జనాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న సజ్జల. చిత్రంలో మంత్రి వెలంపల్లి తదితరులు
సాక్షి,అమరావతి/ సాక్షి అమరావతి బ్యూరో: ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు దీక్ష ఓ డ్రామా. ఆ పార్టీ వ్యవహార శైలి, చంద్రబాబు తీరు, సీఎం జగన్‌ను ఉద్దేశించి బూతులు తిట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీకి) వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేస్తుంది’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తె లిపారు. రాజకీయపార్టీగా ఉండే అర్హత టీడీపీకి లేదని స్పష్టం చేశారు. నీచంగా వ్యవహరిస్తున్న టీడీపీ గుర్తింపును రద్దుచేయాలని ఎన్నికల సం ఘాన్ని కోరతామన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టాభి చేసిన విమ ర్శలు చంద్రబాబు చేయించినవి కాబట్టి, సీఎం జగన్‌కి, వైఎస్సార్‌సీపీకి, రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
తప్పు జరిగిపోయిందని ఒప్పుకుంటే ఆయన పెద్దరికానికి, పార్టీకే మంచిదని తెలిపారు. గంజాయి సమస్య చంద్రబాబు హయాం నుం చీ ఎక్కువగా ఉందని తెలిపారు. గంజాయి నివారణకు సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకుం టున్నారని, అందుకే కేజీలకొద్దీ గంజాయిని అధికారులు పట్టుకుంటున్నారని తెలిపారు. బూతులు తిట్టడం హక్కు అన్నట్లు టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. రాజకీయ పార్టీ బూతులు మాట్లాడటంపై అన్ని వర్గాల్లో విస్తృత చర్చ జరగాలని, బూతులను ఆపాలన్న డి మాండ్ రావాలని కోరారు. చంద్రబాబు అసలు కారణాన్ని పక్కకు నెట్టి, వైఎస్సార్‌సీపీ తప్పు చేసినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. దీనిపై ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. టీడీపీ బంద్‌కు పిలుపు ఇచ్చినప్పటికీ, ఎవ్వరూ స్పందించలేదని చెప్పారు.
ఇటువంటి పార్టీని మోసుకొని జనంలోకి ఎలా వెళ్లాలని వాళ్ల కార్య కర్తలకే సిగ్గనిపించినట్లు ఉందని, అందుకే బంద్ కు డుమ్మా కొట్టారని చెప్పారు. త్వరగా సీఎం జగన్‌ను పదవి నుంచి దించాలన్న ఆత్రం బాబులో కన్పిస్తోందని మండిపడ్డారు. మామూ లుగా దించలేరనే ఈ మార్గాలు ఎన్నుకొంటు న్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్ర తల సమస్య లేకున్నా, రాష్ట్రపతి పాలన అంటు న్నారని విరుచుకుపడ్డారు. పట్టాభి తిట్టును ఢిల్లీలో తీవ్రంగా పరిగణిస్తారని, బాబు ఫిర్యాదు చేయాలనుకున్న పెద్దలే ఆయనకు బుద్ధి చెబుతారని తెలిపారు. భంగపాటుతో తిరిగి విజయవాడకు వస్తారని సజ్జల చెప్పారు.
బూతులు మాట్లాడించి ఉద్యమాలా?
పార్టీ నాయకులతో బూతులు మాట్లాడించి వాటిపై ఉద్యమాలు నడిపించడం ప్రజాస్వా మ్య చరిత్రలో ఎక్కడైనా ఉందా? అని సజ్జల ప్రశ్నించారు. ఏపీలో మాత్రమే అలా జరగడం దౌర్భాగ్యమన్నారు. గురువారం ఆయన విజ యవాడలో జరిగిన జనాగ్రహ నిరసన దీక్షలో ప్రసంగించారు. తొలుత చంద్రబాబుకు తెలి యకుండా పట్టాభి తిట్టారని భావించామన్నా రు. కానీ మళ్లీ అనిపిస్తామని, ఏం చేస్తారంటూ బాబు అనడం, అధికారపక్షాన్ని, ప్రజలను హెచ్చరించడాన్ని చూస్తుంటే ఆయనే మాట్లా డించారని అర్థమవుతోందన్నారు. వర్ల రామ య్య, ఇతర సీనియర్లు కూడా బాబు చర్యలను తప్పుపడుతున్నారన్నారు. చంద్రబాబు ఇంట్లో మహిళలను ఉద్దేశించి ఎవరైనా అలాంటి మాటలు అంటే ఎలా ఉండేదని ప్రశ్నించారు.
సంస్కారం ఉంది కాబట్టే..
‘సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీ నేతలకు సంస్కారం ఉండడం వల్లే దుర్భాషలాడటంలేదు. చేతగాని వాడి ఆఖరి అస్త్రం బూతులు. ప్రజల పక్షాన నిలబడడం సీఎం జగన్ నైజం. జగన్ నూరు శాతం మహిళా పక్షపాతి. అందుకే ఎవరినీ కించపరిచేలా మాట్లాడవద్దని, నిగ్రహంతో ఉండాలని చెబుతారు. తల్లిని తిడితే ఎవరైనా ఊరుకుంటారా? కానీ జగన్ సంయమనం పాటించమంటున్నారు. మనం ప్రజలకు సేవచేయడానికే ఉన్నాం తప్ప వీధి రాజకీయాలు, దందాలు చేయడానికి కాదని సీఎం స్పష్టంగా చెప్పారు. ఈ పార్టీ వైఎస్సార్ అంశతో మొదలై లక్షలాది మంది వెంటరాగా సాగుతోంది. అందుకే పార్టీ నేతను అంతా గౌరవిస్తారు. చిన్న మాట అన్నా భరించలేరు. కానీ టీడీపీ నేతలు హద్దు మీరారు. ఇక ఊరుకోం. 2014లో టీడీపీ గెలిచింది 1 శాతం ఓట్ల తేడాతోనే.
ఆనాడే జగన్‌కు ప్రజామోదం ఉంది. 2019లో జగన్ 50 శాతం పైచిలుకు ఓట్లతో గెలిచారు. ఆయన రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి. ఆయన్ని తిడితే పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తే మీరు తట్టుకోగలరా? కమ్యూనిస్టు, బీజేపీ నాయకులు గాని, టీడీపీ రహస్య మిత్రుడు పవన్ కల్యాణ్ గానీ పట్టాభి తిట్లను కనీసం ఖండించలేదు. చంద్రబాబు వైఖరిని, ఆయన పార్టీ ప్రతినిధి మాటలను ఖండించాలి. లేదా ఆయన మాట్లాడిన మాటలు సంస్కారమని ఒప్పుకోవాలి’ అని చెప్పారు. ‘టీడీపీకి నిజంగా బలం ఉంటే బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయొచ్చు కదా? గంజాయి, హెరాయిన్ గురించి ఎన్నికల్లో ప్రస్తావించవచ్చు కదా? కానీ బూతులు తిట్టించడం, దానిపై రాజకీయాలు చేయడం చూస్తుంటే చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఈ సమాజంలోనే ఉండే అర్హత లేదు. రాష్ట్ర ప్రజలు టీడీపీ నేతలను నిలదీయాలి’ అని సజ్జల చెప్పారు. జనాగ్రహ నిరసన దీక్షలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment