ముంబై: మహారాష్ట్రలోని అమరావతి నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న 'నవనీత్ కౌర్'కు ఊరట లభించింది. కౌర్ కులధ్రువీకరణపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్) విషయంలో కమిటీ నివేదికపై హైకోర్టు జోక్యం చేసుకోకూడదని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
నవనీత్ కౌర్ షెడ్యూల్డ్ కులానికి (ఎస్సీ) సంబంధించిన వారు కాదంటూ గతంలో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా రూ. 2లక్షల జరిమానా కూడా విధించింది. ఆ తరువాత బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని నవనీత్ కౌర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేడు ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది.
నా పుట్టుకపై ప్రశ్నలు వేసిన వారికి సమాధానం దొరికింది. సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. ఇది బాబా సాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో నడిచే వారి విజయమని నవనీత్ కౌర్ అన్నారు.
2019లో ఎన్‌సీపీ మద్ధతుతో అమరావతి ఎంపీగా గెలిచిన నవనీత్ కౌర్.. ఇటీవల నాగ్‌పూర్‌లో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో బీజేపీలో చేరి అమరావతి నుంచి పోటీ చేస్తున్నారు. నవనీత్ కౌర్ తన భర్త రవి రాణాతో కలిసి గురువారం లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు అమరావతిలోని హనుమాన్‌గర్హి మందిర్‌లో ప్రార్థనలు చేశారు.
Supreme Court today stayed the order of Bombay High Court that had cancelled the caste certificate of Navneet Kaur Rana, who is an independent Member of Parliament (MP) from Amravati in Maharashtra.
— ANI (@ANI) June 22, 2021
(File photo) pic.twitter.com/vPz2gM6lXQ
Comments
Please login to add a commentAdd a comment