ఏ ముఖంతోనో.. వచ్చాక ప్రధాని చెబుతారు | Telangana BJP Chief Bandi Sanjay Comments On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఏ ముఖంతోనో.. వచ్చాక ప్రధాని చెబుతారు

Published Fri, Jun 24 2022 1:38 AM | Last Updated on Fri, Jun 24 2022 1:38 AM

Telangana BJP Chief Bandi Sanjay Comments On PM Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మోదీ ముఖం మంచిదే. ఆ ముఖంతోనే వస్తున్నారు. మోదీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేసీఆర్‌కు బాగా తెలుసు. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా మోదీయే సమాధానం చెబుతారు’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రధానిపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలనుద్దేశించి విలేకరులడిగిన ప్రశ్నకు సంజయ్‌ స్పందించారు.

కబ్జాలు, హత్యలు అత్యాచారాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చిన కేసీఆర్, ఏ ముఖం పెట్టుకుని దేశమంతా తిరుగుతున్నారని ఎదురు ప్రశ్నించారు. వరం గల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ కార్పొరేటర్‌ నాగమళ్ల ఝా న్సీరాణి, ఎన్‌ఆర్‌ఐ నాగమళ్ల సంతోష్‌ ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వాదులారా.. బీజేపీలో చేరండి. అరాచక పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ మెడలు వంచు దాం. టీఆర్‌ఎస్‌ పాలనను బొంద పెడదాం’’ అని పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement