
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగించడం ముమ్మాటికీ కుట్రేనని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, ఈ కుట్ర వెనుక చంద్రబాబు ఉన్నారని నిప్పులు చెరిగారు.
చదవండి: ఎందుకీ డ్రామాలు పవన్!?
‘‘అజెండాలోని 9 అంశాలను మీరే పెట్టి మీరే తీసేశారు. చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే ఇలా చేశారు. ప్రత్యేక హోదా వద్దని అమ్ముడుపోయింది టీడీపీ నేతలే. ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకుంది టీడీపీనే. ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదు. ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సీఎం జగన్ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన నామమాత్రంగానే ఉన్నాయి. ఈ రెండు పార్టీలు లోపాయికారిగా చంద్రబాబుతో చేరతాయి. గడచిన మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని’’ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment