కిరణ్పై సోనియాకు టి.ఎంపీల ఫిర్యాదు | Telangana MPs Complain to Sonia Gandhi against Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

కిరణ్పై సోనియాకు టి.ఎంపీల ఫిర్యాదు

Published Mon, Dec 9 2013 12:37 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్పై సోనియాకు టి.ఎంపీల ఫిర్యాదు - Sakshi

కిరణ్పై సోనియాకు టి.ఎంపీల ఫిర్యాదు

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. విజయవాడ సభలో సీఎం కిరణ్ చేసిన ప్రసంగంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం సభకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని సోనియాకు వారు వివరించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని విజయవాడ సభలో కిరణ్ అన్నారు. సమైక్య ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంటే ఢిల్లీ పెద్దలు కళ్ల మూసుకున్నారా అంటూ విరుచుకుపడ్డారు.

సోనియాను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ కలిశారు. విభజనకు బిల్లుకు కేబినెట్ నిర్ణయం తెలిపిన తర్వాత తెలంగాణ నెలకొన్న రాజకీయ పరిస్థితిని సోనియాకు వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement