ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీ | Pm Modi Elected As Nda Mps Leader | Sakshi
Sakshi News home page

ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఎన్నిక

Published Fri, Jun 7 2024 1:17 PM | Last Updated on Fri, Jun 7 2024 3:22 PM

Pm Modi Elected As Nda Mps Leader

న్యూఢిల్లీ: ఎన్డీఎపక్ష నేతగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో సెంట్రల్‌హాల్‌లో శుక్రవారం(జూన్‌7) సమావేశమైన ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, ఎంపీలు మోదీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

ఈ సమావేశంలో తొలుత మోదీ పేరును రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించగా  చంద్రబాబు, నితిశ్ కుమార్  సహా  ఎన్డీఏ ఎంపీలంతా లేచి నిలబడి రాజ్‌నాథ్‌ ప్రతిపాదనను బలపరిచారు.  ఈ సందర్భంగా మోదీ సహా ఎన్డీఏ ముఖ్య నేతలు మాట్లాడారు.

దక్షిణాది ఆదరించింది: మోదీ 

  • ఇంత భయంకర ఎండల్లో ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు కష్టపడి  శ్రమించారు
  • వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
  • ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు
  •  మీకెంతా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇవి నాకు భావోద్వేగ క్షణాలు
  •  మీరు మళ్లీ నాకు నాయకత్వం ఇచ్చారంటే మన మధ్య బంధం బలంగా ఉందని అర్థం
  • దేశంలో 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. 
  • భారత దేశ కూటముల చరిత్రలో ఏ ప్రీ పోల్‌ కూటమి ఎన్డీఏలా విజయవంతమవడవం ఇప్పటివరకు చూడలేదు
  • ఈసారి ఎన్డీఏ కూటమిని దక్షిణాది అక్కున చేర్చుకుంది. 
  •  ప్రభుత్వం నడపడానికి మెజారిటీ అవసరం. కానీ దేశాన్ని నడపడానికి అందరి సహకారం అవసరం.  
  •  ఎన్డీఏకు దేశమే ముఖ్యం
  • ఎన్డీఏ ఒక ఆర్గానిక్‌ కూటమి

ఈవీఎంలు బతికున్నాయా...చచ్చాయా..

  • ఈవీఎంలు బతికున్నాయా మరణించాయా
  • ప్రతిపక్షాలు మాట్లాడితే ఈవీంఎలు, ఈసీని తిట్టాయి
  • ఎన్నికల ఫలితాల  తర్వాత ప్రతిపక్షాలు సైలెంట్‌ అయ్యాయి
  • ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం

మోదీ ప్రచారం వల్లే కూటమి విజయం..  చంద్రబాబు నాయుడు

  • లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల్లో ప్రచారం చేశారు
  • మోదీ ప్రచారం వల్ల కూటమి విజయం సాధించింది
  • ఏపీ ఎన్నికల్లో అమిత్ షా సభ టర్నింగ్ పాయింట్ అయింది 
  • బీజేపీ అగ్ర నేతల ప్రచారం మాలో విశ్వాసాన్ని నింపింది
  • మోడీ వల్ల ప్రపంచంలో భారత్ ఖ్యాతి పెరిగింది
  • మోడీ నాయకత్వంలో భారత్ నెంబర్ వన్‌గా మారుతుంది
  • ప్రాంతీయ మనోభావాలు, జాతీయ లక్ష్యాలను బ్యాలెన్స్ చేయాలి
  • ఏపీలో కూటమి  ఉమ్మడిగా పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాం 

పవన్‌ కళ్యాణ్‌, జనసేన చీఫ్‌ 

  • మోదీ అందరిలో ప్రేరణ నింపారు
  • మోదీ 15 ఏళ్ల పాటు ప్రధానిగా ఉంటారన్న చంద్రబాబు మాట నిజమైంది
  • మోదీ వల్లే ఏపీలో 91 శాతం ఫలితాలు సాధించాం
 ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీ

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement