సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల అని, ఇది ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బడ్జెట్‌ను ‘శుష్క వాగ్దానాలు–శూన్య హస్తా లుగా అభివర్ణించారు. ‘ఆత్మస్తుతి – పరనింద’ మాదిరి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం.. కేంద్రాన్ని తిట్టడం తప్ప ఏమీ లేదని ధ్వజ మెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని బండి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండిచేయి చూపారని పేర్కొన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధు లకు పొంతనే లేదని ఎత్తిచూపారు. ‘రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ.1.31 లక్షల కోట్లుగానే చూపింది.
మిగిలిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్ప కపోవడం సిగ్గుచేటు. కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూపేణా ఈ బడ్జెట్‌లో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోంది. ఇవిపోగా మిగిలిన ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం మద్యం, భూముల అమ్మకం, అప్పులు, ప్రజలపై భారం మోపి సమకూర్చుకునేందుకు కుట్ర చేస్తోంది.సర్కార్ డొల్ల బడ్జెట్‌ను ప్రజల్లో ఎండగడతాం’ అని ప్రకటించారు.
ప్రజలపై మరింత భారం మోపేలా...
‘విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులున్నాయి. ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం సంపాదనలో విద్య, వైద్యానికి 50 శాతానికిపైగా ఖర్చు చేస్తున్నారు. మొత్తం బడ్జెట్‌లో విద్యకు 7 శాతం, వైద్యానికి 4 శాతంలోపు మాత్రమే నిధులు కేటాయించడాన్ని చూస్తుంటే పేద, మధ్య తర గతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులున్నాయి’ అని విమర్శించారు.
‘తెలంగాణకు కేంద్రం నిధులివ్వడం లేదని విమర్శిస్తున్న కేసీఆర్ కేంద్రం నిధులతో నిర్మించిన రైతు వేదికలు, వైకుంఠధా మాలు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, వీధిదీ పా ల ఏర్పాట్లన్నీ తామే చేస్తున్న ట్లుగా నీచ రాజ కీయాలకు అద్దం పడుతోంది. దళితబంధుపై ప్రజలను దగా చేశారు. రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలంటే మరో శతాబ్దం సమయం కూడా సరిపోదు. ఎస్టీ శాఖకు కేటాయించిన నిధులు గిరిజనబంధుకు చాలని పరిస్థితి. రాష్ట్రంలో 52 శాతానికిపైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులే కేటాయించడం బాధాకరం’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment