కోర్టుల్లో ఓడిపోయినా చంద్రబాబుకు సిగ్గులేదు: మంత్రి మేరుగ | Minister Merugu Nagarjuna Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

కోర్టుల్లో ఓడిపోయినా చంద్రబాబుకు సిగ్గులేదు: మంత్రి మేరుగ

Published Thu, May 25 2023 4:33 PM | Last Updated on Thu, May 25 2023 4:51 PM

Minister Merugu Nagarjuna Comments On Chandrababu - Sakshi

అమరావతిలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అయిపోయాడంటూ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు.

సాక్షి, అమరావతి: అమరావతిలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అయిపోయాడంటూ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదల ఇళ్లను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు. కోర్టుల్లో ఓడిపోయినా చంద్రబాబుకు సిగ్గులేదని ధ్వజమెత్తారు.

‘‘51 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే ఒక చరిత్ర. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ధర్నాలు చేస్తారా?. డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నాడు?. రాజధానిలో పేదలు ఉండకూడదని చంద్రబాబు కుట్రలు పన్నాడు. సామాజిక సమతుల్యత ఏర్పడుతుందంటూ అడ్డుపడ్డారు. పేదలకు ఎక్కడ లాభం చేకూరుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారు. రేపు సామాజిక పండుగ జరుగుతోంది. అసలు రేపు వీరి దగ్గరకు వచ్చి ఓట్లు అడగగలుగుతావా చంద్రబాబు?. చంద్రబాబు వలనే రాజధాని ప్రాంత రైతులు నష్టపోయారు’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.
చదవండి: సీఎం జగన్‌ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇదే..

సీఎం జగన్ రైతు పక్షపాతి. రైతులు ప్రశాంతంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్. ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ఏదేదో చేయాలనుకుంటే కుదరదు. కోర్టులు తీర్పులు ఇచ్చినా ఇంకా అడ్డుకోవాలని చూసే చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెప్తారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే చట్టం తన పని తాను చేస్తుందని, ఇప్పుడు ఇళ్లు ఇచ్చే స్థలాలు ముంపునకు గురయ్యేవి కాదు’’ అని మంత్రి స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement