
అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
సాక్షి, అనంతపురం: అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయభేరి సభకు మహానాడుకి మించి ప్రజలు వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయన్నారు. కుప్పంలో మైనింగ్ మాఫియా జరుగుతోందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికల అస్త్రంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: పెద్ద మనసు చాటుకున్న కలెక్టరు, జేసీ