సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంను అభివృద్ధి చేయలేకపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాల్లో పుట్టడం మన దురదృష్టమని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కుప్పంలో గ్రానైట్ మైనింగ్ చేశారని మండిపడ్డారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్రమ మైనింగ్ చేశానని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
చదవండి: Andhra Pradesh: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..
ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే చంద్రబాబుకి ఈ బాధ అన్నారు. చంద్రబాబు దుష్ట పరిపాలన వదిలించుకోవడానికి ప్రజలు వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు ఇచ్చారన్నారు. సిగ్గు లేకుండా కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు మాటలను చిత్తూరు జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment