
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ క్రీడలో జనసేన అధినేత పవన కల్యాణ్ పావుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ను బలి చేసేందుకు చంద్రబాబు మరో కొత్త ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో, జనసైనికులకు గట్టి షాక్ తగిలే అవకాశముంది.
కాగా, చంద్రబాబు ఢిల్లీ వేదికగా బీజేపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొత్తు ఉండాలంటే బీజేపీ తాము అడిగిన స్థానాలివ్వాలనే కండీషన్ పెట్టింది. దీంతో, బీజేపీ అడుగుతున్న స్థానాల విషయంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు.. మరో కొత్త ప్లాన్ చేసినట్టు సమాచారం.
పొత్తులో భాగంగా బీజేపీ కోరుకుంటున్న ఎంపీ సీట్లను జనసేన కోటా నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమి పొత్తులో భాగంగా మూడు లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, జనసేనకు కేటాయించిన మూడు లోక్‌సభ స్థానాల నుంచే సీట్లను కట్ చేసే ప్లాన్ చంద్రబాబు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్‌ను చంద్రబాబు ఒప్పంచే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై ఢిల్లీ వేదికగా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షాతో పొత్తుల విషయం చర్చించేందుకు చంద్రబాబు, పవన్ పడిగాపులు కాస్తున్నారు. అయితే, అమిత్ షా మాత్రం చంద్రబాబును పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడంలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment