సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో గెలిచే సత్తా లేక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. పొత్తుల గురించి ఇప్పుడేమీ మాట్లాడనని మీడియాతో చెప్పిన చంద్రబాబు.. కుప్పం పర్యటనలో పవన్‌తో పొత్తుకు తాను సిద్ధమేనని, స్పందించాల్సింది అతనేనని చెప్పారన్నారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడటంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.
ఓ వైపు సీపీఐ నారాయణ, రామకృష్ణలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జనసేన, బీజేపీల ఉమ్మడి పొత్తును చంద్రబాబు ఎలా ఆశిస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న కమ్యూనిస్టులను కరివేపాకులా పక్కన పడేస్తాడని అర్థం అవుతూనే ఉందన్నారు. పచ్చి అవకాశవాది అయిన చంద్రబాబుతో చేతులు కలిపితే పవన్‌ను చరిత్ర క్షమించదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఢీ కొనడానికి చంద్రబాబు వద్ద నోటు బ్యాంకు ఉందేమోగానీ ఓటు బ్యాంకు లేదన్నారు. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు సీఎం జగన్‌కి పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
పవన్‌తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాట
Published Sun, Jan 9 2022 3:58 AM | Last Updated on Sun, Jan 9 2022 3:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment