![Telangana Finance Minister Harish Rao Elected President Of Exhibition Society - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/30/HARISH-RAO-5.jpg.webp?itok=Q6okRW44)
అబిడ్స్ (హైదరాబాద్): ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎన్నికయ్యారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ కార్యాలయంలో జరిగిన ఎగ్జిబిషన్ సొసైటీ కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆరున్నర ఏళ్ల పాటు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొన్ని నెలల కిందట రాజీనామా చేయడంతో.. హరీశ్‌రావును నూతన అధ్యక్షుడిగా నియమించారు.
2021–22 ఏడాదికి ఈ నూతన కమిటీ అధికారంలో కొనసాగుతుంది. ఉపాధ్యక్షుడిగా బి.ప్రభాశంకర్, గౌరవ కార్యదర్శిగా ఆదిత్య మార్గం, జాయింట్ సెక్రెటరీగా చంద్రశేఖర్, కోశాధికారిగా ధీరజ్‌కుమార్ జైస్వాల్, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా మహ్మద్ ఫయుంఉద్దీన్, పాపయ్య చక్రవర్తి, ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సాజిద్ మహ్మద్ అహ్మద్, వనం సత్యేందర్, సురేశ్‌రాజ్, వంశీ తిలక్‌లు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment