సాక్షి, విజయవాడ: డ్వాక్రా మహిళల డబ్బుకు ఎవరి రికమండేషన్ అవసరం లేదని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం గొల్లపూడిలో ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాలు కట్టే అప్పులు, వడ్డీలతోనే బ్యాంకులు నడుస్తున్నాయన్నారు. ‘‘మీ దగ్గర నుంచి వచ్చే వడ్డీలతో పెద్దొళ్లకు రూ.వేల కోట్ల లోన్‌లు ఇస్తారు. మన ఊర్లో కూడా ఓ ఎంపీకి రూ.7 వేల కోట్లు లోన్ ఇచ్చారు. అప్పులు తీరుస్తామన్న వ్యక్తి గెలిచిన తర్వాత మోసం చేశాడు. సీఎం జగన్ మాత్రం డ్వాక్రా సంఘాలకు అండగా నిలిచారు’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.
గొల్లపూడి చరిత్రలో మైలురాయి: తలశిల రఘురామ్
3,648 మందికి పట్టాలు ఇవ్వడం గొల్లపూడి చరిత్రలో మైలురాయి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ అన్నారు. గత ప్రభుత్వం డ్రైనేజ్, తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. గత ప్రభుత్వంలో గొల్లపూడిలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని.. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టాలని రఘురాం అన్నారు.
చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని
Comments
Please login to add a commentAdd a comment