సాక్షి, హైదరాబాద్: రైతులు తాము పండించిన ధాన్యాన్ని పెట్టుకుని రోడ్లపై పడుకుంటే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు హాయిగా ఇంట్లో పడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యా ఖ్యానించారు. రైతులు ఎండల్లో ఎండుతుంటే, కేసీఆర్ మాత్రం ఏసీలో ఉంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం సమస్య టీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి సృష్టించిందే అని ఆరోపించారు.
దేశంలోని ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ, ఇప్పుడు రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రోడ్లపై పడాల్సి రావడానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌లే కారణమని విమర్శించారు.
సీఎం ఢిల్లీ వెళ్తేనే పరిష్కారం కాని సమస్య, మంత్రులు వెళ్తే అవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు తాము ఇష్టం వచ్చిన పంటను పండించుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment