సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య కుర్చీల కొట్లాట జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దశలవారీగా మూసీ అభివృద్ధి జరుగుతుందంటూ కామెంట్స్ చేశారు.
మంత్రి తుమ్మల మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో భాగంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య కుర్చీల కొట్లాట జరుగుతోంది. మీ కుర్చీల కొట్లాట మధ్యలోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు. బీజేపీ అధ్యక్షుడిగా ఈటల అయినా మరెవరినైనా పెట్టుకోండి అంతేకానీ మీ గురించి మాకెందుకు?. నన్న విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతాను. గత ప్రభుత్వంలో కూడా నేను ఉన్నాను. మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు అనేది నాకు తెలుసు.
మూసీ ప్రక్షాళన చెయ్యడానికే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ పెట్టారు కదా?. మూసీ ప్రక్షాళన చెయ్యకుండా.. మూసీ అభివృద్ధి ఎలా చేస్తా అనుకున్నారు?. బీఆర్‌ఎస్ నేతలకు కుర్చీ ఉంటే ఒకలా?.. కుర్చీ పోతే మరోలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడం కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన డీపీఆర్‌ను నేను ఇంకా చూడలేదు. దశలవారీగా మూసీ అభివృద్ధి జరుగుతుంది అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు.. గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ మంచి చేయడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదా?. 28 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేసాం.. కొందరివి ఆగిపోతే హరీష్ రావు పెడబొబ్బలు పెడుతున్నారు. జగదీష్ రెడ్డి ఖబడ్దార్.. మూసీ నది పరిహావాక ప్రాంతంలో తిరిగితే బడితె పూజే. నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ప్రతినిధులను.. మూసీ పరివాహక ప్రాంత రైతులు చెట్లకు కట్టేయండి. ప్రభుత్వం మూసీ నదిని బాగుచేస్తుంటే కేటీఆర్, హరీష్ రావులు అడ్డు పడుతున్నారు. డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మూసీ కింద నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల భూమి సాగుచేస్తున్నారు. కానీ, మురికి నీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతగాని దద్దమ్మలు బీఆర్‌ఎస్ నేతలు. బీఆర్ఎస్ హాయాంలో మూసీ అభివృద్ధికి చేసింది ఏంటి?. బఫర్ జోన్‌లో ఇళ్ళు లేని వారి వీడియోలు తీసి ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. హైదరాబాద్ పరిధిలో వరదలకు కబ్జాలే కారణం. కబ్జాలకు బీఆర్‌ఎస్ మద్దతుగా నిలుస్తోంది. హరీష్‌రావు అగ్గిపెట్టె పట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన ఎవరిని బలి తీసుకుంటాడో అని భయపడుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: బుల్డోజర్‌ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment