సాక్షి, అమరావతి: విషం కక్కడమే ఎల్లో మీడియా ఎజెండా అంటూ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగాల భర్తీపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు-నేడు కింద విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల శాతం భారీగా పెరిగిందన్నారు. విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. రెండేళ్లలోనే సుమారు 2 లక్షల ఉద్యోగాలు కల్పించామని సజ్జల పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ విజయాలు రామోజీరావుకు కనిపించవా? అని సజ్జల ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనంపై చంద్రబాబు పెట్టిన ఖర్చు రూ.515 కోట్లు.. మా ప్రభుత్వం పెడుతున్న ఖర్చు రూ.1600 కోట్లు. ఒక్క స్కూల్ మూతపడదు.. ఒక్క టీచర్‌ను కూడా తొలగించం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి కొడాలి నాని ఫైర్
ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
Comments
Please login to add a commentAdd a comment