సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఏపీ సచివాలయం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, విశాఖ.. పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందన్నారు. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలను ఎల్లో మీడియా కన్ప్యూజ్ చేస్తోందని సజ్జల మండిపడ్డారు. ‘‘రియల్ ఎస్టేట్ కోసం కొందరు వాదనలు చేస్తున్నారు. ఎవరూ అపోహలకు గురికావాల్సిన పనిలేదు. కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారు. ఎన్నికల కోసం మేం రాజకీయం చేయబోం. ఎన్నికలుంటే ఒకమాట, లేదంటే మరోమాట చెప్పం. అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదా?. వచ్చిన అవకాశాన్ని వదులుకుని చంద్రబాబు ఘోర తప్పిదం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment