పవన్‌ను లక్ష్యంగా చేసుకొని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చేస్తున్న సోషల్ మీడియా సర్కులేషన్ వెనుక టీడీపీ నేతల హస్తం ఉందా?. ఈ ప్రచారం వెనక అసలు కారణం ఏంటి? సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో నిజమెంత?
పవన్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమని, కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యం ఉండడంతోనే జనసేనతో కలిసి బరిలో దిగామని కిషన్‌రెడ్డి అన్నారు.
అసలేం జరిగిందంటే..?
సోషల్ మీడియాలో నిన్న జరిగిన ప్రచారం ఏంటంటే...
పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిషన్ రెడ్డి
పవన్ కళ్యాణ్ నీ నమ్ముకొని గ్రేటర్ లో నష్టపోయాం
పవన్ తో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు రాష్ట్ర ప్రజలు మా విలువ తగ్గించారు.
ఆ సంగతి గ్రహించే పొత్తుని ఉప సంహరించుకోవాలని అధిష్టానం సూచించింది.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పొయింది.
సొంతంగా పోటీ చేసి ఉంటే కనీసం గ్రేటర్ పరిధిలో 4-5 సీట్లు గెలిచే అవకాశం ఉండేది.
కనీసం మా కార్పొరేటర్ల మాట విన్నా బాగుండేదని అనిపించింది.
హైదరాబాద్ వెలుపల సీట్లు, ఓట్లు సాధించినా, సిటీలో పోటీ ఇవ్వలేకపోయాం.
గట్టి పోటీ ఇచ్చి గెలుస్తామని భావించిన లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి,కుత్భూలాపూర్, యాకుత్‌పురా, ఉప్పల్, రాజేంద్రనగర్... సీట్లు కేవలం పవన్ కళ్యాణ్ తో పొత్తు కారణంగానే ఘోరంగా ఓడిపోయం
సెటిలర్స్ లో ఉన్న కాపు, కమ్మ సామాజిక వర్గం నాతోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మించాడు.
ఈ ప్రచారం వెనక ఎవరి హస్తం ?
తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం జనసేన పొత్తుతో పోటీ చేస్తామని నిర్ణయించుకున్నారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల చర్చలు జరుగుతున్నాయి. తనకు కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు అలాగే ఐదు ఎంపీ టికెట్లు కావాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు. అయితే 20 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని అలాగే 3 ఎంపీ టికెట్లు ఇస్తామని తెలుగుదేశం చెబుతోంది.
తెలంగాణలో బీజేపీతో 8 సీట్లకే ఒప్పుకున్నందుకు ఏపీలో 20 సీట్లు సరిపోతాయన్నది చంద్రబాబు లెక్క. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విలువను తగ్గించేందుకు సోషల్ మీడియాను టిడిపి అస్త్రంగా చేసుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ సోషల్ మీడియా వేదిక గా తెలుగుదేశం పలుకుట్రలు అమలు చేసిందన్నది జనసేన సైనికుల ఆరోపణ.
పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలుమార్లు చంద్రబాబు లోకేష్‌లను నేరుగా విమర్శించాడు. 2018-2019 మధ్య కాలంలో తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించాడు. తాజాగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చేస్తున్న సోషల్ మీడియా సర్కులేషన్ వెనుక టిడిపి నేతల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. తద్వారా పవన్, జనసేన విలువను తగ్గించి ఆ పార్టీకి వీలైనన్ని తక్కువ సీట్లు ఇచ్చేలా ఒప్పించవచ్చన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: జనసేన కేడర్‌కు, పవన్‌కు వార్
Comments
Please login to add a commentAdd a comment