సాక్షి, హైదరాబాద్ : వరుస ఓటములతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల లేఖ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. నాయకత్వ మార్పు కోరుతూ పార్టీ సీనియర్లు రాసిన లేఖ పలువురు నేతల ఆగ్రహానికి దారితీస్తోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రజలకు, పార్టీకి అండగా నిలిచిన గాంధీ కుటుంబమే పార్టీ పగ్గాలు చేపట్టాలని రాష్ట్రానికి చెందిన సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం.. సీల్పీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్న తరుణంలో సీనియర్లు లేఖలు రాయడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వాన్ని తట్టిలేపి, ప్రజల పక్షన సోనియా, రాహుల్ పోరాడారని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీకి, సోనియా, రాహుల్ గాంధీకి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. (సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు)
ఇక ఇదే అంశంపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ లో పదవులు అనుభవించి ఇప్పుడు కొందరు పార్టీకి వ్యతిరేకంగా లేఖలు రాస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీ అధికార కాంక్షతో లేరు. కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం పనిచేయాలి. రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి’ అని వ్యాఖ్యానించారు. (అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా)
చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ కార్యకర్త సోనియా, రాహుల్ నాయకత్వం కోరుకుంటున్నారు. బహిరంగ లేఖ రాసిన నేతల తీరును ఖండిస్తున్నాం. బహిరంగ లేఖ రాసిన నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment