
న్యూఢిల్లీ: ప్రస్తుతం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ ఘన విజయం రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమకు ఉన్న భారీ బలగంతోనే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కుదరదని తేలిపోయిందని.. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి ప్రాంతీయ శక్తులు తిరిగి ప్రవేశించడం ఖాయమని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ చచ్చుబడిపోవడం కూడా దీనికి కారణమని పేర్కొంటున్నారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఎన్డీయే సర్కారు విఫలమైందన్న ప్రతిపక్షాల విమర్శలకు.. బెంగాల్‌లో గెలుపుతో చెక్ పెట్టవచ్చని, కేంద్ర విధానాలకు ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవచ్చని బీజేపీ భావించిందని విశ్లేషకులంటున్నారు. కానీ బెంగాల్ ఓటమి, తమిళనాడు, కేరళల్లో నిరాశాజనక ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయని విశ్లేషిస్తున్నారు.
సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యే అవకాశం
‘‘బెంగాల్‌లో మమత గెలుపు దేశంలో సంకీర్ణ రాజకీయాలకు మళ్లీ తెరలేపే పరిస్థితి కనిపిస్తోంది. బెంగాల్ బయట కూడా తృణమూల్ కాంగ్రెస్‌కు కేడర్ ఉంది. బీజేపీని ఎదిరించి పోరాడిన ఆమెతో కలిసి పనిచేసేందుకు పలు ప్రాంతీయ పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ కీలకంగా ఉంటుంది. బీజేపీ తీరుతో ఆగ్రహంగా ఉన్న మమత.. యాంటీ బీజేపీ పార్టీలను ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment