పట్నా : అసెంబ్లీ ఎన్నికల ముందు బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు పంపారు. అయితే రాజీనామాకు మాత్రం సరైన కారణాలు వెల్లడించలేదు. ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌తో ఆయనకు ఉన్న విభేదాల కారణంగానే పార్టీ నుంచి వైదొలిగనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేత రాజీనామా ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రఘువంశ్ ప్రసాద్ గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్జేడీలో లాలూ ప్రసాద్ యాదవ్ తరువాత అత్యంత సీనియర్ నేతగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్తింపుపొందారు. కాగా ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. (దేశంలో మరో ఎన్నికల సమరం)
Comments
Please login to add a commentAdd a comment