
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాజకీయాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాహుల్ సభ విజయవంతం అవుతుందని స్పష్టం చేశారు.
కాగా, పొంగులేటి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభకు సంబంధించి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సన్మానిస్తారు. సభకు జనాన్ని రానివ్వకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ సభకు వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు.
నా చేరికతో ఖమ్మం కాంగ్రెస్‌లో ఒక వర్గం అసంతృప్తితో ఉన్నారని జరుగుతున్న ప్రచారం వెనుక కొందరి కుట్ర ఉంది. జిల్లా కాంగ్రెస్‌లో ఎటువంటి గ్రూపులు ఉండవని అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం అని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో చేరికలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. వారి పేర్లు ఇప్పుడే చెప్పను.. వారు ఎవరో మీరే చూస్తారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీలో మరో ట్విస్ట్.. రాజాసింగ్‌పై విజయశాంతి సంచలన ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment