Minister RK Roja Comments On Pawan Kalyan - Sakshi
Sakshi News home page

RK Roja: పవన్‌ కల్యాణ్‌ అవివేకం మరోసారి బయటపడింది: మంత్రి రోజా

Published Mon, Nov 14 2022 7:15 PM | Last Updated on Mon, Nov 14 2022 8:29 PM

Minister RK Roja Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, విజయవాడ: పవన్‌ కల్యాణ్‌ అవివేకం మరోసారి బయటపడిందని మంత్రి రోజా అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రూ.11 వేల కోట్లతో స్థలాలు కొంటే రూ. 15 వేల కోట్ల అవినీతి అంటున్నాడని దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు నోవాటైల్‌లో ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదువుతున్నాడు. 71 వేల ఎకరాలను పేదల ఇళ్ల స్థలాల కోసం పంచిన ఘనత జగన్‌దే. దేశంలో ఏ సీఎం అయినా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారా?. ప్రధానితో రాష్ట్రం కోసం పవన్‌ ఏం మాట్లాడారో ఎందుకు చెప్పలేదు?. అసలు మోదీతో ఏనాడైనా రాష్ట్రం కోసం పవన్ మాట్లాడారా..? జగనన్న ప్రజల సమక్షంలో ప్రధానికి మన సమస్యలు విన్నవించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారు’’ అని మంత్రి రోజా అన్నారు.
చదవండి: ఆ మీటింగ్‌ తర్వాత పవన్‌లో నీరసమెందుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement