
తరగతి గదిలో కూర్చొని పాఠాలు వింటున్న కలెక్టర్ రామన్, సీఈఓ మార్స్
వేలూరు: విద్యార్థులతో కలిసి కూర్చుని కలెక్టర్ పాఠాలు విన్నారు. ఈ ఘటన వేలూరు చోటుచేసుకుంది. ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ రామన్, విద్యాశాఖ సీఈఓ మార్స్‌లు తనిఖీలు చేపట్టారు. వేలూరు కొనవట్టం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదిలో పాఠాలు వినేందుకు విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. సుమారు 45 నిమిషాలపాటు విద్యార్థి తరహాలోనే కలెక్టర్ కూర్చొని ఉండడం పలువురిని ఆశ్చర్య పరిచింది. అనంతరం విద్యార్థులు చదవడం, రాయడం, విద్యార్థుల విద్యా నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని టీచర్‌లకు సూచించారు. అనంతరం టీచర్‌ల రిజిస్టర్ పుస్తకాన్ని పరిశీలించారు. సెలవు పెట్టిన టీచర్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment