సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నావల్ల కాదు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతున్నాడో జానారెడ్డి, కోమటిరెడ్డి, జాగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో?. మా దగ్గర సీనియర్లు బాస్‌లు.. అదే కాంగ్రెస్‌లో హోంగార్డ్స్’’ అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
‘‘హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తాం. మేము గెలుపు పరంపరం కొనసాగిస్తున్నాం.. వారు ఓటమి పరంపర సాగిస్తున్నారు. డిపాజిట్లు కోల్పోయిన పరంపర సాగుతోంది. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ మాది కాదు. ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలి’’ అని బండి సంజయ్ అన్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు షాక్.. రేవంత్‌పై ఆరోపణలతో బీజేపీలో చేరిక
‘‘తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదు. జెండా ఎగురవేయనందుకు కేసీఆర్‌కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలి. 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాం. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాం. క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్వహించేలా చేశారు’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment