సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ఆయనపైనా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపైనా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి.. కోర్టు రిమాండ్ విధిస్తే.. అదే పవన్ కళ్యాణ్ ఆ అరెస్టును ఖండించడంతో పాటు తన సంపూర్ణ మద్దతును ప్రకటించడంపై జనసేన పార్టీ నేతలే విస్తుపోతున్నారు.
అరెస్టయిన చంద్రబాబును విజయవాడలో స్వయంగా కలిసి మద్దతు ప్రకటించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకోవడంపై సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినా పవన్ ఏ మాత్రం స్పందించకుండా, సీఐడీ అరెస్టు అనగానే ఎన్నడూ లేనంత హడావుడి చేయడాన్ని జనసేన నేతలే తప్పుబడుతున్నారు. జనసేన నేతల విషయాల్లో పవన్ ఎప్పుడూ ఇంతలా స్పందించిన సందర్భాలు లేవని, పవన్ తీరు పార్టీ ఎదుగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు.
చంద్రబాబు ప్రయోజనాలా? జనసేన పార్టీనా?
చంద్రబాబు ప్రయోజనాలా, జనసేన పార్టీనా అంటే.. తమ అధినేత పవన్ కార్యక్రమాలన్నీ చంద్రబాబు కోసమే అన్నట్లు కొనసాగుతున్నాయని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబుపై పవన్ విమర్శలన్నీ కేవలం అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి టీడీపీని మళ్లీ గెలిపించేందుకేనని, ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుందని జనసైనికులే ఒప్పుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసు సమయంలోనూ చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా బయటపడినా, ఆ ఘటనపై మూడేళ్ల పాటు పవన్ మౌనంగా ఉండడం వల్లే.. వారిద్దరూ ఒక్కటే అన్న భావనతో పవన్‌ను ప్రజలు రెండు చోట్లా ఓడించారని విశ్లేíÙస్తున్నారు.
2019 ఎన్నికల ముందు చంద్రబాబు అవినీతిపై పవన్ వివిధ సందర్భాల్లో ఏమన్నారంటే..
‘‘2014లో మీకు మద్దతిచ్చింది మీరు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తా ఉండడానికా. ఒకటా రెండా తవ్వేకొద్దీ పుంఖానుపుంఖాలుగా అవినీతి కథలు వస్తాయి. మీరు నమ్మకాన్ని వమ్ముచేశారు. తప్పు చేసిన వారికి 60 శాతం శిక్ష. ఏమి చేయని వారికి 20 శాతం శిక్ష. మిన్నకుండే వారికి 20 శాతం శిక్ష.’’
– మార్చి 14, 2018 నాగార్జున వర్సిటీ వద్ద జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో..
‘‘కాంగ్రెస్ కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు బాబు మళ్లీ రావాలని హోర్డింగ్‌లు పెడుతున్నారు. ఆయన మళ్లీ వస్తే నీతి అనేదే ఉండదు. అంతటా అవినీతే ఉంటుంది.’’
– నవంబర్ 5, 2018 తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో..
‘చంద్రబాబుకు అనుభవం ఉందని 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చి ఆయనను అధికారంలోకి తీసుకొస్తే.. ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతికి బాటలు వేసి రాష్ట్రాన్ని దోచుకొంటున్నారు. ఈ అవినీతి ప్రభుత్వం 2019 ఎన్నికల్లో దీపావళి టపాసుల మాదిరి పేలిపోక తప్పదు’’
– నవంబర్ 6, 2018 తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సభలో..
‘ముఖ్యమంత్రి (అప్పుడు సీఎం చంద్రబాబును ఉద్దేశించి) ఇంటి రిపేర్ సాకుతో హోటల్లో ఉండేందుకు వంద కోట్లు ఖర్చు చేసేస్తారు.
– అక్టోబర్ 7, 2018 పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో..
Comments
Please login to add a commentAdd a comment