
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జేబు సంస్థ కాదని, వాళ్ల బాబు ఏమి ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నారు. అలాంటి సంస్థకు అధిపతిగా ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా ప్రారంభంలో రాష్ట్రంలో ఏడు యాక్టివ్ కేసులు ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డకు... ఇప్పుడు రోజుకి 7 వందల కేసులు వస్తున్నాయి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 16 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి... 6వేల మందికి పైగా చనిపోయారు... సెకండ్ వేవ్ వస్తుందని ఇతర దేశాలు సైతం అప్రమత్తం అవుతుంటే రమేష్ కుమార్‌కు పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరిందని మండిపడ్డారు. (చదవండి: ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ప్రజాహితం కాదు: ఏపీ సీఎస్)
ఎన్నికల సంఘం మీ జేబు సంస్థ అనుకుంటున్నారా, ఇది రాజ్యాంగ బద్ధ సంస్థ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఎన్నికల విషయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సంప్రదించాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. మీరు చెప్పినట్టు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్, డీజీపీ, సన్నద్ధంగా ఉండరని, ప్రజలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా తాము ఎన్నికలకు సన్నద్ధంగా లేమని చెబుతున్నారని అని చెప్పారు. ఇక్కడ ఉంది ప్రజాస్వామ్య ప్రభుత్వమన్నది గమనించాలన్నారు. చంద్రబాబుకు, టీడీపీకి తొత్తులాగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుల పిచ్చి పట్టిన అహంకారవాదిలా నిమ్మగడ్డ ప్రయత్నాలు ఉన్నాయని, ఎన్నికల కమిషనర్ అన్న విషయాన్ని నిమ్మగడ్డ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆ స్థానం వదిలేసి.. నిమ్మగడ్డ రమేష్‌లా వ్యవహరించవద్దని ఎమ్మెల్యే సూచించారు. (చదవండి: నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని)
‘ఓటు విలువ తెలుయని... గుర్తు ఏంటో తెలియని పార్టీలను పిలిచామని చెప్పారు.. పిలిచి ఏమి చేస్తారు? ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, వ్యవస్థను మొదట సంప్రదించాలని, వ్యవస్థను గౌరవించాల్సిందిగా నిమ్మగడ్డను కోరుతున్నాం. మీరు ఆడమన్నట్లు ఆడటానికి ప్రభుత్వం మీ జేబు సంస్థ అనుకుంటున్నారా? మార్చిలోపు మీరు దిగిపోతారని.. ఎన్నికలు పెట్టాలన్నా నిబంధన ఏమైనా ఉందా? చంద్రబాబు తాబేదారుగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. టీడీపీ తొత్తుగా పని చేస్తున్నారన్నారు. మీకు కుల పిచ్చి ఉంటే ఉండవచ్చు కానీ దాన్ని మా మీద రుద్దు తారా’ అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు
Comments
Please login to add a commentAdd a comment