరిశ్రమలపై స్పష్టమైన విధానం ప్రకటించారు. కాలుష్యాన్ని అనుమతించే ప్రసక్తే లేదనీ, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వాటిని ప్రారంభిస్తామనీ అన్నారు. అదే ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ మధ్య ఒక కర్మాగారం కాలుష్యాన్ని జీరో స్థాయికి తెచ్చిన తర్వాతే దాని ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ విష యాలు యనమల, చంద్రబాబు వంటివారికి తెలియవని కావు. కానీ తమను ఓడించిన ఏపీ ప్రజల పట్ల కక్షతోనో, ద్వేషంతోనో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం తమకు ఈ పార్కు వద్దని చెబితే ఇదే టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసేది! పెట్టుబడులు రావడం లేదని ఎలా ఆరోపణలు చేసేది! ప్రభుత్వంపై విధ్వంసం అంటూ ఆరోపణలు గుప్పించే తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఇలాంటి పనులు నిజంగా విధ్వంసం కిందకు వస్తాయని గమనించాలి. తాజాగా ఏపీకి సుమారు లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రావడానికి అడుగులు పడుతున్నాయి. వాటిని టీడీపీ అడ్డుకోకుండా ఉంటే మంచిది. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియాను ఎదుర్కోవడం మరో ఎత్తు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి. చంద్రబాబు, యనమల వంటివారినీ, దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్న మీడియానూ ఎదుర్కుంటూ ధైర్యంగా ముందుకు సాగు తున్నారు. ఎన్నికలలో ఏమవుతుందన్నది పక్కనబెడితే, ఏపీ భవి ష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి పరిశ్రమలను అడ్డుకోకుండా టీడీపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిద్దాం. లేకుంటే ప్రజలే వారికి గుణ పాఠం చెబుతారు. కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఫార్మా పార్కుపై రాజకీయాలు దుర్మార్గం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా పరిశ్రమ హబ్‌గా రాష్ట్రం నిలవనుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాయడం దారుణమన్నారు. శుక్రవారమిక్కడ సర్క్యూట్ హౌస్‌లో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ ఒకటో తేదీ అంటే చంద్రబాబు, యనమల రామకృష్ణుడికి వెన్నుపోటు పొడిచేందుకు అనుకూలమైన రోజని వ్యాఖ్యానించారు. 1995లో చెట్టు కింద ప్లీడర్ను ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, స్పీకర్‌గా చేసి రాజకీయ భవిష్యత్ ప్రసాదించిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనత యనమలకే దక్కుతుందన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా గెలిపించి రాజకీయ పదవులు కట్టబెట్టిన సొంత జిల్లాకు బల్క్ డ్రగ్స్ పార్క్ వస్తే అడ్డుకుంటూ లేఖలు రాసి మరోసారి వెన్నుపోటుదారుడిగా నిరూపించుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, యనమలను రాష్ట్రం నుంచి ప్రజలు బహిష్కరించాలన్నారు. టీడీపీ నాయకులే కాదు కార్యకర్తలు కూడా చంద్రబాబును పూర్తిగా మరిచిపోయారన్నారు. జైలుకు వెళ్లిన వారికే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకోవడంపై తాము కసరత్తు చేస్తుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు కుప్పంలో ఎలా నెగ్గాలో మల్లగుల్లాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ నియోజకవర్గం దొరక్క చివరికి హిందూపురం నుంచి పోటీ చేయడానికి కోడలిని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అమర్‌రాజా బ్యాటరీస్‌పై మాట్లాడలేదేం? రెండేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో అమర్‌రాజా బ్యాటరీస్ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో కలుషితం జరుగుతోందని ఫిర్యాదు వస్తే చంద్రబాబు, యనమల ఎందుకు స్పందించలేదని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీన్ని ధృవీకరించిందన్నారు. మీ పార్టీకి చెందిన వారి పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడి ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదా? అని నిలదీశారు. హంసలా ఆరు నెలలున్నా చాలు రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా చంద్రబాబుకు నిద్ర పట్టదని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్‌కు యావత్ తెలుగు ప్రజలంతా నివాళులర్పిస్తూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చంద్రబాబు సహించలేక పోతున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కాకిలా కలకాలం ఉండేకన్నా హంసలా ఆరు నెలలు బతికినా చాలన్నారు. -
బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష
సాక్షి, హైదరాబాద్: బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటులో తెలంగాణలోని హైదరాబాద్ ఫార్మాసిటీని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బల్క్‌డ్రగ్ పార్క్ స్కీమ్‌లో తెలంగాణకు చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు శుక్రవారం లేఖ రాశారు. బల్క్‌డ్రగ్ పార్క్‌ల ఏర్పాటుకు హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఏపీ సరసన తెలంగాణకు చోటు దక్కకపోవడాన్ని ప్రశ్నించారు. దేశంలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి వెన్నెముకగా నిలుస్తూ, ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని ఆరోపించారు. 70 శాతానికిపైగా ముడి ఫార్మా ఉత్పత్తుల కోసం చైనాపై భారత్ ఆధార పడుతున్న నేపథ్యంలో బల్క్‌డ్రగ్ తయారీలో దేశీయంగా స్వయం సమృద్ధి సాధించేందుకు బల్క్‌డ్రగ్ పార్క్ స్కీమ్‌ను కేంద్రం తెరపైకి తెచ్చిందన్నారు. తెలంగాణకు బల్క్‌డ్రగ్ పార్కు కేటాయించాలని, హైదరాబాద్ ఫార్మాసిటీలో రెండు వేల ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి తెలియచేస్తూ ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్‌ను కూడా కేంద్రానికి అందజేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులతోపాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. కాలయాపన చేసిన కేంద్ర ప్రభుత్వం బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినా 2021 వరకు కాలయాపన చేసి తాజాగా ప్రకటించిన జాబితాలో తెలంగాణకు చోటు కల్పించకపోవడం శోచనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశీయ ఫార్మా రంగాన్ని ఆత్మ నిర్భర్ వైపు త్వరగా తీసుకువెళ్లాలనే ఉద్దేశం ఉంటే కనీసం రెండు, మూడేళ్లలో పార్కుల అభివృద్ధి పూర్తయ్యే ప్రాంతాలకు బల్క్‌డ్రగ్ పార్కును కేటాయించేదని అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించడంతోపాటు బల్క్‌డ్రగ్ తయారీ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలనే ఆశయానికి మోదీ ప్రభుత్వం గండికొడుతోందని, ఫలితంగా తెలంగాణతోపాటు దేశానికి భారీగా నష్టం జరుగుతుందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం ఇదివరకే గుర్తించినా బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటులో విస్మరించడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. -
AP: ‘బల్క్’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు
మరీ ఇంత దిక్కుమాలిన రాజకీయాలా? పొరుగు రాష్ట్రం తెలంగాణ.. బల్‌్కడ్రగ్ పార్కు తమకివ్వకపోవటం అన్యాయమంటోంది. వివక్ష చూపిందంటూ కేంద్రాన్ని నిందిస్తోంది. ఇక స్వరాష్ట్రం గుజరాత్‌పై ప్రత్యేక అభిమానంతో ప్రధాని దీన్ని కేటాయించారంటూ ప్రశంసాపూర్వక నిందలు కొన్ని పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అలాంటి పార్కు ఏపీకి వస్తే.. ఇక్కడి ప్రతిపక్షం మాత్రం ఇక్కడ పెట్టవద్దంటోంది. దీన్ని నిలిపేయాలంటూ లేఖలపై లేఖలు రాసి... రాద్ధాంతానికి రెడీ అంటోంది. రాష్ట్రానికి పారి శ్రామికవేత్తలు రావటం లేదని విమర్శలు చేసేదీ వీరే!! అభివృద్ధి లేదనే ఆరోపణలూ వీరివే. తీరా భారీ ఎత్తున ఉపాధి కల్పించే బల్క్ డ్రగ్ పార్కును సాధిస్తే.. దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నదీ వీరే!! ఇదీ ఇక్కడి ప్రతిపక్ష టీడీపీ.. దాంతో అంటకాగుతున్న మీడియా తీరు. సాక్షి, అమరావతి: చేతనైతే ఊరికి ఉపకారం చేయాలి.. అపకారం మాత్రం తలపెట్టకూడదు! మాజీ మంత్రి యనమల మాత్రం పురిటిగడ్డకే ద్రోహం తలపెడుతున్నారు! వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు అడ్డుపుల్లలు వేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్టుకుంటున్న విపక్ష టీడీపీ క్షుద్ర రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఔషధాల దిగుమతి తగ్గించుకొని ఫార్మా రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తీవ్ర పోటీ నెలకొన్న ఈ పార్క్‌ల కోసం ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎంపికయ్యాయి. 16 రాష్ట్రాలతో పోటీ పడి మరీ మన రాష్ట్రం దీన్ని సాధించుకుంటే ఆంధ్రపదేశ్‌కు రాకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ మూడు నెలల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడైంది. రూ.వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేల మందికి ఉపాధి కల్పించే ప్రతిష్టాత్మక పార్క్‌ను రాష్ట్రానికి రాకుండా నిరోధించేందుకు టీడీపీ పన్నిన కుట్రలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి, ఎన్జీటీకి రాసిన లేఖల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆపాలంటూ యనమల లేఖలు కాకినాడ సమీపంలో ఫార్మా రంగ పరిశ్రమల ఏర్పాటుతో రైతులు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బల్క్ డ్రగ్ పార్కు వల్ల తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, దీన్ని రద్దు చేయాలంటూ తాజాగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాసిన లేఖలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇవే అంశాలను గత జూలై 16న లేఖ ద్వారా ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయెల్, చెన్నైలోని ఎన్జీటీ సదరన్ జోనల్ కార్యాలయానికి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. చదవండి: ‘కాకినాడ’లో.. బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ స్వాగతం.. ఇక్కడ దుర్బుద్ధి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్కును దక్కించుకుంది. దీంతో ఈ పార్కును రద్దు చేయాలంటూ యనమల మరోసారి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాయడం టీడీపీ దుర్బుద్ధిని బయటపెట్టిందంటూ ఫార్మా నిపుణులు, పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్నారు. ఒకపక్క ప్రధాని మోదీ సొంత రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్కు కేటాయించడాన్ని రాజకీయాలకు అతీతంగా అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ స్వాగతిస్తూ భారీ ప్రకటనలు జారీ చేయగా మన రాష్ట్రంలో మాత్రం ఆ పార్కునే రద్దు చేయాలంటూ టీడీపీ పదేపదే లేఖలు రాయడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తుంటాయని, ఇక్కడ టీడీపీ మాత్రం ప్రతిష్టాత్మక బల్క్ డ్రగ్ పార్కును మన రాష్ట్రం దక్కించుకుంటే అభినందనలు తెలపకపోగా రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయడం దారుణమని ఫార్మా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ రూ.వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్రలపై మండిపడుతున్నారు. యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతించిన కంపెనీలే.. ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, అందుకే బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్నామంటూ యనమల పేర్కొనటంపై సోషల్ మీడియా వేదికగా పలువురు విరుచుకుపడుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏమిటి? అక్కడ వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై కనీస అవగాహన లేకుండా దుగ్ధతో లేఖలు రాయటాన్ని తప్పుబడుతున్నారు. యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి ఉన్న కంపెనీలు మాత్రమే బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటవుతాయని, ఒక్క చుక్క వ్యర్థం బయటకు వచ్చినా వాటి అనుమతులే రద్దు అవుతాయని స్పష్టం చేస్తున్నారు. అందువల్లే ఈ విషయంలో ఫార్మా కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయని ఫార్మా రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. కట్టుదిట్టంగా ట్రీట్మెంట్ ప్లాంట్స్ బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటయ్యే కంపెనీల నుంచి వచ్చే ఘన, ద్రవవ్యర్థాలను శుద్ధిచేసేందుకు ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి వ్యర్థాలు బయటకువెళ్లే అవకాశం ఉండదని నిపుణులు పే ర్కొంటున్నారు. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలున్న హైదరాబాద్‌లో లేని కాలుష్యం కాకినాడకు ఎక్కడి నుంచి వస్తుందంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క రాష్ట్రానికి పరిశ్ర మలు రావడంలేదంటూ దుష్ప్రచారం చేస్తూ మరోపక్క దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే బల్క్‌డ్రగ్ పార్కును ఎందు కు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పార్కుకు అడ్డుపడటం ద్వారా తుని నియోజకవర్గంలో యువతకు ఉపాధి దొరకకుండా యనమల వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గుజరాత్లో స్వాగతిస్తారు రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ రావడం స్వాగతించాల్సిన విషయం. ఇప్పుడు నూతన టెక్నాలజీ ద్వారా పరిశ్రమల వ్యర్థాలను 99 శాతం రీ సైకిల్ చేస్తున్నారు. వ్యర్థాల నియంత్రణకు జీరో లిక్విడ్ డిజార్డ్ (జెడ్‌ఎల్‌డీ) విధానం అందుబాటులో ఉంది. సముద్రంలో 35 వేల పీపీఎం సాల్ట్ ఉంటుంది. దాన్ని రివర్స్ ఆస్మాసిస్ ద్వారా 3 పీపీఎంకి తగ్గిస్తున్నామంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఉన్న అసలైన పొల్యూషన్ పేదరికం, నిరుద్యోగం లాంటివి పోగొట్టాలంటే పరిశ్రమలను పెంచాల్సిందే. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు వస్తే స్వాగతిస్తారు. – ప్రొఫెసర్ మురళీకృష్ణ, జేఎన్టీయూకే, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాజీ సభ్యుడు ఉమ్మడి వ్యర్థ నియంత్రణ వ్యవస్థ బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటయ్యే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఉమ్మడి వ్యర్థ నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. దీంతో ఫార్మా కంపెనీలు సొంతంగా వ్యర్థ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ రేటుకే వ్యర్థాల శుద్ధి అందుబాటులోకి తేవడం కంపెనీలకు కలిసొచ్చే అంశం. – ఈశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఎఫ్‌డీఏ అనుమతులున్నవే దేశంలో ఏర్పాటయ్యే బహుళజాతి ఫార్మా కంపెనీలు యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మన దేశ నిబంధనలతో పోలిస్తే ఇవి చాలా కఠినంగా ఉంటాయి. యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ కంపెనీలు ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తాయి. ఈ విషయం తెలుసుకోకుండా ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యం ఏర్పడుతుందంటూ యనమల నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. – లంకా శ్రీధర్, రాష్ట్ర పెట్టుబడుల సలహాదారు యువతకు ఉపాధి తీర ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. – గంగిరి నాగేంద్ర, కొత్త పెరుమాళ్లపురం, తొండంగి మండలం -
‘కాకినాడ’లో.. బల్క్ డ్రగ్ పార్క్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో ఇది ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఎస్ఎస్సీ (స్కీమ్ స్టీరింగ్ కమిటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ అయిన ఐఎఫ్సీఐ(ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు పంపాలని కేంద్రం కోరింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్స్ విభాగం సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్ డ్రగ్స్ పార్క్‌ల ప్రోత్సాహక పథకం ద్వారా దీన్ని చేపట్టేందుకు అంగీకరిస్తూ వారం రోజుల్లోగా తమకు లేఖ పంపాలని అందులో కోరారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు.. బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలో మూడు ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామని, అందుకోసం ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కాగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2020–23 ప్రకటించింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎనిమిదేళ్లలో పార్క్ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. కేంద్రం ప్రకటించిన పథకం కింద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన పంపాలని, ఒకవేళ ఆమోదించకుంటే సొంతంగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తీవ్ర పోటీలో రాష్ట్రం విజయం.. కేంద్రం ప్రకటించిన పథకం కింద తొండంగి మండలం కేపీ పురం, కోదాడలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 15న ప్రతిపాదనలు పంపింది. బల్క్ డ్రగ్ పార్క్‌ను దక్కించుకునేందుకు మనతోపాటు తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. దేశంలో అత్యాధునిక ఫార్మా సిటీని విశాఖకు సమీపంలోని పరవాడ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫార్మా వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను సీఎం వైఎస్ జగన్ అగ్రగామిగా నిలిపారు. ఈ రెండు అంశాలు రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఫార్మాలో అగ్రగామిగా రాష్ట్రం.. కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించనుంది. తద్వారా భారీ పరిశ్రమలు ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఫార్మా రంగంలో పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోపాటు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద ఎంఎస్ఎంఈ ఫార్మా పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అటు బల్క్ డ్రగ్ పార్క్.. ఇటు ఎంఎస్ఎంఈ ఫార్మా పార్క్‌ల ద్వారా ఫార్మా రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. -
ఏపీ: బల్క్ డ్రగ్ పార్క్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, తూర్పు గోదావరి: రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది కేంద్రం. ఈ మేరకు బల్క్ డ్రగ్ పార్క్‌కు ఆమోదం తెలుపుతూ ఏపీకి కేంద్రం లేఖ రాసింది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడ్డాయి. ఇదీ చదవండి: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!