
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో తేటతెల్లం అయ్యిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జాతీయ మీడియా పూర్తి స్థాయిలో వార్తలు రాసిందని, దీనిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ప్రజలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?. 2020లో ఒకసారి, 2021లో ఇంకోసారి ఐటీ దాడులు జరిగాయి. మనోజ్ దేవ్, శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు ఐటీ చేసింది. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీల ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లి, అక్కడ నుండి చంద్రబాబుకు నిధులు అందాయని ఐటీ చెప్పింది. నోటీసులో ఇదే ఐటీ శాఖ ఇదే చెప్పింది. దీనిపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు?. నోటీసులపై సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ ఐదారు సార్లు చంద్రబాబు సమాధానం చెప్తూ వచ్చారు. అయితే ఆ సమాధానాలేవీ నిలబడవు’’ అని సజ్జల పేర్కొన్నారు.
అసలు ఐటీ అడిగిన లంచాల వ్యవహారం గురించి మాట్లాడకుండా సాంకేతిక అంశాల గురించి సమాధానం చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయం అంతా ఇలాగే సాగుతూ వచ్చింది. కిట్ బ్యాగ్స్ అందాయని పూర్తి సమాచారం ఉన్నందునే ఐటీ నోటీసులు ఇచ్చింది. కొన్ని తరాలపాటు లాభం పొందేలా చంద్రబాబు స్కాం చేశారు. అమరావతి విషయంలో తనతోపాటు, తన వారంతా లాభం పొందేలా చేశారు. పోలవరం విషయంలో ఏటిఎంగా మార్చారని సాక్షాత్తూ ప్రధానే చెప్పారు’’ అని సజ్జల గుర్తు చేశారు.
చదవండి: ఎల్లో మీడియాకు మింగుడుపడని నిజం
Comments
Please login to add a commentAdd a comment