సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో పెళ్లికానుక ఎగ్గొట్టారని, సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదల బతుకులను కాలరాసే వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు.
‘‘వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద 12 వేల 132 మంది జంటలకు 87.32 కోట్ల డబ్బును సీఎం జగన్ నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు 16 వేల 668 కుటుంబాలకు 125.50 కోట్లు బటన్ నొక్కి కుటుంబాలను ఆదుకున్నారు. గత ప్రభుత్వంలో పెళ్లి కానుక కోసం 17,709 జంటలు దరఖాస్తు చేస్తే 68.90 కోట్లు చంద్రబాబు ఎగ్గొట్టారు. గతంలో పెళ్లికానుకను ఎందుకు ఎగ్గొట్టారో చంద్రాబాబు చెప్పాలి. మోసం చేసి వెళ్లిపోతే జగన్ వచ్చి ఆర్ధిక సాయంపెంచి అమలు చేస్తున్నారు. అక్షరాస్యత పెంచేందుకే పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించాం. ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తుండగా ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నాం’’ అని మంత్రి అన్నారు.
చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
ఎస్సీల్లో కులాంతర వివాహాలు చేసుకున్నవారికి 75 వేలు ఇస్తుండగా ఇప్పుడు 1 లక్ష 20 వేలు బీసీలకు గత ప్రభుత్వంలో 50 వేలు ఇస్తుండగా ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నాం. కళ్యాణమస్తు , షాదీ తోఫా పథకంపై మేము చర్చకు సిద్దమే. రాజధానిలో పేదలకు ఇళ్లస్థలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో పేదల బతుకులను కాలరాసే వ్యక్తి చంద్రబాబు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. రైతులను నిట్టనిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయం దండగ అని అన్న వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయం అభివృద్ధి గురించి కనీసం ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు.
చదవండి: బాబు అక్రమాలపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమే
‘‘మా ప్రభుత్వానికి వ్యవసాయం, రైతులపై త్రికరణ శుద్ది ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ప్రభుత్వం మాది. పంట నష్టం వస్తే సకాలంలో పరిహారం ఇచ్చిన పరిస్ధితి గతంలో ఉందా?. ప్రత్యేకంగా నిధి పెట్టి రైతులను ఆదుకుంటోన్న ప్రభుత్వం మాది. ఏదో విధంగా అధికారం లోకిరావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. లైలా తుఫాను వస్తే చంద్రబాబు పరిహారం ఇవ్వలేదు. వ్యవసాయంపై చర్చించేందుకు చంద్రబాబు సహా ఎవరు వచ్చినా చర్చకు సిద్దం. చిత్తశుద్దితో పనిచేసే సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. గతంలో చంద్రబాబు సామాజికంగా ఎంత అన్యాయం చేశారో చెప్పేందుకు మేం సిద్దం. బహిరంగ చర్చకు రావాలి. చంద్రబాబు హయాంలో ప్రజలు మోస పోయారు.. ప్రజలు ఆయన్నుఎన్నటికీ నమ్మరు. చంద్రబాబు రథచక్రాలు ఊడగొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు’’ అని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment