raman
-
చదువుకున్న మారాజు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలాచోట్ల ఇంకా రాచరికాలు లాంఛనప్రాయంగా మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాజ సంస్థానాల వారసులకు పట్టాభిషేకాల వంటి లాంఛనాలు కొనసాగుతుండటం మనకు తెలిసిన సంగతే! నాగరిక రాజ్యాలు, సంస్థానాల వ్యవహారాలు సరే, దక్షిణాదిన ఏకైక ఆదివాసీ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు కూడా ఉన్నాడు.అదే కేరళలోని మన్నన్ రాజ్యం. పుష్కరం కిందట ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. ఆయన పట్టభద్రుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ ఆహ్వానంపై హాజరైన ఈ చదువుకున్న మారాజు కథా కమామిషూ..కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన గ్రామానికి చేరువలో ఉంటుంది మన్నన్ రాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దక్షిణాదిన మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ రాజ్యం ఇది. ఈ రాజ్యానికి 2012లో కొత్త రాజు వచ్చాడు. ‘రామన్ రాజమన్నన్(Raman Rajamannan)’గా పట్టాభిషిక్తు డయ్యాడు. అతడి అసలు పేరు బిను. అతడికి ముందున్న రాజు ‘అరియన్ రాజమన్నన్’. అతడు 29 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అరియన్ రాజమన్నన్కు ముందున్న రాజు ‘దేవన్ రాజమన్నన్’ తన 54వ ఏట చనిపోయాడు. ఇప్పటి రాజు రామన్ రాజమన్నన్ అలియాస్ బిను మన్నన్ రాజ్యానికి పదిహేడో రాజు. అతడికి ముందున్న రాజులందరూ నిరక్షరాస్యులే! రామన్ రాజమన్నన్ ఎర్నాకుళం మహారాజా కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు.మన్నన్ రాజ్యానికి ఎవరు రాజైనా, వారికి ‘రాజమన్నన్’ గౌరవ బిరుదనామం వస్తుంది. మన్నన్ తెగ ప్రజలది మాతృస్వామ్య సమాజం. దేశ పాలనా యంత్రాంగానికి లోబడే ఈ రాజ్యం నడుస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇడుక్కి జిల్లావ్యాప్తంగా 62 చోట్ల విస్తరించి ఉన్న మూడువందలకు పైగా మన్నన్ తెగ కుటుంబాల మంచిచెడ్డలను ప్రస్తుత రాజు రామన్ రాజమన్నన్ చూసుకుంటారు. ఈ రాజుకు ఒక ఆస్థానం, ఆ ఆస్థానంలో తొమ్మిదిమంది మంత్రులు ఉంటారు. ప్రజల పెళ్లిళ్లు, విడాకులు సహా తెగకు సంబంధించిన అంతర్గత సమస్యలు, బయటి నుంచి తెగ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం రాజు బాధ్యతే! రాజుకు హఠాత్తుగా అనారోగ్యం వాటిల్లినా, రాజు మరణించినా, కొత్తరాజు వచ్చేంత వరకు రాజ్యభారాన్ని మంత్రులు చూసుకుంటారు. మన్నన్ ప్రజలు రాజును తమ పాలకుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా గౌరవిస్తారు. ఒక రాజు, అతడికి ఒక ఆస్థానం అంటే భారీగా ఊహించుకుంటారేమో! ఈ రాజుకు, ఆయన ఆస్థానానికి భారీ భవంతులు, రాజప్రాసాదాలూ ఉండవు. మామూలు పక్కా ఇల్లే ఆయన నివాసం, ఆస్థానం.రామన్ రాజమన్నన్ భార్య బినుమాల్ మన్నన్ తెగప్రజలకు రాణి. వీరి కూతురు అర్చన యువరాణి. మన్నన్ ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరిలో కొందరు అటవీశాఖలో చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రామన్ రాజమన్నన్ సకుటుంబంగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేడుకలకు ఆహ్వానం అందుకున్న తొలి మన్నన్ రాజుగా ఆయన దేశ ప్రజలకు కనిపించారు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక రాజదంపతులు ఢిల్లీలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి జనవరి 31 వరకు అక్కడే ఉన్నారు. వారు ఫిబ్రవరి 2న తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను గిరిజనాభివృద్ధి శాఖ పెట్టుకుంది. మన్నన్‌ల చరిత్ర!ఏడు వందల ఏళ్ల క్రితం పాండ్య, చోళ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండ్యరాజు చిరై వర్మన్ ఓడిపోయాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని తన రాజ్యం నుంచి పారిపోయి, ఇప్పటి ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చి, కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే ఈ మన్నన్ రాజ్యమని స్థానిక మన్నన్ తెగ ప్రజలు చెబుతారు.విద్యను అందించడమే లక్ష్యంరాజుగా నా ప్రజలందరికీ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం. విద్యతోనే ఆదివాసీల జీవితాలు మెరుగుపడతాయి. నేటితరానికి ఈ అవగాహనను కల్పించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలం – రామన్ రాజమన్నన్పిల్లల్ని చదివించటం అంటే వారికి రాయల్ లైఫ్‌ను ఇవ్వటమే. – రాజమన్నన్ -
తండ్రి ఒక పార్టీ.. కొడుకు మరో పార్టీ.. కలిసే ప్రచారం?
దేశంలో లోక్‌సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలతో ముడిపడిన కుటుంబాలు ఆసక్తికర పోరుకు ఆజ్యం పోస్తున్నాయి. యూపీలోని అలహాబాద్‌లో ఇలాంటి ఉదంతం చర్చల్లోకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేత, యూపీ మాజీ క్యాబినెట్ మంత్రి ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని తండ్రి కున్వర్ రేవతి రమణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఉజ్వల్ రమణ్ సింగ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉండటం ఆసక్తికరంగా మారింది. కాగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమి కింద లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా యూపీలోని అలహాబాద్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ టిక్కెట్‌ను ఉజ్వల్ రమణ్ సింగ్‌కు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఇండియా కూటమి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
విద్యార్థిగా మారిన కలెక్టర్
వేలూరు: విద్యార్థులతో కలిసి కూర్చుని కలెక్టర్ పాఠాలు విన్నారు. ఈ ఘటన వేలూరు చోటుచేసుకుంది. ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ రామన్, విద్యాశాఖ సీఈఓ మార్స్‌లు తనిఖీలు చేపట్టారు. వేలూరు కొనవట్టం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదిలో పాఠాలు వినేందుకు విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. సుమారు 45 నిమిషాలపాటు విద్యార్థి తరహాలోనే కలెక్టర్ కూర్చొని ఉండడం పలువురిని ఆశ్చర్య పరిచింది. అనంతరం విద్యార్థులు చదవడం, రాయడం, విద్యార్థుల విద్యా నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని టీచర్లకు సూచించారు. అనంతరం టీచర్ల రిజిస్టర్ పుస్తకాన్ని పరిశీలించారు. సెలవు పెట్టిన టీచర్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. -
కంటికి రెప్పలా కిడాంబి
శ్రీరంగని తీర్థం తీసుకోకుండా రామానుజునికి రోజు గడవదు. అదే కుట్రదారులకు అవకాశం ఇచ్చింది. ఓ రోజు రామానుజులు తీర్థం తీసుకోవడానికి రావడానికి ముందు పెరుమాళ్ల తీర్థపాత్రలో విషం కలిపారు. రోజూ తీర్థమిచ్చే అర్చకుడే ఆ రోజు కూడా ఇస్తున్నాడు. కాని ఏనాడు లేని విధంగా ఉద్ధరిణితో తీర్థం ఇస్తున్న చేతులు తీవ్రంగా వణకడాన్ని రామానుజులు గమనించారు. ‘‘ఏమి స్వామీ మీ చేయెందుకు వణుకుతున్నది’’ అని అడిగారు రామానుజులు. అర్చకుడు ఏమీ చెప్పలేకపోతున్నారు. స్వామి తీర్థంలోనూ విషం కలిపి ఉంటారని ఊహించి నవ్వుకున్నారు. అప్పడికే ఆయన ఈ హత్యా ప్రయత్నాలతో విసిగిపోయారు.శ్రీవారి పాదాలు తాకి పునీతమైన ఈ తీర్థం ఏ విషాన్నయినా కరిగిస్తుందని అనుకుంటూ ‘‘తీర్థం ఇవ్వండి. అందులో ఏమున్నాసరే’’ అన్నారు. ఆ అర్చకుడు తీర్థం ఇచ్చారు, వీరు స్వీకరించారు. దాని గురించి ఇక ఆలోచించకుండా దైనందిన కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. యతిరాజును విషం ఏమీ చేయలేకపోయింది. ప్రపీత విష తీర్థాంబః ప్రకటీకృతవైభవః అనే నామం రామానుజుని వేయినామాల్లో ఒకటైంది. ఈ విషప్రయోగాలతో రామానుజులు కలత చెంది, భోజనం మాని ఉపవసించడం ఆరంభించారు. చికాకుతో శ్రీరంగానికి దూరంగా తిరువెళ్లరైకి వెళ్లి కొన్నాళ్లున్నారు. ఈ సంఘటనలు తెలిసి ఆందోళన చెందిన గోష్టీపూర్ణుల వారు తిరుగోష్టియూరు నుంచి హుటాహుటిన శ్రీరంగానికి వచ్చారు. ఆచార్యుల వారు వస్తున్నట్టు తెలిసి రామానుజులు ఎదురేగారు. కావేరీ నదీ సమీపాన ఇద్దరూ ఎదురు పడినారు. స్వామి కనిపించగానే రామానుజులు సాష్టాంగ దండ ప్రణామం చేసినారు. మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఆచ్ఛాదన లేని ఛాతీతో కాలిపోతున్న ఇసుక మీద పడిపోయారాయన. ఎవరైనా సరే, ఆ విధంగా సాష్టాంగ పడితే వెంటనే లేపడమో, లేవమని చెప్పడమో పెద్దలు చేయవలసింది. కాని గోష్ఠీపూర్ణులవారు అట్లాగే చూస్తున్నారు. కిమ్మనరు. లెమ్మనరు. లెమ్మనేదాకా రామానుజులు లేవరు. ఆచార్యుని ప్రియశిష్యుడైన కిడాంబి ఆచ్చాన్ ఈ హింస తట్టుకోలేక పోయారు. గోష్టీపూర్ణుల మీద కోపం వచ్చింది. కాని ఏమీ అనలేరు. ఆయన్నేమైనా అంటే తమ గురువు రామానుజులు ఆగ్రహిస్తారు. తానే ఏదయినా చేయాలనుకున్నాడు. గోష్ఠీపూర్ణుల దగ్గరగా వచ్చి సూటిగా కళ్లలోకి కోపంగా చూసారు. అయినా మౌనంగానే ఉన్నారు. తానే ఆ ఇసుకమీద పడిపోయి రామానుజుల కిందకు దూరి తన వీపు మీద గురువుగారిని పడుకోబెట్టుకున్నారు. గోష్ఠీపూర్ణులు అప్పుడు ‘‘లే నాయనా’’ అని ఇద్దరినీ లేవదీసారు. రామానుజులను ఆలింగనం చేసుకున్నారు. ‘‘స్వామీ ఇదేమిటి. రామానుజాచార్యులవారు ఏమి తప్పు చేసారని కాలే కావేరీ ఇసుకతిన్నల మీద కాలిపొమ్మని శిక్షించారు. ఆయన కుసుమకోమల శరీరం చూడండి ఎలా కందిపోయిందో. ఆ వేడి ఎవరైనా తట్టుకోగలరా, మరీ ఇంత కాఠిన్యమా?’’ అని ఆవేదన కలిసిన ఆవేశంతో ఆక్రోశించారు కిడాంబి. రామానుజుని పట్ల కిడాంబికి ఉన్న అపారమైన అనురాగానికి, ఆయన్ను రక్షించుకోవాలన్న తీవ్ర తపనకు, అందుకోసం ఏం చేయడానికైనా ముందుకు వచ్చే ఆయన సంసిద్ధతను చూసి గోష్టీపూర్ణులకు ఆనందం కలిగింది. ఓహో రామానుజుడికి ఇంత ప్రియశిష్యుడొకడున్నాడన్నమాట. ‘‘నాయనా కిడాంబి ఆచ్చాన్.. ఇక నీదే రామానుజుని బాధ్యతంతా. నీ వంటి త్యాగశీలి అయిన శిష్యుడి కోసమే వెదుకుతున్నాను. ఈ పరీక్ష రామానుజునికి కాదు. ఆయన్ను కంటికి రెప్పవలె కాపాడుకునే శిష్యుడిని కనిపెట్టడం కోసం, గురువు కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగే నీవంటి ఆప్తుడిని కనుగొనడం కోసం. నువ్వు దొరికావు. నీవుండగా ఇక రామానుజుని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం రామానుజుని రక్షించుకోవాలి. ఎందుకంటే ఆయనే మన వైష్ణవ మతానికి రక్షకుడు, మోక్షమార్గ నిర్దేశకుడు. పాప పంకిలమైన కలికాలంలో దైవం వైపు మనుషుల్ని మళ్లించగల ఆచార్యుడు. నీవే స్వయంగా వస్తువులు కూర్చుకుని, తళిహ చేసి పెరుమాళ్లకు ఆరగింపు చేసి, ఆ భగవత్ప్రస్రాదాన్ని రామానుజునికి వడ్డించాలి. నిరంతరం ఆయనకు కాపాయంగా ఉండాలి. నీవే కాపాడుకోవాలి’’ అని గోష్ఠీ పూర్ణుల వారు కిడాంబిని ఆశీర్వదించారు. ‘‘నీవు గాక ఇంకెవరూ రామానుజునికి వండకూడదు. ఆహారం ఇవ్వకూడదు సుమా..’’ అని మరోసారి హెచ్చరించారు గోష్టీ పూర్ణులవారు. ఆ విధంగా కిడాంబి తన ఆచార్య నిష్టను చాటుకున్నారు.కిడాంబి గొప్ప విద్వాంసుడు. సంస్కృత భాషలో ఆయన పేరు ప్రణతార్తిహరాచార్యులు. ప్రణతి చేసిన వారి ఆర్తిని హరించేవారని అర్థం. ఆ తరువాత తళిహత్నం, పెరుమాళ్ల ప్రసాదం, రామానుజుని పాకశాల కైంకర్యం కిడాంబిదే. రామానుజులు మధూకరవృత్తి (యాచన) వదిలేసి కిడాంబి తళిహత్నం (వంట) మీదనే ఆధారపడేవారు. అందుకే రామానుజుని సహస్రనామావళిలో ‘‘ప్రణతార్తిహరాచార్య దత్తభిక్షైక భోజన’’ అనే మరో నామం చేరింది. కిడాంబితో సహా రామానుజుని ఆంతరంగికులు జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తున్నారు. రామానుజులకు ఇచ్చే ప్రతి పదార్థాన్ని, ద్రవాన్ని, ఫలాన్ని పరీక్షిస్తున్నారు. ఆయనకు సమీపంలో మెలిగే ప్రతివారి కదలికను పరిశీలిస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న శిష్యగణం స్వామిని కంటికి రెప్పలా కాచుకునే రక్షగణం వలె తయారైంది. యజ్ఞమూర్తితో వాదంయజ్ఞమూర్తి ఒక మహాపండితుడు. అద్వైత వేదాంతంలో దిట్ట. తర్కశాస్త్రప్రవీణుడు. ఆయన శాస్త్ర చర్చలో ఓడించని పండితుడు లేడు. ప్రతిచోటా విజయపత్రాన్ని సాధించేవాడు. ఇక తనను జయించే వాడే లేడని ఆయనకు అహంకారం పెరిగింది. విస్తరిస్తున్న కీర్తితోపాటు నాకు సాటి నేనే అనే నమ్మకం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ఆయన ఏకదండ సన్యాసి. యజ్ఞమూర్తి దృష్టిలో ఓడించవలసిన వారు ఇంక ఒక్కరు మిగిలారు. శ్రీరంగంలో త్రిదండి యతీశ్వరుడై జగద్గురువై ఆచార్యోత్తముడిగా భాసిస్తున్న రామానుజుడిని వాదంలో జయిస్తే ఇక తిరుగే లేదని అనుకుని శ్రీరంగానికి వచ్చారు. వేదాంత చర్చలో పోటీ పడడాన్ని శాస్త్రార్థం అంటారు. పెద్దమూటనిండా పుస్తకాలు తెచ్చుకుని వచ్చి రామానుజులతో ‘‘మీతో శాస్త్రార్థానికి వచ్చాను. నేను ఓడితే మీ మతం స్వీకరిస్తాను. మరి మీరు ఓడితే ఏం చేస్తారు’’ అని అడిగాడు. ‘‘గ్రంథసన్యాసం చేసి మౌనం వహిస్తాను’’ అని భీషణ ప్రతిజ్ఞ చేసాడు రామానుజుడు. అంతా ఆశ్చర్యపోయారు. ఇదేం ప్రతిజ్ఞ. రామానుజులవారు గ్రంథ సన్యాసం చేస్తే ఇక ఈ శాస్త్రమంతా ఏమైపోవాలి. ఈ మతం ఏమైపోవాలి అని ఆందోళన చెందారు. మాయావాదంలో ఆరితేరిన యజ్ఞమూర్తి గర్వంగా వాదంలోకి దిగారు. 17 రోజుల పాటు వాదం సాగుతూనే ఉంది. రామానుజాచార్యులతో ఇన్ని రోజుల పాటు వాదించిన వారు మరొకరు లేరు. 17వ రోజున యజ్ఞమూర్తి వాదన పై చేయిలో ఉన్నట్టు కనిపించింది. సాయంత్రం తన పెరుమాళ్లు వరదరాజస్వామితో ‘‘ఆళ్వార్లనుంచి ఆళవందార్ దాకా ఇన్నాళ్లూ పెద్దలంతా తపోబలంతో నిర్మించుకున్న ఈ శ్రీ వైష్ణవాన్ని, నీ నామ రూప గుణ విభవ విభూతులనే నిత్య సత్యప్రకాశాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వదులుకునే పరిస్థితి నాకు రాకుండా రక్షించుకోవలసిన బాధ్యత మీకూ ఉంది స్వామీ’’ అని సంభాషించారు. రాత్రి స్వప్నంలో వరదుడు కనిపించి ‘‘యామున మునీంద్రుని మనసెరిగిన శిష్యుడివైన నీకు, యామునుడి సిద్ధిత్రయాది గ్రంథాల్లో ఉన్న విజ్ఞానాన్ని వంట పట్టించుకున్న నీవు, చింతించే అవసరం ఉందా? ఏమో నీకు అత్యంత ప్రతిభావంతుడైన మరొక శిష్యుడు లభిస్తాడేమో’’ అన్నారు. దిగ్గున నిద్రలేచారు రామానుజులు. నూనె దీపం వెలుగులో సిద్ధిత్రయగ్రంథాలు తెరిచారు. కొన్ని పత్రాలు తిరగేసినారు. మరునాటి శాస్త్రార్థానికి సర్వం సన్నద్ధమైంది. ఆలోచనలు వెలిగాయి. లోలోన నవ్వుకుంటూ రామానుజులు నిద్రలోకి జారుకున్నారు. పద్దెనిమిదోరోజు... వివేకానంద ముఖారవిందుడైన రామానుజుని చూడగానే యజ్ఞమూర్తి మాయ మాయమైపోయింది. అనుమాన బీజం నాటుకుంది. అవిశ్వాసమై పెరిగింది. రామానుజుని మోములో ఏమిటీ కాంతి? అని ఆశ్చర్యపోయారు. చూపు మరలడం లేదు. ఆరోజు రామానుజుడు వాదం ఆరంభించిన కొద్దిసేపటికే ముగిసిపోయింది. పరమాత్మ స్వరూపాన్ని సైద్ధాంతికంగా నిరూపించిన తరువాత యజ్ఞమూర్తి పరాజయాన్ని అంగీకరించక తప్పలేదు. త్రిదండి సన్యాసం స్వీకరించారు. రామానుజునికి మరో పండిత శిష్యుడు లభించాడు. ఆయనకు అరుళాలప్పెరుమాళ్ ఎంబెరుమానార్ అనే నామాన్ని ప్రసాదించారు. విశిష్ఠాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడిగా తీర్చిదిద్దారు. పేద శిష్యుడి పెద్ద గుణం, ధనిక శిష్యుని పేదరికం ఓసారి రామానుజులు అష్టసహస్ర గ్రామానికి వస్తున్నారు. ఆ గ్రామంలో రామానుజునికి ఇద్దరు శిష్యులున్నారు. ఒకరు యజ్ఞేశుడు (యజ్ఞమూర్తి కాదు) మరొకరు వరదాచార్యుడు. యజ్ఞేశుడికి చాలా ధనం ఉంది. వరదుడు పేదవాడు. తాను వస్తున్నట్టు ఇద్దరికీ సమాచారం వెళ్లింది. రామానుజులు తన భవనానికి వస్తే స్వాగత సన్నాహాలు చేయడానికి సిద్ధం అన్నాడు యజ్ఞేశుడు. ఆ విషయం తెలియగానే రామానుజుడు శిష్యులతో ‘‘వరదుడి కుటీరానికి పదండి’’ అన్నారు. వరదుడు అప్పుడే భిక్షాటనకు వెళ్లాడు. ఇంట్లో వరదుడి భార్య ఉంది.రామానుజులవారు వస్తున్నారని ఆమె ఎంతగానో సంతోషించింది. కాని ఆమె బయటకు వచ్చి ఆచార్యునికి స్వాగతం చెప్పే స్థితిలో లేదు. తనకు ఒకే చీర ఉంది. ఆ చీరను అప్పుడే ఉతుక్కుంటున్నది. భర్త వచ్చేలోగా అది ఆరితే కట్టుకోవాలి. ఇప్పుడెట్లా. ఇంతలో గురువుగారు వచ్చిన సందడైంది. మూసి ఉన్న తలుపులకు ఆవల ఉన్నారు ఆచార్యులు. లోపల ఉన్న తను ఏ విధంగా స్వాగతం చెప్పాలో తెలియక ఆహ్వాన సూచనగా చప్పట్లు కొట్టింది. పరిస్థితిని రామానుజులు గమనించారు. తన శిరస్సుకు తలపాగా వలె కట్టుకున్న కాషాయ వస్త్రాన్ని తీసి కిటికీలోంచి లోనికి విసిరారు. దాన్నే చీరగా చుట్టుకుని ఆమె బయటకు వచ్చి నమస్కరించింది. కాళ్లు కడుక్కునేందుకు నీళ్లిచ్చి లోపల కూచునేందుకు ఆసనంగా ఒక చాపను పరిచింది. పూర్వజన్మపుణ్యాన గురువుగారు మా కుటీరాన్ని పావనం చేశారు. ఇంతకన్న ఆనందం ఏముంటుంది... కాని ఏం చేయడం? ధాన్యం కూడా లేదే, వారికి, శిష్యగణానికి సాపాటు ఏర్పాటు ఏ విధంగా చేయడం? ఇదివరకెవరో వైష్ణవ తదీయారాధన (భోజనం) కోసం దొంగతనాలైనా చేసేవారట. నేనేం చేసేది? ఈ వైష్ణవ స్వాములకు నేనెలా సాపాటు పెట్టేది. అని తపించసాగింది. ఆ ఊళ్లో ఉన్న వైశ్యవర్తకుడి దగ్గరకు సరుకులకోసం పోయినప్పుడల్లా వంకర చూపులు చూసేవాడు. అవసరం ఉన్నా సరే అక్కడికి వెళ్లాలంటే ఆ చూపులకు భయపడేది. ఓ నిర్ణయానికి వచ్చి, ‘‘ఆచార్యా ఇప్పుడే వస్తాను. వెచ్చాలు తేవడానికి వెళ్తున్నాను. మీ అనుగ్రహంతో సరుకులు దొరుకుతాయనే అనుకుంటున్నాను’’ అని వెళ్లింది. ఆమె రాక చూసి వర్తకుడి మనసు కామంతో నిండిపోయింది. ‘‘మా ఆచార్యులవారు శిష్యులతో సహా వచ్చారు. వారికి సాపాటు పెట్టాలి. దయచేసి సరుకులు ఇవ్వండి మీ రుణం ఉంచుకోను. మీరు చెప్పినట్టు వింటాను’’. శెట్టిగారికి అర్థమైపోయింది. చాలా సంతోషంగా కావలసిన దానికన్న ఎక్కువ సరుకులే ఇచ్చారు. ఆచార్యుల సేవకు సరుకు దొరికిందన్న ఆనందంతో గుడిసెకు వెళ్లిందామె. ‘‘అమ్మా నీ చేతి వంట తినే భాగ్యం మాకుంది. స్నానానికి వెళ్లి వస్తాం తల్లీ’’ అని రామానుజులు శిష్యులతో సహా వాగు వైపు వెళ్లారు. స్నానం, సంధ్య, అనుష్టానం తిరువారాధనలు ముగించుకుని సాపాటుకు కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి వరదుడు వచ్చి ఆచార్యులను చూసి సాష్టాంగదండాలు సమర్పించి, భార్య అన్ని ఏర్పాట్లు చేయగలిగినందుకు వేయిదేవుళ్లకు దండాలు పెట్టుకున్నాడు. ‘‘నన్ను ధన్యుyì ని చేసావు, జ్ఞానమార్గాన్ని ఉపదేశించిన ఆచార్యుడే భగవంతుడు. వారి బృందానికి తదీయారాధన చేసే భాగ్యం కల్పించిన దేవతవు నీవు. ఏ విధంగానైనా గురువుకు ఆతిథ్యమివ్వగలిగే శిష్యుడే నిజమైన శిష్యుడు’’ అంటూ పరి పరి విధాలా భార్యను మెచ్చుకున్నాడు. ఇంతలో రామానుజుల వారు వరదుడి ఇంటికి వచ్చారని తెలిసి ఉళ్లో వాళ్లు చాలామంది అక్కడికి వచ్చారు. అక్కడ రామానుజులు అందరికీ తీర్థం ఉంచి ఆశీర్వదించారు. శెట్టి కూడా వచ్చారు. రామానుజుని దివ్యస్వరూపం చూసిన తరువాత వారి తీర్థం తీసుకుని ఆశీస్సులు పొందిన తరువాత, ఈ మహానుభావుడు స్వయంగా వరదుడి ఇంటికి వచ్చారంటే, సంపన్నుడైన యజ్ఞేశుడిని తిరస్కరించారంటే వరద దంపతులు ఎంత గొప్పవారో అర్థమైంది. రామానుజుల సమక్షంలో వరదుడి భార్య పాదాలపై పడి తన పాపపు చూపులకు పరితపించాడు. క్షమించమని వేడుకున్నాడు. తన ద్రవ్యం సద్వినియోగమైందని సంతోషించాడు. రామానుజుడి రాకతో తన సమస్య ఆ విధంగా పరిష్కారమైనందుకు వరదుడి భార్య ఆనందించింది. యజ్ఞేశుడికి గర్వభంగం అయిందని ఊళ్లో వాళ్లంతా అనుకున్నారు. ఆ విషయం యజ్ఞేశుడికి కూడా తెలిసింది. తన ఇంటికి రాకుండా రామానుజుడు తన యాత్ర కొనసాగించారని తెలిసి తన అహంకారానికి సిగ్గుపడ్డాడు. -
పదేళ్ళు దాటితే..
రాయపూర్ః దేశంలో పొల్యూషన్ పై పోరాటం ప్రారంభమైంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పద్ధతులతో కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందులోభాగంగా తాజాగా పదేళ్ళు దాటిన ట్రక్కులు, బస్సులు, ఆటోలను బ్యాన్ చేసేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంవత్సరం పాటు గడువు ఇస్తున్నామని, ఆలోపు కొత్త వాహనం కొనే ప్రయత్నం చేసుకోవాలని వాహన యజమానులకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాక 'ఈ' రిక్షాలను కొనేవారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమల్లోకి తెస్తోంది. పన్నెండేళ్ళు దాటిన బస్సులు, పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటో రిక్షాలు వంటి కమర్షియల్ వాహనాలు రోడ్లపై తిరగకుండా నిలిపివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ముందడుగు వేయాలని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఛత్తీస్ ఘడ్ ఎన్విరాన్మెంట్ కంజర్వేషన్ బోర్డ్ ఛైర్ పర్సన్ అమన్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటినుంచీ పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటోలు, పన్నెండేళ్ళు దాటిన బస్సులకు అనుమతులు ఇవ్వొద్దని, వాహన యజమానులు కొత్త వాహనాలు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఓ సంవత్సరం పాటు గడువు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఎనిమిదేళ్ళు దాటిన పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లు కూడ చేయొద్దని ఆదేశించినట్లు తెలిపారు. 'ఈ' రిక్షాలను ప్రోత్సహించేందుకు గాను ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. వాతావరణ పరిరక్షణలో భాగంగా మరో నిర్ణయం తీసుకున్నామని, ఆన్ లైన్ మానిటరింగ్ తో పారిశ్రామిక కాలుష్య పరిమాణాన్ని అంచనా వేస్తామని సీఎం రమణ్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నెల్లో రెండుసార్లు పరిశ్రమల యాజమాన్యాలు ప్రవర్తిస్తే ఆయా యూనిట్లను మూసివేయిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని రాయపూర్ లో పొల్యూషన్ తగ్గించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గత నెల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ హెచ్ వో) వెల్లడించిన నివేదికల ప్రకారం అత్యధిక కాలుష్యంగల నగరాల్లో రాయపూర్ ఏడో స్థానంలో ఉందని, ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రాయపూర్ లో వచ్చే రెండేళ్ళలో కాలుష్యం నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాయపూర్ లోని రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం ద్వారా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. అలాగే రాజధానిలో ఈ సంవత్సరం సుమారు 30 లక్షల వరకూ మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, గృహాల్లోని వ్యర్థాలకోసం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. -
ఎన్సీఏ కోచ్‌లుగా
► రామన్, హిర్వాణీ, శేఖర్ ముంబై: మాజీ టెస్టు క్రికెటర్లు డబ్ల్యు.వి. రామన్, నరేంద్ర హిర్వాణీ, టీఏ శేఖర్‌లను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్యానెల్ కోచ్‌లుగా బీసీసీఐ నియమించింది. రామన్ బ్యాటింగ్, శేఖర్ పేస్ బౌలింగ్, హిర్వాణీ స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా పని చేస్తారని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. మరికొంత మంది అసిస్టెంట్ కోచ్‌లు వీళ్లకు సహాయ సహకారాలు అందజేస్తారన్నారు. ఎన్సీఏ డెరైక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఈ త్రయాన్ని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేశారని చౌదరి తెలిపారు. ఎన్సీఏను శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేసేందుకు బెంగళూరులో స్థలం కోసం అన్వేషిస్తున్నామన్నారు. నెల రోజుల్లో అనువైన స్థలం లభించకపోతే అకాడమీని వేరే చోటుకు తరలిస్తామన్నారు. -
ఎల్అండ్టీ లాభం 1,241 కోట్లు
ముంబై: ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్అండ్టీ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రూ. 1,241 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,013 కోట్లతో పోలిస్తే ఇది 22%పైగా వృద్ధి. స్టాండెలోన్ ఫలితాలివి. ద్రవ్యోల్బణం, విధానాల్లో అనిశ్చితి వంటి అంశాలు పెట్టుబడుల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు కంపెనీ సీఎఫ్‌వో శంకర్ రామన్ పేర్కొన్నారు. ఈ కాలంలో ముంబై హైకోర్ట్ నుంచి అనుమతి లభించడంతో హైడ్రోకార్బన్ బిజినెస్‌ను సొంత అనుబంధ సంస్థ ఎల్అండ్టీ హైడ్రోకార్బన్ ఇంజినీరింగ్‌కు బదిలీ చేసింది. దీంతో ఈ బిజినెస్‌ను 2013 ఏప్రిల్ నుంచి కొత్త కంపెనీ ఖాతాలో నమోదు చేయనుంది. కాగా, ఈ కాలంలో అమ్మకాలు దాదాపు 12% పెరిగి రూ. 14,388 కోట్లకు చేరాయి. హైడ్రోకార్బన్ బిజినెస్ ఆదాయం దీనిలో కలపలేదని కంపెనీ తెలిపింది. ఓ అనుబంధ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించడం ద్వారా రూ. 104.4 కోట్ల అనూహ్య లాభాలు అందుకున్నట్లు, ఇతర ఆదాయం రూ. 447 కోట్లకు చేరినట్లు తెలిపింది. గెడైన్స్ తగ్గింపు పెట్టుబడుల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ క్యూ3లో ఆర్డర్లు 21% ఎగసి రూ. 21,722 కోట్లను తాకినట్లు రామన్ చెప్పారు. వెరసి డిసెంబర్ చివరికి మొత్తం ఆర్డర్ బుక్ విలువ 13% బలపడి రూ. 1,71,184 కోట్లకు చేరినట్లు తెలిపారు. వీటిలో విదేశీ ఆర్డర్ల వాటా 15%గా పేర్కొన్నారు. క్యూ3లో ఇన్ఫ్రా రంగం నుంచి 36% అధికంగా ఆర్డర్లు లభించినట్లు తెలిపారు. వీటి విలువ రూ. 18,390 కోట్లుకాగా, వీటిలో విదేశీ వాటా 41%గా వెల్లడించారు. విద్యుత్, మెటలర్జికల్, మెటీరియల్ హ్యాండ్లింగ్(ఎంఎంహెచ్) విభాగాల నుంచి ఆర్డర్లు భారీగా క్షీణించినట్లు తెలిపారు. స్థూల ఆర్థిక వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ఆర్డర్లరాక తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు శంకర్ రామన్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆదాయ అంచనాలను సాధించడం కష్టమేనని వ్యాఖ్యానించారు. పూర్తి ఏడాదికి అమ్మకాల్లో 15%, ఆర్డర్లను సాధించడంలో 20% వృద్ధిని కంపెనీ ఇంతక్రితం అంచనా వేసింది. అయితే ఆర్డర్ల లక్ష్యాన్ని 15%కు తగ్గిస్తున్నట్లు రామన్ చెప్పారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటివరకూ రూ. 57,000 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినప్పటికీ, మరో రూ. 30,000 కోట్ల కాంట్రాక్ట్‌లను సాధించాల్సి ఉన్నదని చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 0.7% తగ్గి రూ. 1,005 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఉద్యోగం..ప్రణాళిక ముఖ్యం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: చక్కని ప్రణాళిక ఉంటే బ్యాంక్ ఉద్యోగం సాధించడం అంత కష్టమేమీ కాదని ట్రూఫెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్(టైమ్) ఫ్యాకల్టీ ప్రొఫెసర్ రామన్ తెలిపారు. అలాగే అభ్యర్థుల్లో పట్టుదల, క్రమశిక్షణ కూడా ముఖ్యంగా ఉండాలని చెప్పారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సాక్షి, టీఐఎంఇ సంయుక్తంగా శనివారం బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లరికల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, అలాగే ఐసెట్‌కు ఎలా సిద్ధం కావాలనే విషయంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రెండుపూటల జరిగిన ఈ సదస్సుకు దాదాపు 800 మంది డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సదస్సులో బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి నమూనా పరీక్ష నిర్వహించి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని తెలిపారు. బ్యాంకింగ్ రంగంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలూ భారీగానే ఉన్నాయని చెప్పారు. ఆంగ్లం, గణితం, లాజిక్ రీజనింగ్‌లో పట్టు ఉంటే ఉద్యోగాలు సాధించడం తేలిక అవుతుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా బ్యాంకు ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి సారించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయని, అయితే సమయం తక్కువ పోటీ ఎక్కువగా ఉండటంతో కొంత గందరగోళానికి గురవుతుంటారని తెలిపారు. నిర్ణీత సమయంలో పరీక్ష రాయడానికి తగిన క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. వివిధ పోటీ పరీక్షలు రాయడానికి ఎలా ప్రణాళిక రూపొందించుకోవాలో వివరించారు. బ్యాంకు ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి చైర్మన్ హోదాలను పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్వ్యూ అంటే భయపడాల్సిన అవసరం లేదని, అది ముఖాముఖిగా మాట్లాడుకోవడమే అని తెలుసుకోవాలన్నారు. ఐ-సెట్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సీజీఎల్ పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కావాలనే పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీఐఎంఇ ప్రతినిధులు కిరణ్, పవన్, హితేందర్, సత్యనారాయణ, ప్రేమ్‌సాయి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు ద్వారా తాము ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు.