దేశంలో లోక్‌సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలతో ముడిపడిన కుటుంబాలు ఆసక్తికర పోరుకు ఆజ్యం పోస్తున్నాయి. యూపీలోని అలహాబాద్‌లో ఇలాంటి ఉదంతం చర్చల్లోకి వచ్చింది.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేత, యూపీ మాజీ క్యాబినెట్ మంత్రి ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని తండ్రి కున్వర్ రేవతి రమణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఉజ్వల్ రమణ్ సింగ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.
అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉండటం ఆసక్తికరంగా మారింది. కాగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమి కింద లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా యూపీలోని అలహాబాద్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ టిక్కెట్‌ను ఉజ్వల్ రమణ్ సింగ్‌కు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఇండియా కూటమి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment