Parliament Central Hall
-
ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీ
న్యూఢిల్లీ: ఎన్డీఎపక్ష నేతగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్లో సెంట్రల్హాల్లో శుక్రవారం(జూన్7) సమావేశమైన ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, ఎంపీలు మోదీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తొలుత మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా చంద్రబాబు, నితిశ్ కుమార్ సహా ఎన్డీఏ ఎంపీలంతా లేచి నిలబడి రాజ్‌నాథ్ ప్రతిపాదనను బలపరిచారు. ఈ సందర్భంగా మోదీ సహా ఎన్డీఏ ముఖ్య నేతలు మాట్లాడారు.దక్షిణాది ఆదరించింది: మోదీ ఇంత భయంకర ఎండల్లో ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు కష్టపడి శ్రమించారువారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు మీకెంతా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇవి నాకు భావోద్వేగ క్షణాలు మీరు మళ్లీ నాకు నాయకత్వం ఇచ్చారంటే మన మధ్య బంధం బలంగా ఉందని అర్థందేశంలో 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. భారత దేశ కూటముల చరిత్రలో ఏ ప్రీ పోల్ కూటమి ఎన్డీఏలా విజయవంతమవడవం ఇప్పటివరకు చూడలేదుఈసారి ఎన్డీఏ కూటమిని దక్షిణాది అక్కున చేర్చుకుంది. ప్రభుత్వం నడపడానికి మెజారిటీ అవసరం. కానీ దేశాన్ని నడపడానికి అందరి సహకారం అవసరం. ఎన్డీఏకు దేశమే ముఖ్యంఎన్డీఏ ఒక ఆర్గానిక్ కూటమిఈవీఎంలు బతికున్నాయా...చచ్చాయా..ఈవీఎంలు బతికున్నాయా మరణించాయాప్రతిపక్షాలు మాట్లాడితే ఈవీంఎలు, ఈసీని తిట్టాయిఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయిఇదే ప్రజాస్వామ్యం గొప్పతనంమోదీ ప్రచారం వల్లే కూటమి విజయం.. చంద్రబాబు నాయుడులోక్సభ ఎన్నికల్లో మోదీ ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల్లో ప్రచారం చేశారుమోదీ ప్రచారం వల్ల కూటమి విజయం సాధించిందిఏపీ ఎన్నికల్లో అమిత్ షా సభ టర్నింగ్ పాయింట్ అయింది బీజేపీ అగ్ర నేతల ప్రచారం మాలో విశ్వాసాన్ని నింపిందిమోడీ వల్ల ప్రపంచంలో భారత్ ఖ్యాతి పెరిగిందిమోడీ నాయకత్వంలో భారత్ నెంబర్ వన్‌గా మారుతుందిప్రాంతీయ మనోభావాలు, జాతీయ లక్ష్యాలను బ్యాలెన్స్ చేయాలిఏపీలో కూటమి ఉమ్మడిగా పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాం పవన్ కళ్యాణ్, జనసేన చీఫ్ మోదీ అందరిలో ప్రేరణ నింపారుమోదీ 15 ఏళ్ల పాటు ప్రధానిగా ఉంటారన్న చంద్రబాబు మాట నిజమైందిమోదీ వల్లే ఏపీలో 91 శాతం ఫలితాలు సాధించాం -
Youth Parliament: అయామ్ మౌనిక
యూత్పార్లమెంటులో ప్రసంగించిన మన గిరిపుత్రిక పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.. అయామ్ మౌనిక... ఫ్రం తెలంగాణ.. అని పరిచయం చేసుకుని వాజ్‌పేయి జీవితంపై అద్భుత ప్రసంగం చేసి సర్వత్రా ప్రశంసలు అందుకున్న మౌనిక గురించి... దివంగత ప్రధాని వాజ్‌పేయి జీవితంపై యూత్‌పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసగించడానికి దేశ వ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా, వారిలో ఏడుగురికి భారత పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రసంగించే అవకాశం దొరికింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేతావత్ మౌనిక ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అంతేకాదు, ఈ ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని, తన అద్భుతమైన ప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకుంది మౌనిక. చురుకైన ప్రసంగాలు... రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారంకు చెందిన కేతావత్ నర్సింలు, సునీతల కుమార్తె మౌనిక. కామారెడ్డి పట్టణంలోని ఆర్కే పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్లు్య చదువుతోంది. తండ్రి నర్సింలు డీసీఎం డ్రైవర్‌గా, తల్లి సునీత బీడీ కార్మికురాలిగా కామారెడ్డి పట్టణంలో ఉండి తమ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. మౌనిక ఆర్కే కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, అదే కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు చురుకైన ప్రసంగాలతో కాలేజీలో అందరి మన్ననలను అందుకున్న మౌనికను కాలేజీ సీఈవో ఎం.జైపాల్‌రెడ్డి ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా యూత్ పార్లమెంటుకు కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడానికి కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీలు నిర్వహించారు. అన్నింటా మౌనిక ప్రథమ స్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన యూత్పార్లమెంటుకు ఎన్నికైన యువతులతో మౌనిక యూత్ పార్లమెంటు కోసం.. దేశవ్యాప్తంగా యూత్పార్లమెంటు ఎంపిక కోసం వివిధ దశల్లో వర్చువల్ పద్ధతిలో ప్రసంగ పోటీలు నిర్వహించారు. మౌనికతోపాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ నుంచి ఏడుగురికి అవకాశం కల్గింది. అందులో మౌనిక మూడోస్థానంలో మాట్లాడే అవకాశం వచ్చింది. మొదట కళాశాల స్థాయిలో పోటీలు నిర్వహించగా ‘మేకిన్ ఇండియా– మేడిన్ ఇండియా’ అంశాన్ని తీసుకుని ఉపన్యసించి ప్రథమ స్థానంలో నిలిచింది. తరువాత జిల్లా స్థాయి పోటీల్లో ‘స్టార్టప్ ఇండియా– స్టాండప్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించి ప్రథమ స్థానం సాధించింది. ఆ తరువాత రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది. తద్వారా పార్లమెంటులో మాట్లాడే అవకాశం లభించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.... యూత్ పార్లమెంటులో భాగంగా ఈ నెల 25న పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కేతావత్ మౌనిక మాట్లాడాలని నిర్వహకులు కోరారు. దీంతో ‘ఐ యామ్ మౌనిక ఫ్రం తెలంగాణ’ అంటూ ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. దివంగత ప్రధాని వాజ్‌పేయి గురించి మౌనిక చేసిన ప్రసంగానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిపెరిగిన మౌనిక తల్లిదండ్రులు తమ చదువుల కోసం పడుతున్న శ్రమను చూసి కష్టపడి చదువుతూనే ప్రతిభకు కూడా పదును పెట్టుకుంటోంది. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయిలో నిలవాలన్న లక్ష్యంతో మౌనిక మామూలు చదువుతో పాటు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకుంది. యూత్ పార్లమెంటుకు ఎంపికై, తన అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న మౌనికను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కళాశాల అధ్యాపకులు అభినందించారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
దేశ భద్రతపై మౌనమా? కేంద్రాన్ని నిలదీసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు అంశంపై పార్లమెంట్లో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమిటని నిలదీశారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ ఎంపీలను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. మన దేశ భూభాగాన్ని చైనా దురాక్రమిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో చర్చిద్దామని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశ రక్షణ, సరిహద్దు పరిస్థితిపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తన చర్యలు, విధానాలు ఏమిటో కూడా చెప్పాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? దేశ సరిహద్దును చైనా సైన్యం ఉల్లంఘిస్తుండడం అత్యంత ఆందోళనకరమైన అంశమని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చైనా సైన్యం దాడులను సమర్థంగా తిప్పికొడుతున్న మన జవాన్లకు మన దేశం యావత్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సవాలు ఎదురైనప్పుడు పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం ఒక ఆనవాయితీ అని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చ జరగకపోవడం వల్ల రాజకీయ పార్టీలకు, ప్రజలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో తెలియడం లేదన్నారు. దేశంలో విభజన రాజకీయాలు, సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కొనసాగుతున్నాయని, దీనివల్ల విదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదిరించడం మన దేశానికి కష్టతరం అవుతుందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను చట్టం పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. జ్యుడీషియరీని పలుచన చేయొద్దని సూచించారు. ‘చైనా’పై చర్చ జరగాల్సిందే పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా మీ హయాంలో చర్చించారా?: కేంద్రం న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలన్నీ మరోసారి డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ సారథ్యంలో బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(యూ), వామపక్షాలతో సహా 12 విపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ మౌనం వీడాల్సిందే. చైనా దురాక్రమణ యత్నాలపై మా ప్రశ్నలకు సభలో బదులిచ్చి తీరాల్సిందే’’ అని వారంతా నినదించారు. అయితే ఆ డిమాండ్‌ను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో ఇలాంటి అంశాలను సభలో చర్చకు తాము డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. -
సర్వజ్ఞాని కోసమే వేడుకలు ఎత్తేశారు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తప్పక నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలను మోదీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా రద్దుచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘సెంట్రల్ హాల్ వేడుకలు అంతర్థానమవుతున్నాయి. సర్వజ్ఞాని కీర్తి ప్రతిష్టలు పెంచడం పైనే దృష్టిపెట్టారు. ఇదంతా ఆ సర్వజ్ఞాని పుణ్యమే’ అంటూ ప్రధాని మోదీని పరోక్షంగా ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ‘గతంలో 25వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు సెంట్రల్ హాల్లో ప్రత్యేకంగా జరిగాయి. అలాగే 50వ, 60వ వేడుకలూ కొనసాగాయి. దురదృష్టంకొద్దీ ఈ సారి బీజేపీ సర్కార్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హాల్లో రద్దుచేసింది. సర్వజ్ఞానికే పేరొచ్చేలా వ్యవహరిస్తోంది. ఆ జ్ఞాని ఎవరో అందరికీ తెలుసు’ అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ విధానంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకోవడం కొనసాగుతోంది. చీకటి కోణాన్ని దాచేందుకే.. : అఖిలేశ్ బీజేపీ తనలోని చీకటి కోణాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా హర్ ఘర్ తిరంగా అని నినదిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ‘ స్వాతంత్య్రం సిద్ధించాకా జాతీయ జెండాను, భారత రాజ్యాంగాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అంగీకరించలేదు. బ్రిటిష్‌వారికి అనుకూలంగా వ్యవహరించారు. అలాంటి ఆర్ఎస్ఎస్–బీజేపీ తమ చరిత్రలోని చీకటి అధ్యాయాలను వెనుక వైపు దాచేస్తూ ముందువైపు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తున్నాయి’ అని అఖిలేశ్ అన్నారు. -
నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా: రాష్ట్రపతి ముర్ము
సాక్షి, ఢిల్లీ: దేశంలో పేదలు కలలు కనొచ్చు.. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని.. అందుకే తానే ఒక మంచి ఉదాహరణ అని భారత దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం(ఇవాళ) ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేశారు. అనంతరం ఆమె ప్రసంగించారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు అని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం.. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి నన్ను ప్రోత్సహిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో.. రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి. దేశ రక్షణ దళాలకు, పౌరులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు. నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా. మా గ్రామంలో బాలికలు స్కూల్‌కు వెళ్లడం ఎంతో పెద్ద విషయం.. మా ఊరిలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే. ఆదివాసీ మహిళగా దేశ అత్యున్నత పదవి చేపట్టం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. దేశంలో పేదలు కలలు కనొచ్చు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చు. అందుకే నేనే ఒక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు నాకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దేశంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నా అని పార్లమెంట్ సెంట్రల్ హాల్ సాక్షిగా ఆమె ప్రసంగించారు. -
Droupadi Murmu: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక
న్యూఢిల్లీ: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక కొలువుదీరడానికి సమయం ఆసన్నమయ్యింది. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయిస్తారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రమాణ స్వీకారం అనంతరం ముర్ముకు సైనిక సిబ్బంది 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారని తెలిపింది. తర్వాత ఆమె ప్రసంగం ఉంటుందని పేర్కొంది. అంతకంటే ముందు రామ్‌నాథ్ కోవింద్, ముర్ము కలిసి పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌కు చేరుకుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రి మంత్రులు, దౌత్యవేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనికాధిరులు పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించనున్నారు. -
స్వార్థ రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు జాతి ప్రయోజనాలే పరమావధిగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకుంది. కానీ అందుకు గాంధేయ మార్గాన్నే అనుసరించాలి. నేనెల్లప్పుడూ ఎంపీలతో కూడిన పెద్ద కుటుంబంలో సభ్యుడిననే భావించుకున్నాను. కుటుంబంలోలానే పార్లమెంట్‌లోనూ విభేదాలు తలెత్తుతుంటాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అభిప్రాయముండొచ్చు. జాతి ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి’’ అన్నారు. రాష్ట్రపతిగా సేవ చేసే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ‘‘విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులు, ఎంపీలకు కృతజ్ఞతలు. పార్లమెంట్ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి ఘన సంప్రదాయాలను కొనసాగించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా కృతజ్ఞతలు’’ అన్నారు. రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి తుది ప్రసంగం చేయనున్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మోదీ, ఓం బిర్లా, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. వెంకయ్య వీడ్కోలు విందు రాష్ట్రపతికి వెంకయ్య తన నివాసంలో వీడ్కోలు విందు ఇచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన కోవింద్ దంపతులను వెంకయ్య దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందులో తెలుగు వంటకాలు వడ్డించారు. విందు ఇచ్చారు. రాష్ట్రపతిగా కోవింద్‌హుందాగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్య కొనియాడారు. కోవింద్ జీవితం ఆదర్శనీయమైందని, ఆయన ఆలోచనలు, ప్రసంగాల నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని అన్నారు. న్యాయవాది నుంచి రాష్ట్రపతి దాకా... దేశ 14వ రాష్ట్రపతిగా ఐదేళ్లపాటు సేవలందించిన రామ్‌నాథ్ కోవింద్ సాధారణ న్యాయవాదిగా జీవితం ఆరంభించారు. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో పార్లమెంట్ సభ్యుడిగా, గవర్నర్‌గా సేవలందించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 2017 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. కోవింద్ 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా పరౌంఖ్ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్–ఆన్–రికార్డుగా ఎంపికయ్యారు. 1980 నుంచి 1993 దాకా సుప్రీంకోర్టులో కేంద్రం తరఫు న్యాయవాదిగా పనిచేశారు. అణగారిన వర్గాలకు, ప్రధానంగా మహిళలు, పేదలకు ఉచితంగా న్యాయ సేవలందించారు. బీజేపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1994 నుంచి 2006 దాకా రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో బిహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. బిహార్ విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017లో అధికార ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా ఘన విజయం సాధించారు. కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి అయిన రెండో దళితుడు కోవింద్. పుస్తక పఠనమంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. సామాజిక సాధికారతకు విద్యే ఆయుధమని చెబుతుంటారు. దివ్యాంగులు, అనాథలకు సమాజంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచిస్తుంటారు. రాష్ట్రపతి హోదాలో కోవింద్ 33 దేశాల్లో పర్యటించారు. సైనిక దళాల సుప్రీం కమాండర్‌గా 2018 మేలో సియాచిన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన కుమార్ పోస్టును కూడా ఆయన సందర్శించారు. -
స్టాలిన్‌తో ఎంపీ తలారి రంగయ్య
సాక్షి, అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య గురువారం ఢిలీల్లోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. ప్రధానంగా బీసీ కుల గణనపై చర్చించారు. -
కుటుంబ పార్టీలతో పెద్ద ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటి రాజకీయ పార్టీలే పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్టీపై ఒకే కుటుంబానికి చెందిన తరతరాల నేతలు పెత్తనం చెలాయించడం మంచి పరిణామం కాదన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాల్లో మోదీ ప్రసంగించారు. ‘కుటుంబం కోసం పార్టీ, కుటుంబంతో పార్టీ ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వానికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక ప్రధానికి సంబంధించినది కాదని అన్నారు. ఇది అంబేడ్కర్ గౌరవానికి, మన రాజ్యాంగ ప్రతిష్టకు సంబంధించిన వేడుక అని ఉద్ఘాటించారు. కుటుంబ పార్టీల కారణంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా దేశం ఒక రకమైన సంక్షోభం వైపు పయనిస్తోందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రజలకు ఆందోళన కలిగించే అంశమన్నారు. కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది సొంత ప్రతిభ, ప్రజల ఆశీర్వాదాలతో ఒక పార్టీలో చేరి రాణిస్తే అది వంశపారంపర్య పార్టీ కాబోదన్నారు. కానీ, పార్టీపై ఒకే కుటుంబం తరతరాలుగా స్వారీ చేయడం ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుందన్నారు. ముంబైలో 26/11 ఉగ్రదాడుల్లో మృతిచెందిన వారికి ప్రధాని నివాళులర్పించారు. అవినీతిపరులను కీర్తిస్తారా? భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు వ్యక్తులు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. వలసవాద మనస్తత్వం కలిగిన శక్తులు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీం బార్ అసోసియేషన్ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ఇవి పార్లమెంట్ వేడుకలు: ఓం బిర్లా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పార్లమెంట్‌కు చెందినవని, ప్రభుత్వానివి కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ప్రతిపక్షాలు పాల్గొంటే బాగుండేదని అన్నారు. ఉభయ సభల్లో జరిగిన చర్చల డిజిటల్ వెర్షన్, రాజ్యాంగం కాలిగ్రాఫ్డ్ కాపీ డిజిటల్ వెర్షన్, అన్ని సవరణలతో కూడిన రాజ్యాంగ ప్రతిని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్ బిర్లా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ ఎంపీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి: రాష్ట్రపతి కోవింద్ రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి మా ట్లాడారు. ఏ పార్టీకి చెందిన సభ్యులైనా పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ, విధాన సభ, పార్లమెంట్‌కు ఎంపికయ్యే ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన ప్రాధాన్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు. 15 పార్టీలు గైర్హాజరు రాజ్యాంగ దినోత్సవానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ తదితర 15 ప్రతిపక్షాలు గైర్హాజరయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు బిజూజనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీ, టీడీపీ పాల్గొన్నాయి. ఆదర్శాల ప్రకటనే రాజ్యాంగం: వెంకయ్య సంభాషణలు, చర్చల ద్వారా చట్టసభలు దేశానికి మార్గనిర్దేశం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు. రాజ్యాంగం అనేది విలువలు, ఆలోచనలు, ఆదర్శాల ప్రకటన అని అన్నారు. సోదరభావం స్ఫూర్తితో అం దరికీ న్యాయం, స్వేచ్ఛ కల్పించిందని తెలిపా రు. జాతీయ ఐక్యత కోసం ప్రయత్నించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, నిబంధనలకు ప్రజా ప్రతినిధులందరూ కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీది నిరంకుశ ధోరణి: కాంగ్రెస్ దేశ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినం కార్యక్రమాల్లో తాము పాల్గొన లేదని కాంగ్రెస్ తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అన్నారు. పార్లమెంట్ పరిశీలనతో నిమిత్తం లేకుండానే చేసే చట్టాలు వల్ల సమాజంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రేరేపిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రేరేపిత, లక్ష్యంగా చేసుకొని సాగించే దాడుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఓ పెద్ద కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని చెప్పారు. న్యాయవాదులు అబద్ధాలకు వ్యతిరేకంగా, నిజం వైపు నిలవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎన్వీ రమణ మాట్లాడారు. ‘‘న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తులకు, వ్యవస్థకు సహకరించాలి. మనమంతా ఓ పెద్ద కుటుంబంలో సభ్యులం. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైనవారిని ఎవరూ మరిచిపోరు’’ అని పేర్కొన్నారు. న్యాయవాదులకు సామాజిక బాధ్యత ఉండాలని, సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. -
కోట్ల మంది కలిసి ఉండడానికి కారణం అదే : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 130 కోట్ల మంది కలిసి మెలిసి ఉండడానికి రాజ్యాంగమే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కొనియాడారు. రాజ్యాంగం మనకు వెలుగునిచ్చే దీపిక, ఎందరో వీరుల త్యాగానికి ప్రతీక అని చెప్పారు. రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు ప్రజలే రక్షించారని, ఇక ముందు కూడా రక్షించుకుంటారని వ్యాఖ్యానించారు. సేవాభావం కన్నా కర్తవ్యం గొప్పదని ప్రబోధించారు. 70 ఏళ్ల క్రితం రాజ్యాంగ నిర్మాణంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు ఇదే రోజు ముంబైలో ఉగ్రదాడులు జరగడం బాధాకరమని, మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, శివసేన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యాంగాన్ని చదవి, తన నిరసనను తెలియజేశారు. -
వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శనీయమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాజ్‌పేయి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటుచేసిన వాజ్‌పేయి చిత్రపటాన్ని కోవింద్ మంగళవారం ఆవిష్కరించారు. సాధారణ వ్యక్తిగా వాజ్‌పేయి జీవించిన తీరు అందరికీ ఓ పాఠం లాంటిదని అభివర్ణించారు. హైవేల నిర్మాణంతో పాటు ఐటీ, టెలికాం రంగాల్లో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో శత్రువులు ఉండరని, కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ఉంటాయని నమ్మే గొప్ప వ్యక్తి అటల్ అని ప్రశంసించారు. వాజ్‌పేయి ప్రసంగాల తీరు అద్భుతమని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. వాజ్‌పేయి రాజకీయాల్లో ఆచరించిన విలువలను ప్రస్తుత తరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. వాజ్‌పేయి తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థులపై ఎప్పుడూ పరుష పదజాలాన్ని ఉపయోగించలేదని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వాజ్‌పేయి చిత్రపటాన్ని తయారుచేసిన కృష్ణ కన్హయ్యను రాష్ట్రపతి సత్కరించారు. -
సెంట్రల్ హాలుకు అవమానం?
విశ్లేషణ మన ప్రతినిధులుగా ఎంచుకుంటున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లుగా పదే పదే తప్పు చేస్తూ వస్తున్నామా? లేక, మన ప్రజాస్వామ్యం తక్షణ పునాది, రాజకీయ నాయకత్వం నాణ్యత అనేవి దిగజారిపోతున్నాయా? రెండూ కావచ్చు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అర్ధరాత్రి ప్రారంభించడం.. 1947ని అవమానించేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. జవహర్లాల్ నెహ్రూ సుప్రసిద్ధమైన ప్రసం గం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ‘తో అధికార మార్పిడి జరిగిన సందర్భం అది. జీఎస్టీ ప్రారంభోత్సవ ఘటనను బహిష్కరిం చడం ‘సైద్ధాంతిక‘ పరమైనదని కాంగ్రెస్ చెప్పుకుంది. సెంట్రల్ హాల్ అనేది సంసద్ భవన్లో ఒక భాగం. ఇక్కడే లోక్‌సభ, రాజ్యసభ కూడా ఉన్నాయి. ఇక్కడినుంచి చర్చ, వాదన ద్వారా, ఏకాభిప్రాయం లేదా వోటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్య వ్యవహారాలను నిర్వహిస్తూంటారు. ఉభయ సభలు సమావేశమైనప్పుడు సెంట్రల్ హాల్ నుంచే రాష్ట్రపతి ప్రసంగిస్తారు. మన రాజ్యాంగాన్ని కూడా ఇక్కడే ఆమోదించారు. అందుచేత సెంట్రల్ హాల్ అలనాటి ఉజ్వల ఘటనలకు సంబంధించిన మ్యూజియం కాదు. పార్లమెంటరీ వ్యవహారాల నిర్వహణకు చెందిన కీలకమైన స్థలం. పార్లమెంటులో ప్రసంగించేందుకు ఏ ముఖ్య నేతనయినా ఆహ్వానించినప్పుడు సెంట్రల్ హాల్లోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్ ఆనంద్ శర్మ ‘అవమానం’ అని మాట్లాడుతున్నారంటే దానిని జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ తరఫున చేసిన సానుకూల సమర్థనగానే చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటు పట్ల రాజకీయ వర్గం వైఖరిని పరి శీలించడానికి ఈ పరిణామం ఒక కారణాన్ని మనకు అందిస్తుంది. కాంగ్రెస్ కానీ, మరే ఇతర పార్టీ కాని సెంట్రల్ హాల్ పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించే సందర్భాల్లో దానిలో జరిగే కార్యక్రమాల పట్ల ఆ పార్టీల వైఖరి ఇలా ఉండదు. సెంట్రల్ హాల్ పట్ల గౌరవ ప్రదర్శన అనేది లోక్ సభ, రాజ్యసభల్లో వ్యవహారాలను నిర్వహిస్తున్న పార్టీల వైఖరి బట్టి ఉండకూడదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవలే పార్లమెంటేరియన్లను తీవ్రంగా మందలించారు. ‘‘మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. పార్లమెంటులో వ్యవహారాలను నిర్వహించడానికి మీరున్నారు.’’ పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయాలు కలిగించడం అమోదించదగినది కాదు. ఉభయ సభల్లో గలాభా కొనసాగడం వల్ల గంటల కొద్దీ అమూల్య సమయం వృథా కావడం కొనసాగుతోందని, ఇలా కొనసాగితే సెంట్రల్ హాల్లో ఆమోదం పొందిన రాజ్యాంగం సూచించినట్లుగా పార్లమెంటు ఉద్దేశమే ఓటమికి గురవుతుందనడానికి రాష్ట్రపతి వద్ద బోలెడు రుజువులున్నాయి కూడా. రాష్ట్రపతి ఆగ్రహాన్ని పౌరుల తీవ్ర వ్యాకులతతో సరిపోల్చవచ్చు. పార్లమెంటు కార్యకలాపాలను విచ్ఛిన్నపర్చడం తప్ప ఎంపీలనుంచి మరేమీ ఆశించలేమని పౌరులు ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేశారు. బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కపటధోరణితో వాదిస్తూ, విచ్ఛిన్నపర్చటం, అవరోధాలు కల్పించడం ప్రయోజనకరమైనవేననీ, పార్లమెంటు సజావుగా సాగిపోతే ప్రభుత్వం చర్చల ద్వారా తప్పించుకునే అవకాశముంటుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ కార్యకలాపాలను విచ్ఛిన్నపర్చని రాజకీయ పార్టీని చూడటం ఇప్పుడు చాలా కష్టం. కాబట్టి పార్లమెంటులో ఏ ప్రదేశానికైనా సరే అవమానం జరిగిందని ఏ రాజకీయ నేత అయినా మాట్లాడుతున్నాడంటే అది అబద్ధం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పార్లమెంటు కార్యకలాపాలను మృదువుగా సాగేటట్లు చేసి ఉంటే, కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలక సంకీర్ణ కూటమిని కూడా అలాగే ఉండాలని డిమాండ్ చేస్తే అది నిజాయితీ ప్రదర్శించినట్లు లెక్క. చర్చకు, వాదనకు సంబంధించిన వేదికను నిత్య ప్రతి ష్టంభన వేదిక స్థాయికి కుదించకూడదు. పార్లమెంటు కార్యకలాపాలను పదే పదే విచ్ఛిన్నపర్చే అలవాటును కొనసాగిస్తూ సెంట్రల్ హాల్ గౌర వం గురించి పేర్కొనడం అసంబద్ధమైన విషయం. ఒకప్పుడు ప్రతిపక్షం వాకౌట్ చేయడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే పద్ధతిగా ఉండేదని అనిపిస్తుంది. సంఖ్యాబలం లేని ప్రతిపక్షం మెజారిటీ సాధిం చేందుకు ప్రయత్నిస్తుందనీ, విచ్ఛిన్నకర విధానాలతో వ్యవహరించేందుకు ప్రభుత్వానికి ఎప్పుడూ ఓ మార్గం ఉంటుందనుకోవడం తప్పుడు అవగాహన మాత్రమే. అత్యధిక భాగం నిరక్షరాస్యులుగా ఉన్న దేశ జనాభాచే ఎన్నికైన తొలి లోక్‌సభ ఉన్నట్లుండి పెద్దమనిషి తనంలోకి మారిపోయి పార్లమెంటు కార్యకలాపాల్లో ఒక గంట సమయం కూడా వృథాపర్చకుండా గడపటం సూచ్యార్థంగా కనబడుతుంది. ఆనాడు అలా జరిగిందంటే ఆనాటి నేతల నడవడికే కారణం. గత శీతాకాల సీజన్లో 16వ లోక్‌సభ సమయంలో 30 శాతం, రాజ్యసభ సమయంలో 35 శాతం కేవలం విచ్ఛిన్నకర చర్యలవల్లే వృథా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఉనికిలోకి వస్తున్న ప్రశ్న ఏదంటే, మన ప్రతినిధులుగా ఎంచుకుంటున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లుగా మనం పదే పదే తప్పు చేస్తూ వస్తున్నామా అన్నదే. లేక, మన ప్రజాస్వామ్యం తక్షణ పునాది, రాజకీయ నాయకత్వం నాణ్యత అనేవి తీవ్రంగా పతనమవుతున్నాయా? రెండూ కావచ్చు. కానీ రాజకీయ ప్రపంచపు ద్వంద్వత్వంలో రెండు విరుద్ధ రాజకీయాల మధ్య సహకారం అనేది చిట్టచివరి అంశంగా మారుతోంది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
అట్టహాసంగా జీఎస్టీ అమలు
♦ జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్హాల్లో ప్రత్యేక కార్యక్రమం ♦ రాష్ట్రపతి, మాజీ ప్రధానులు, అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం! న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ. 130 లక్షల కోట్లుగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖల్ని మార్చేసే ఈ కొత్త పన్ను వ్యవస్థ ప్రారంభోత్సవం కోసం పార్లమెంట్ సెంట్రల్ హాలును వేదికగా ఎంచుకుంది. జీఎస్టీ అమల్లోకి రానున్న జూన్ 30 అర్ధరాత్రి సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినవేళ 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ పేరిట సెంట్రల్ హాల్లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 30 రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం.. అర్ధరాత్రి జీఎస్టీ అమల్లోకి వచ్చే వరకూ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జీఎస్టీ అమలును ప్రకటిస్తారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా ఆహ్వానించినట్లు సమాచారం. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడలు సెంట్రల్‌హాలు కార్యక్రమానికి హాజరుకానున్నారు. జీఎస్టీ పన్ను వ్యవస్థలో రాష్ట్రాలదే కీలకపాత్ర కావడంతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళ్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్ జీఎస్టీ ప్రచార కర్తగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే 40 సెకన్ల్ల నిడివున్న వీడియోను కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) అమితాబ్‌పై చిత్రీకరించి ప్రసారం ప్రారంభించింది. ‘జీఎస్టీ– ఏకీకృత జాతీయ విపణి ఏర్పాటు కోసం తొలి అడుగు’ పేరిట ప్రసారమయ్యే ఈ వీడియోను ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. ఇంతకుముందు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జీఎస్టీ అంబాసిడర్‌గా పనిచేశారు. -
మోడీ భావోద్వేగం!
-
'ప్రజల కలల్ని నిజం చేయడమే మన లక్ష్యం'
-
పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు
లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన అక్కడికి వచ్చి టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో మంతనాలు జరిపారు. ఆయన సూచనల మేరకు ఇరు ప్రాంతాల సభ్యులు సభలో వ్యవహరించినట్లు తెలిసింది. -
సెంట్రల్ హాలులో సస్పెండైన ఎంపీల నిరసన
విభజన బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగుతున్న సమయంలో సస్పెండైన సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాలులో నిరసన కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రం తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప (టీడీపీ) ఒక దశలో సభ లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా యత్నించారు. సభ తలుపులను గట్టిగా కొడుతూ నినాదాలు చేశారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. చర్చ సందర్భంగా లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. సభ వాయిదా పడిందంటూ లోక్‌సభ టీవీలో స్క్రోలింగ్ రావడంతో అది నిజమేనని భావించారు. కానీ గందరగోళం నడుమే చర్చ జరుపుతున్నారని తెలిసి అవాక్కయ్యారు. -
వెంకయ్యతో సోనియా ఆసక్తికర సంభాషణ
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు మధ్య ఆసక్తికరణ సంభాషణ చోటు చేసుకుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎదురుపడిన ఇరువురు అగ్రనేతలు తెలంగాణ బిల్లుపై మాట్లాడుకున్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని వెంకయ్య నాయుడిని సోనియా గాంధీ కోరారు. తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తే విభజన బిల్లు ఆమోదించేందుకు మద్దతు ఇస్తామని వెంకయ్య స్పష్టం చేశారు. ఆ సవరణలేంటో తమకు తెలపాలని సోనియా కోరారు. కాంగ్రెస్ తొలిసారిగా తెలంగాణ బిల్లు గురించి బీజేపీ నేతతో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. మరోవైపు తెలంగాణ బిల్లులో సవరణలపై చర్చిచేందుకు బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలతో కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ సమావేశమయ్యారు. రేపు తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ వారంలోనే రాజ్యసభలోనూ విభజన ప్రవేశపెట్టాలని యూపీఏ సర్కారు పట్టుదలగా ఉన్నట్టు కనబడుతోంది. -
కిరణ్‌పై సోనియాకు టి.ఎంపీల ఫిర్యాదు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. విజయవాడ సభలో సీఎం కిరణ్ చేసిన ప్రసంగంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం సభకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని సోనియాకు వారు వివరించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని విజయవాడ సభలో కిరణ్ అన్నారు. సమైక్య ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంటే ఢిల్లీ పెద్దలు కళ్ల మూసుకున్నారా అంటూ విరుచుకుపడ్డారు. సోనియాను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ కలిశారు. విభజనకు బిల్లుకు కేబినెట్ నిర్ణయం తెలిపిన తర్వాత తెలంగాణ నెలకొన్న రాజకీయ పరిస్థితిని సోనియాకు వారు వివరించారు. -
11గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో భేటీ