సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా, రాష్ట్రంలో పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించి దిశానిర్దేశం చేసే విషయంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధా న్యం ఏర్పడింది. పార్టీలో ముఖ్యనేతల మధ్య సమ న్వయం కొరవడి బీజేపీ డీలాపడిందనే ప్రచారం మధ్య నడ్డా పర్యటన రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపును ఇస్తుందని భావిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్ కర్నూల్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు పార్టీ ‘నవ సంకల్ప సభ‘గా పేరుపెట్టింది. మోదీ సర్కార్ విజయాలను చెప్పడంతో పాటు తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలను ఆయన తీవ్రస్థాయిలో ఎండగడతారని పార్టీ వర్గాల సమాచారం. మధ్యాహ్నం ‘సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె.నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్‌ల ఇళ్లకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు.
ఈ సందర్భంగా మోదీ పాలనా విజయాలను వారికి వివరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను అందజేస్తారు. అలాగే మధ్యాహ్నం లేదా నాగర్‌కర్నూల్ సభ తర్వాత రాష్ట్ర ముఖ్యనేతలతో నడ్డా భేటీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
సభ సక్సెస్‌తో చరిత్ర సృష్టిద్దాం: బండి సంజయ్
‘నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ దమ్ము చూపే అవకాశం వచ్చింది. ఆదివారం జేపీ నడ్డా హాజరయ్యే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి సత్తా చాటాలి’అని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సంజయ్ మాట్లాడుతూ ‘ఒకవైపు బీఆర్‌ఎస్–కాంగ్రెస్‌లు కలసి బీజేపీని దెబ్బతీసేందుకు ఏ విధంగా కుట్రలు చేస్తున్నాయో మనందరికీ తెలుసు.
బీఆర్‌ఎస్–కాంగ్రెస్ ఎప్పటి నుంచో కలిసే పోటీ చేస్తున్నయ్. పార్లమెంట్ లోపల, బయటా కలిసే బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిణీ చేశారు’అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నడ్డా బహిరంగ సభ పార్టీకి కీలకం కానుందని, ఒక్కో కార్యకర్త 50 మందిని తీసుకుని రావాలని సంజయ్ కోరారు.
నడ్డా పర్యటన ఇలా...
♦ ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగుతారు.
♦ మధ్యాహ్నం 12.55 నుంచి 1.45 గంటల దాకా నోవాటెల్ హోటల్లో రిజర్వ్ టైమ్.
♦ 2.30 గంటలకు టోలిచౌకిలోని ప్రొ.నాగేశ్వర్ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు సమావేశమవుతారు.
♦ 2.55 నిమిషాలకు ఫిల్మ్‌నగర్‌లో పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్‌ను కలుసుకుంటారు.
♦ 3.50కి నోవాటెల్‌కు చేరుకుంటారు.
♦ 4.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూ ల్‌కు బయలుదేరి 4.50కు అక్కడికి చేరుకుంటా రు.
♦ సాయంత్రం 5–6గంటల మధ్య నాగర్‌కర్నూల్ జెడ్పీ హైసూ్కల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు.
♦ 6.15కు హెలి కాప్టర్‌లో తిరుగు ప్రయాణమై 6.40కి శంషాబాద్‌కు చేరుకుంటారు.
♦ 6.45 గంటలకు ప్రత్యేక విమా నంలో కేరళలోని తిరువనంతపురం వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment