
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ ని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శనివా రం ఎంబీ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరంగా మారిందని, సామాన్యులు మొదలు రైతులు, కార్మికులు అన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తోందన్నారు.
అదేవిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంతో లాలూచిగా వ్యవహరిస్తోందని, వివిధ సందర్భాల్లో కేంద్రంపై చేసిన ఉద్యమా ల్లో టీఆర్‌ఎస్ పార్టీ స్పందనతో ఈ విషయం అర్థమవుతోందన్నారు. పోడు రైతులందరికీ పట్టాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు అంశంపై ప్రభుత్వానికి పక్షం రోజులు గడువిస్తున్నామని, స్పందించకుంటే భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. హుజూరాబాద్ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ 80 వేల ఉద్యోగాల ప్రకటనను తెరపైకి తెచ్చారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment