
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు(సోమవారం) రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సమాచారం.
ఇక, ప్రమాణ స్వీకారం గురించి రేవంత్.. తెలంగాణ డీజీపీకి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, మంత్రుల ప్రమాణానికి ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేశ నలుమూలల నుంచి వీఐపీలు వస్తారని ఈ నేపథ్యంలో తగిన భద్రతపై డీజీపీతో చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే రేపు ఉదయం గాంధీభవన్‌లో సీఎల్పీ నేతలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. అయితే, సీఎం కాన్వాయ్ లేకుండానే కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment